జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆగస్టు 7, 2026న 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించనున్న కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ


వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

प्रविष्टि तिथि: 01 AUG 2026 2:07PM by PIB Hyderabad

భారతదేశ చేనేత వారసత్వాన్ని వేడుకగా జరుపుకునేందుకుదేశ సాంస్కృతికఆర్థికాభివృద్ధికి చేనేత కార్మిక వర్గం అందించిన తోడ్పాటును గుర్తించేందుకు ఆగస్టు 7, 2026న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ (ఆర్‌బీసీసీ)లో 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము హాజరవుతారుఈ వేడుకలో కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్కేంద్ర జౌళి శాఖ రాష్ట్ర మంత్రి శ్రీ పవిత్ర మార్గెరిటాకార్యదర్శి (జౌళి శాఖశ్రీమతి నీలం షామీ రావుఅభివృద్ధి కమిషనర్ (చేనేతడాక్టర్ ఎంబీనా పాల్గొంటారు.

ఈ వేడుకల్లో సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డు గ్రహీతలుజాతీయ చేనేత అవార్డు గ్రహీతలువారి కుటుంబ సభ్యులుదేశవ్యాప్తంగా చేనేత కార్మికులుఅవార్డుల ఎంపిక కమిటీ సభ్యులుచేనేత రంగానికి చెందిన ప్రముఖులుసీనియర్ ప్రభుత్వాధికారులుమీడియా ప్రతినిధులుఇతర విశిష్ట అతిథులు పాల్గొంటారు.

ఈ వేడుకల్లో భాగంగా 2025 సంవత్సరానికి గాను సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులుజాతీయ చేనేత అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందిభారతదేశ చేనేత సంప్రదాయాలను పరిరక్షించటంలో అద్భుతమైన నైపుణ్యంఆవిష్కరణలుకృషికి గుర్తింపుగా 03 సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు, 19 జాతీయ చేనేత అవార్డులతో కలిపి మొత్తం 22 అవార్డులను ప్రతిభావంతులైన చేనేత కార్మికులకు అందజేస్తారు.

ఈ వేడుకలో భారత సుసంపన్నవైవిధ్యభరిత చేనేత వస్త్ర పరిశ్రమను గౌరవిస్తూ నాలుగు స్మారక పోస్టల్ స్టాంపులను కూడా విడుదల చేస్తారు.

ఈ కార్యక్రమంలో రెండు ప్రచురణలు..."ఎర్త్రూట్థ్రెడ్ ఆల్ డైడ్ హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా", హ్యాండ్లూమ్ అవార్డ్స్ బుక్-2025ని ఆవిష్కరిస్తారు.

ఈ కార్యక్రమంలో అవార్డు గెలుచుకున్న చేనేత ఉత్పత్తులను ప్రదర్శనకు పెడతారుసంప్రదాయ కనీ నేతవాల్ హ్యాంగింగ్ నేతలను సందర్శకులు ప్రత్యక్షంగా తిలకించే అవకాశం ఉంటుందిఇది భారతదేశ చేనేత సంప్రదాయాల వైవిధ్యాన్నిహస్తకళా నైపుణ్యాన్ని కళ్లకు కడుతుంది.

ఆగస్టు 7, 2026న జరిగే ప్రధాన కార్యక్రమంతో పాటుజాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదర్శనలుకాన్‌క్లేవ్‌లు (డిజైనర్ఐఐహెచ్‌టీమొదలైన ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఉంటాయి.

దేశంలో అత్యధిక గ్రామీణ ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద రంగాల్లో భారత చేనేత రంగం ఒకటిగా కొనసాగుతోందిఇది 35 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలకు అండగా నిలుస్తోందిఅందులో 70 శాతానికి పైగా మహిళా శ్రామికులున్నారుఆర్థిక ప్రాముఖ్యతతో పాటు భారతదేశ గొప్ప వస్త్ర సంప్రదాయాలను సంరక్షిస్తూపర్యావరణపరంగా స్థిరమైన ఉత్పాదక విధానాలకు ఈ రంగం కీలక తోడ్పాటునందిస్తుంది.

జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 7న నిర్వహిస్తారుఆగస్టు 7, 1905న ప్రారంభించిన స్వదేశీ ఉద్యమం జ్ఞాపకార్థంగా ఈ రోజును జరుపుకుంటారుఈ ఉద్యమం దేశీయ పరిశ్రమలకుభారతదేశ చేనేత రంగానికి నూతనోత్తేజాన్ని అందిస్తుందిదేశ సాంస్కృతిక వారసత్వానికిసామాజిక-ఆర్థికాభివృద్ధికి చేనేత కార్మికులు అందిస్తున్న అమూల్యమైన సేవలను ఈ దినోత్సవం గుర్తిస్తుంది.

2015లో ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశ చేనేత కార్మికుల కళాత్మక నైపుణ్యాన్నిప్రతిభనుఅంకితభావాన్ని వేడుకగా జరుపుకునేందుకు జాతీయ చేనేత దినోత్సవం వేదికగా నిలుస్తోందిచేనేత రంగాన్ని పరిరక్షించేందుకుప్రోత్సహించేందుకుసుస్థిరాభివృద్ధికి ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతను ఇది స్పష్టం చేస్తోంది.

 
 
***

(रिलीज़ आईडी: 2293124) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Khasi , Urdu , हिन्दी , Tamil