నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశీయంగా కంటైనర్ల తయారీ

प्रविष्टि तिथि: 31 JUL 2026 3:39PM by PIB Hyderabad

   ఒక అంతర్జాతీయ నౌకా వాణిజ్య సంస్థ సంస్థ షిప్పింగ్ కంటైనర్ల తయారీ కోసం ఒక భారత కంటైనర్ తయారీ సంస్థకు ఆర్డర్ ఇచ్చింది. తదనుగుణంగా ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో దేశీయ పరిజ్ఞానంతో ఆ సంస్థ ఉత్పత్తి చేసిన నమూనా కంటైనర్‌ను 03.07.2026న ఆవిష్కరించారు. అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌ఓ) నిర్దేశిత ప్రమాణాలు సహా సురక్షిత కంటైనర్లపై అంతర్జాతీయ సదస్సు (సీఎస్‌సీ) తీర్మానం సహా, అంతర్జాతీయ ఆమోదిత నాణ్యత-భద్రత ప్రమాణాలకు అనుగుణంగా షిప్పింగ్ కంటైనర్లను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది.

దేశంలో ప్రపంచ పోటీతత్వం గల కంటైనర్ తయారీ వ్యవస్థ సృష్టి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం  2026-27 బడ్జెట్‌లో ₹10,000 కోట్ల వ్యయంతో ఒక పథకాన్ని ప్రకటించింది.

అలాగే, దేశవ్యాప్తంగా ప్రకటించిన 111 జలమార్గాల నెట్‌వర్క్‌లో ఇప్పటికే సరకు, ప్రయాణిక రవాణాకు వినియోగిస్తున్న 32 జాతీయ జలమార్గాలకు అదనంగా, రాబోయే ఐదేళ్లలో 19 కొత్త మార్గాలను వినియోగంలోకి తెచ్చే ప్రణాళికలను కూడా కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది.

దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యం, సముద్రయాన ఆర్థిక సహాయం, షిప్‌యార్డుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, సంస్కరణల బలోపేతం కోసం ₹69,725 కోట్ల సమగ్ర ప్యాకేజీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలోని కీలక అంశాలివే:

·        ప్రపంచ షిప్‌యార్డ్‌లతో పోలిస్తే భారత యార్డ్‌ల వ్యయ ప్రతికూలతల పరిష్కారం దిశగా ‘షిప్‌బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పాలసీ’కి అదనంగా ‘షిప్‌బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్’ కింద ₹24,736 కోట్లు కేటాయింపు.

·        ఓడల నిర్మాణం, సముద్రయాన రంగానికి దీర్ఘకాలిక ఆర్థిక సహాయం నిమిత్తం ‘సముద్రయాన అభివృద్ధి నిధి’ పేరిట ₹25,000 కోట్లతో నిధి ఏర్పాటు. ఇందులో ₹20,000 కోట్ల సముద్రయాన పెట్టుబడి నిధి, ₹5,000 కోట్ల వడ్డీ ప్రోత్సాహక నిధి అంతర్భాగంగా ఉన్నాయి.

·        గ్రీన్‌ఫీల్డ్ షిప్‌బిల్డింగ్ క్లస్టర్ల ఏర్పాటు, ఇప్పటికే పనిచేస్తున్న షిప్‌యార్డుల సామర్థ్య విస్తరణ ద్వారా భారతీయ ఓడల నిర్మాణ-ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు ₹19,989 కోట్లతో షిప్‌బిల్డింగ్ డెవలప్‌మెంట్ స్కీమ్ ప్రారంభం.

·        ఓడల నిర్మాణ పరిశ్రమలో ప్రతి ఉద్యోగానికీ మరో 5.4 అదనపు ఉద్యోగాల (ఉపాధి గుణకం 6.4) సృష్టికి వీలుంది. అందువల్ల ఈ పథకాల ద్వారా ప్రత్యక్ష-పరోక్ష ఉపాధి సహా సుమారు 2.2 కోట్ల ఉపాధి అవకాశాలు అందిరాగలవు.

కేంద్ర రేవులు-నౌకాయానం-జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ లోక్‌సభలో ఈ రోజు ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబులో ఈ వివరాలను వెల్లడించారు.

***


(रिलीज़ आईडी: 2292568) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Assamese