ఆయుష్
azadi ka amrit mahotsav

సాంప్రదాయిక చికిత్స పద్ధతుల్లో కృత్రిమ మేధ… ముందుకు వచ్చిన ఆయుష్ శాఖ, ఇండియాఏఐ


ఆయుష్‌ రంగంలో ఏఐ ఆధారిత నూతన ఆవిష్కరణల వేగాన్ని పెంచడం, పరిశోధనలనూ, డిజిటల్ హెల్త్‌‌నూ బలోపేతం చేయడంతో పాటు సామర్థ్యాల పెంపునకు తోడ్పడే ఓ అవగాహన ఒప్పందం

అవసరమైన ఆరోగ్య పరిశోధన సమాచారాన్ని పంచుకునేందుకు ఏఐకోశ్ వేదికతో కలిసి పనిచేయనున్న ఆయుష్

प्रविष्टि तिथि: 31 JUL 2026 10:31AM by PIB Hyderabad

ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ (ఏఐఆధారిత నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహించడానికి ఆయుష్ శాఖఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతికతశాఖ (ఎమ్ఈఐటీవై)కి చెందిన ఇండియాఏఐ ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎమ్ఓయూకుదుర్చుకున్నాయిఆయుష్ విస్తారిత అనుబంధ వ్యవస్థను బలోపేతం చేయడానికి సరికొత్త సాంకేతికతలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
అవగాహన ఒప్పందంపై ఎమ్ఈఐటీవై సంయుక్త కార్యదర్శిచీఫ్ విజిలెన్స్ ఆఫీసరు డాక్టర్ కవితా జైన్,  ఎమ్ఈఐటీవై సంయుక్త కార్యదర్శిఇండియాఏఐ మిషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసరు శ్రీ సుదీప్ శ్రీవాస్తవ సంతకాలు చేశారుఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖఇండియాఏఐల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఆయుష్ విస్తారిత అనుబంధ వ్యవస్థలో పరిశోధనలనునూతన ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి ఏఐకి ఉన్న శక్తిసామర్థ్యాలను గురించి డాక్టర్ కవితా జైన్ ప్రస్తావించారుఆయుష్‌లో ఏఐ ఏకీకరణ వల్ల ఫలితాల ఆధారిత పరిశోధనలకీజ్ఞాన నిర్వహణకీనూతన ఆవిష్కరణలకీ కొత్త అవకాశాలు లభిస్తాయని ఆమె అన్నారుపరిశోధనఔషధ మొక్కలుచికిత్సా విధానంలో సహాయంసామర్థ్యాల పెంపుదల వంటి రంగాల్లో ఆధునిక ఏఐని వినియోగించుకోవడానికి ఇండియాఏఐతో సహకారం తోడ్పడుతుందనీదీంతో ఆయుష్ విస్తారిత అనుబంధ వ్యవస్థ మరింత ఎక్కువ స్థాయిలో సాంకేతికత ఆధారితంగానూరాబోయే కాలం అవసరాలను తీర్చడానికి సన్నద్ధమైందిగానూ మారుతుందనీ డాక్టర్ కవితా జైన్ అన్నారు.
భారత సాంప్రదాయిక జ్ఞాన వ్యవస్థలతో ఆధునిక సాంకేతికతలను ఏకీకరించడానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఎమ్ఈఐటీవై సంయుక్త కార్యదర్శిఇండియాఏఐ మిషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసరు శ్రీ సుదీప్ శ్రీవాస్తవ వివరించారుఆయుష్ శాఖఇండియాఏఐ మధ్య అవగాహన ఒప్పందం కుదరడంతో సాంప్రదాయిక ఆరోగ్యసంరక్షణకు సంబంధించిన డేటాసెట్లతో ఏఐకోశ్‌ను సుసంపన్నం చేసే దిశగా ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరించినట్లు అయిందని ఆయన వర్ణించారుసాంప్రదాయిక వైద్య విజ్ఞాన శాస్త్ర పరిశోధకులకువైద్యులకు ఏఐ ఆధారిత నూతన ఆవిష్కరణలు మరింతగా ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.  
ఆయుష్ గ్రిడ్ ఓఎస్‌డీ శ్రీ నమన్ గోయల్ మాట్లాడుతూఆయుష్ గ్రిడ్ తన సరికొత్త సాంకేతికతలతో ఆయుష్ రంగంలో డిజిటల్ మార్పులకు ఊతాన్ని అందించడానికి ఏఐ ఆధారిత వేదికల్ని రూపొందిస్తోందన్నారుప్రస్తుత ఎమ్ఓయూ.. ఆయుష్ విస్తారిత అనుబంధ వ్యవస్థలో ఏఐని ముందుకు తీసుకుపోవడంలో ఓ కీలక ఘట్టంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
ఈ సహకారం.. సాంకేతికత ఆధారిత ఆయుష్ విస్తారిత అనుబంధ వ్యవస్థను పటిష్ఠపరిచే దిశగా ఒక ప్రధాన ఘట్టంఇది సాంప్రదాయిక జ్ఞానాన్నీఏఐ సామర్థ్యాలనీ జోడిస్తుందిపరిశోధనలుసామర్థ్యాల పెంపుదలఔషధ మొక్కలుచికిత్సా విధానంలో సహాయం వంటి ఆయుష్ కీలక రంగాల్లో ఏఐ సేవలను విరివిగా ఉపయోగించుకోవడంపై ఈ భాగస్వామ్యంలో దృష్టిని కేంద్రీకరిస్తారు.
ఈ సహకారంలో భాగంగాఏఐకోశ్ వేదికతో ఆయుష్ శాఖ జతపడుతుందిఫలితంగా డేటాసెట్లుమెటాడేటాఏఐ మోడళ్లుటూల్‌కిట్లువాటిని ఉపయోగించే సందర్భాలు సహా యోగ్యమైన ఆరోగ్య పరిశోధన సామాగ్రిని పంచుకొనేందుకు అవకాశం కలుగుతుందిఆయుష్ రంగానికి ఉపయోగపడే బాధ్యతాయుత ఏఐ సేవల్ని అభివృద్ధిపరచడానికీనూతన ఆవిష్కరణలకీ ఈ ఏకీకరణ మరింత ఎక్కువ స్థాయిలో తోడ్పడుతుందని భావిస్తున్నారు.
నిర్దిష్ట సేవల ఒప్పందాలకు లోబడిఇండియాఏఐ కార్యక్రమం ఆధ్వర్యంలో తక్కువ ధరలకు జీపీయూ ఆధారితఉన్నత స్థాయి పనితీరు కనబరిచే కంప్యూటింగ్ పద్ధతుల్ని రూపొందించడానికి ఈ ఎమ్ఓయూ దోహదపడుతుందిఉన్నత స్థాయి కంప్యూటింగ్ పద్ధతులు అందుబాటులోకి రావడంతో కీలక మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడమే కాకుండా ఆరోగ్యసంరక్షణ సేవలుసాంప్రదాయిక చికిత్సలో అత్యాధునిక ఏఐ పరిశోధనలతోపాటు సేవలను విస్తరించడానికి కూడా తోడ్పాటు లభిస్తుందని భావిస్తున్నారు.  
ఈ కార్యక్రమం భారత సుసంపన్న సాంప్రదాయిక వైద్య పద్ధతుల్ని అత్యాధునిక డిజిటల్ఏఐ సాంకేతికతతో జోడించే దిశలో ఒక ముఖ్య ఘట్టాన్ని ఆవిష్కరించిందిఇది మరింత వినూత్నఫలితాలపై ఆధారపడేరాబోయే కాలం అవసరాలను తీర్చగలిగే ఆయుష్ విస్తారిత అనుబంధ వ్యవస్థను తీర్చిదిద్దడానికి సహకరిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2292317) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati