రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
టోల్ ప్లాజాల వద్ద ప్రపంచ స్థాయి పబ్లిక్ టాయిలెట్ సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎన్‌హెచ్‌ఏఐ
మెరుగైన పరిశుభ్రత, డిజిటల్ పర్యవేక్షణ, ప్రయాణికుల కేంద్రీకృత నిర్వహణకు నూతన హైబ్రిడ్ పనితీరు ఆధారిత ఫ్రేమ్‌వర్క్
प्रविष्टि तिथि:
30 JUL 2026 5:41PM by PIB Hyderabad
జాతీయ రహదారి వ్యవస్థ వెంట ప్రయాణీకుల సౌకర్యాలను, టాయిలెట్ సదుపాయాలను మెరుగుపరచటంలో భాగంగా టోల్ ప్లాజాల వద్ద ప్రపంచ స్థాయి పబ్లిక్ టాయిలెట్ సౌకర్యాల అభివృద్ధికి ఎన్‌హెచ్‌ఏఐ దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం వినూత్న పనితీరు ఆధారిత ఒప్పందాల ఫ్రేమ్‌వర్క్ ద్వారా టోల్ ప్లాజా వద్ద శానిటేషన్ బ్లాకులను మెరుగుపరచాలని, అత్యున్నత స్థాయి పరిశుభ్రత, పనితీరు, దీర్ఘకాలిక నిర్వహణ ఉండేలా చూడాలని భావిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఉన్న టాయిలెట్ బ్లాకుల పునరుద్ధరణను చేపట్టటంతో పాటు, పటిష్టమైన నిర్మాణాలనును స్థిరమైన, హరిత భవన నిర్మాణాలతో మిళితం చేసే ప్రామాణికమైన, స్వదేశీంగా అభివృద్ధి చేసిన డిజైన్లను పరిచయం చేసేందుకు కొత్త సౌకర్యాలను ఎన్‌హెచ్‌ఏఐ సృష్టిస్తుంది. మెరుగుపరచిన ఈ శానిటేషన్ సౌకర్యాలు జాతీయ రహదారి వ్యవస్థ వ్యాప్తంగా ఒకే రకమైన నాణ్యతా ప్రమాణాలను కల్పిస్తూ, పరిశుభ్రమైన, సురక్షితమైన, అందుబాటులో ఉండే ప్రజా సౌకర్యాలను అందిస్తాయి.
సేవల నాణ్యత నిరంతరం కొనసాగేలా చూసేందుకు సాంకేతిక ఆధారిత నిర్వహణ విధానాన్ని ఎన్‌హెచ్‌ఏఐ అవలంబించింది. దీనిద్వారా సౌకర్యాల నిర్వహణ జరుగుతుంది. నిర్వహణ ప్రమాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారిత లైవ్ టెలిమెట్రీ వ్యవస్థలతో అనుసంధానిస్తారు. దీనిద్వారా సకాలంలో సమస్యలను గుర్తించి, సమర్థవంతమైన సేవలను అందించవచ్చు.
ఈ ఫ్రేమ్‌వర్క్ జవాబుదారీతనంతో ఉండేలా పటిష్టమైన పనితీరు-ఆధారిత చెల్లింపు విధానాన్ని కూడా ప్రవేశపెడుతుంది. నిర్వహణ ఏజెన్సీలు ఆటోమేటెడ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లు (ఎస్ఎల్ఏలు), కాలానుగుణ స్వతంత్ర ఆడిట్లు, ఎన్‌హెచ్‌ఏఐ 'రాజ్‌మార్గ్‌యాత్ర' మొబైల్ యాప్ ద్వారా స్వీకరించిన ప్రయాణికుల అభిప్రాయం ద్వారా మూల్యాంకనం జరుగుతుంది.
దివ్యాంగుల హక్కుల చట్టం (ఆర్‌పీడబ్ల్యూడీ)-2016కి అనుగుణంగా కొత్తగా నిర్మించే సదుపాయాలన్నింటిలో దివ్యాంగులకు సులభమైన ప్రవేశాన్ని కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. మహిళా ప్రయాణికుల భద్రత, గోప్యతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ.. స్వచ్ఛమైన తాగునీరు, ఆధునిక పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలు, మెరుగైన పరిశుభ్రతా ప్రమాణాలను కల్పిస్తారు.
జాతీయ రహదారుల వ్యవస్థలో ప్రయాణ అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరచటంతో పాటు ప్రజా సౌకర్యాల విషయంలో నూతన ప్రమాణాలను నెలకొల్పాలని ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం డిజిటల్ మానిటరింగ్, ఫలితాల ఆధారిత నిర్వహణతో కూడిన ఆధునిక పారిశుద్ధ్య సౌకర్యాలను ఎన్‌హెచ్‌ఏఐ కల్పిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2292141)
आगंतुक पटल : 9