శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంట్ ప్రశ్న: పరిశోధన, అభివృద్ధిపై వ్యయం

प्रविष्टि तिथि: 30 JUL 2026 4:35PM by PIB Hyderabad

శాస్త్ర సాంకేతిక శాఖ (డీఎస్‌టీ) విడుదల చేసిన నివేదిక ‘పరిశోధన, అభివృద్ధి గణాంకాలు: 2025-26’ ప్రకారం గత ఐదేళ్లలో వివిధ రంగాల వారీగా పరిశోధన, అభివృద్ధికి చేసిన వ్యయం వివరాలు కింది విధంగా ఉన్నాయి:

సంవత్సరం

2019-20

2020-21

2021-22

2022-23

2023-24

ప్రభుత్వ రంగం

87,813.47

80,992.83

1,06,133.32

1,10,949.77

1,17,861.21

ప్రైవేట్ రంగం

44,753.54

46,388.13

88,677.51

1,02,428.35

1,26,906.60

‘ఆర్-డీ’పై స్థూల వ్యయం (జీఈఆర్ డీ)

132,567.01

127,380.96

194,810.83

213,378.12

244,767.81

జీడీపీలో జీఈఆర్‌డీ శాతం

0.66

0.64

0.83

0.82

0.84

గమనిక:

  1. ప్రభుత్వ రంగం: దీనిలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన సంస్థలు+ రాష్ట్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు + ప్రభుత్వ రంగ, ఉమ్మడి రంగ పరిశ్రమలు + ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు చేసిన ఆర్-డీ వ్యయం కలిసి ఉంటుంది.

  2. ప్రైవేట్ రంగం: దీనిలో ప్రైవేట్ రంగ పరిశ్రమలు + శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా సంస్థలు (ఎస్ఐఆర్ఓ) + ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు చేసిన అర్‌-డీ వ్యయం కలిసి ఉంటుంది.

శాస్త్రీయ పరిశోధనల్లో పెట్టుబడులను పెంచడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అవి:

  • శాస్త్రీయ శాఖలు, పరిశోధనాత్మక కార్యక్రమాలకు బడ్జెట్ కేటాయింపులను క్రమంగా పెంచడం.

  • ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో కూడిన అధిక రిస్క్ ఉన్న, వ్యూహాత్మక పరిశోధనలకు మద్దతుగా రూ. 1.0 లక్ష కోట్ల పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణల (ఆర్‌డీఐ) నిధిని ప్రారంభించడం. ఈ పరివర్తనాత్మక కార్యక్రమం.. అత్యంత ప్రభావవంతమైన ఆర్-డీలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని, పెట్టుబడులను వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

  • కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 14,000 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో, ప్రభుత్వేతర వనరుల నుంచి అదనపు నిధులను సమకూర్చడం ద్వారా ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్)’ను ఏర్పాటుచేయటం.

  • జాతీయ క్వాంటమ్ మిషన్ (బడ్జెట్ కేటాయింపు రూ. 6,003.65 కోట్లు), నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ (బడ్జెట్ కేటాయింపు రూ. 3,660 కోట్లు), ఇండియా సెమీకండక్టర్ మిషన్ (బడ్జెట్ కేటాయింపు రూ. 76,000 కోట్లు), నేషనల్ సూపర్‌కంప్యూటింగ్ మిషన్ మొదలైన జాతీయ మిషన్ల ప్రారంభం. 

  • పరస్పర సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం 'నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్', 'నేషనల్ క్వాంటమ్ మిషన్'ల కింద ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల (పీపీపీలు) ప్రోత్సాహం, సాంకేతిక కేంద్రాల ఏర్పాటు.

  • స్వదేశీ సాంకేతిక అభివృద్ధి, నమూనాల తయారీ (ప్రాటోటైపింగ్), విస్తరణ, పరిశ్రమలతో అనుసంధానానికి మద్దతు ఇస్తూ దిగుమతి చేసుకునే సాంకేతికతలపై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం ‘నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెస్సింగ్ ఇన్నోవేషన్స్ (నిధి)’, ‘బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ)’ కార్యక్రమాలు, ‘ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడీఈఎక్స్)’, ‘టైడ్ 2.0’ వంటి సాంకేతిక ఆధారిత ఆవిష్కరణ కార్యక్రమాల అమలు ద్వారా భారతదేశంలో 'ఆవిష్కరణ నుంచి తయారీ వరకు' గల ప్రక్రియను బలోపేతం చేయడం.

  • ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచే నిబంధనలతో కూడిన 'జియోస్పేషియల్ విధానం 2022', 'అంతరిక్ష విధానం 2023', 'బయో-ఈ3 (ఆర్థికం, పర్యావరణం, ఉపాధి కల్పన కోసం జీవ సాంకేతికత) విధానం 2024' వంటి సానుకూల విధాన చట్రాలను ప్రవేశపెట్టటం. 

ఈ చర్యలన్నీ భారతదేశ అర్-డీ సామర్థ్యాలను బలోపేతం చేయడం.. విద్యారంగం, పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య సహకారాన్ని పెంపొందించడం.. కాలక్రమేణా జాతీయ అర్-డీ వ్యయాన్ని నిరంతరం పెంచడానికి అనుకూల పరిస్థితులను సృష్టించడం, శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశానికి ఉన్న అంతర్జాతీయ పోటీతత్వాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీఓ- వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్) విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌‌ (జీఐఐ) ఆధారంగా నైపుణ్యం కలిగిన భారతీయ మానవ వనరుల ప్రదర్శనను నీతి ఆయోగ్ విశ్లేషించింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) ర్యాంకింగ్‌లో భారత్ 2021లోని 46వ స్థానం నుంచి 2025 నాటికి 38వ స్థానానికి ఎగబాకింది. దేశం ఇన్నోవేషన్ ఇన్‌పుట్‌ల (వనరుల లభ్యత) కంటే ఇన్నోవేషన్ అవుట్‌పుట్‌లలో (ఫలితాల సాధనలో) నిలకడగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇది అత్యున్నత ఆవిష్కరణ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. అందుబాటులో ఉన్న వనరులను విజ్ఞాన సృష్టి, సాంకేతిక పురోగతి, సృజనాత్మక ఫలితాలు వంటి స్పష్టమైన ఆవిష్కరణలుగా మార్చడంలో దేశం సమర్థవంతంగా పనిచేస్తోందని ఇది తెలియజేస్తోంది. మధ్య, దక్షిణ ఆసియాతో పాటు దిగువ మధ్యదాయ దేశాలలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దేశంగా భారత్ నిలిచింది.

కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా).. ప్రధాని కార్యాలయం, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఈ సమాచారాన్ని ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో తెలియజేశారు.


(रिलीज़ आईडी: 2292138) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Tamil , Telugu