శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటులో ప్రశ్నోత్తరాలు: జాతీయ క్వాంటం మిషన్ (ఎన్‌క్యూఎం)

प्रविष्टि तिथि: 30 JUL 2026 4:33PM by PIB Hyderabad

   జాతీయ క్వాంటం మిషన్‌ (ఎన్‌క్యూఎం) కింద “క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెన్సింగ్ అండ్‌ మెట్రాలజీ, క్వాంటం మెటీరియల్స్ అండ్‌ డివైజెస్” రంగాలలో ఏర్పాటు చేసిన నాలుగు ఇతివృత్తాధారిత కేంద్రాల (టీ-హబ్‌) ప్రధాన బాధ్యతలలో మానవ వనరుల అభివృద్ధి కూడా ఒకటి. తదనుగుణంగా మానవ వనరుల అవసరాలపై అంచనాల రూపకల్పనతోపాటు ఆమోదిత ప్రాజెక్టు అవసరాల ప్రాతిపదికన ఈ నాలుగు ‘టీ-హబ్‌’లు శాస్త్రీయ-సాంకేతిక మానవ వనరులను కేటాయించాయి.

‘ఎన్‌క్యూఎం’ కింద క్వాంటం సాంకేతికతలలో పరిశోధన, సాంకేతికాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి కోసం మిషన్ పరిధిలోని వివిధ విభాగాల్లో మొత్తం 86 సంస్థలను  గుర్తించారు. వీటిలో భాగంగా ‘టీ-హబ్‌’లతో ముడిపడిన సంస్థల కింద 17 ప్రాజెక్టు బృందాల సహిత 14 సాంకేతిక గ్రూపులు, 23 అండర్ గ్రాడ్యుయేట్ టీచింగ్ లేబొరేటరీలు, క్వాంటం అల్గారిథమ్స్ టెక్నికల్ గ్రూప్ పర్యవేక్షణలో 17 ప్రాజెక్టు బృందాలు ఉన్నాయి. ఈ సంస్థల జాబితాను అనుబంధం-Iలో చూడవచ్చు.

ఇక మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) విభాగం కింద జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌, పోస్ట్-డాక్టరల్ ఫెలోషిప్‌లకు నాలుగు ‘టీ-హబ్‌’లు మద్దతిస్తున్నాయి. మరోవైపు క్వాంటం కంప్యూటింగ్ ‘టీ-హబ్’ కింద ‘క్యూసీ-బ్రిడ్జ్’ పోస్ట్-డాక్టరల్ ఫెలోషిప్‌ను ప్రవేశపెట్టారు. అలాగే, క్వాంటం సెన్సింగ్ అండ్ మెట్రాలజీ టీ-హబ్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరల్-పోస్ట్ డాక్టరల్ విద్యార్థులు, పరిశోధకుల కోసం ‘పరిమాణ ఫెలోషిప్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది.

క్వాంటం సాంకేతికతలలో సహకారం కోసం జపాన్‌తో ఒక ‘ఆసక్తి వ్యక్తీకరణ ఒడంబడిక’పై సంతకం చేయడం ద్వారా ‘ఎన్‌క్యూఎం’ కింద అంతర్జాతీయ సహకారానికి శాస్త్ర-సాంకేతిక విభాగం వెసులుబాటు కల్పించింది.

కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్ర, (స్వతంత్ర బాధ్యత) ప్రధానమంత్రి కార్యాలయ, సిబ్బంది-ప్రజా సమస్యలు-పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష మంత్రిత్వ శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

అనుబంధం - I

వ.సం।।

సంస్థ

1

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి

2

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, తిరుపతి

3

ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం

4

యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్‌

5

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, కడప, వేంపల్లి, ఆంధ్రప్రదేశ్‌

6

రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కర్నూలు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్

7

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, కృష్ణా, నూజివీడు, ఆంధ్రప్రదేశ్

8

గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, గాంధీనగర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

9

జి.ఎం.ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజాం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్

10

విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ (డీమ్డ్ టు బి యూనివర్సిటీ), గుంటూరు, వడ్లమూడి, ఆంధ్రప్రదేశ్

11

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్), గౌహతి, అస్సాం

12

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గువహటి

13

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బి.హెచ్.యు), వారణాసి

14

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భాగల్పూర్, బీహార్

15

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పాట్నా

16

ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, భిలాయ్

17

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డాట్), న్యూఢిల్లీ

18

ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ, ఈశాన్య ఢిల్లీ, షాహాబాద్‌ దౌలత్‌పూర్‌, ఢిల్లీ

19

రామ్‌జాస్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ, న్యూఢిల్లీ

20

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ

21

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఢిల్లీ

22

సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లేబొరేటరీ (ఎస్‌ఎస్‌పిఎల్), డిఫెన్స్‌ రీసెర్చి డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ), న్యూఢిల్లీ

23

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), పోండా, గోవా

24

బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిఐటిఎస్), పిలానీ, గోవా

25

గతి శక్తి విశ్వవిద్యాలయం, వడోదర, గుజరాత్‌

26

స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇస్రో, అహ్మదాబాద్‌

27

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గాంధీనగర్

28

ప్లాక్షా యూనివర్సిటీ, మొహాలీ, పంజాబ్

29

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్), ధన్‌బాద్

30

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జమ్మూ

31

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు

32

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్), బెంగళూరు

33

రామన్ పరిశోధనా సంస్థ, బెంగళూరు

34

జవహర్‌లాల్ నెహ్రూ ఉన్నత శాస్త్రీయ పరిశోధనా కేంద్రం, బెంగళూరు

35

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ధార్వాడ్, హుబ్లీ, కర్ణాటక

36

ఇస్రో ఉపగ్రహ కేంద్రం, బెంగళూరు

37

పూర్ణప్రజ్ఞ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్, ముద్దనాయకనహళ్లి, బిదలూరు, కర్ణాటక

38

ఇండియన్ ఇనిస్టిట్యూట్ పాలక్కాడ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం

39

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్), తిరువనంతపురం

40

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, తిరువనంతపురం

41

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టి), డిఓఎస్, తిరువనంతపురం

42

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మండి

42

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ సి-డాక్, పూణే

43

ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్, పూణే

44

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండోర్

45

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, భోపాల్

46

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే, ముంబయి

47

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్), పూణే

48

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ముంబై

49

విశ్వేశ్వరయ్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాగ్‌పూర్, మహారాష్ట్ర

50

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భువనేశ్వర్

51

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, భువనేశ్వర్

52

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సుందర్‌గఢ్, రూర్కెలా, ఒరిస్సా

53

యూనివర్శిటీ ఆఫ్ కలకత్తా, కోల్‌కతా

54

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, మొహాలి

55

గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయం, అమృత్‌సర్, పంజాబ్

56

పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల (డీమ్డ్ టు బి యూనివర్సిటీ), చండీగఢ్, పంజాబ్

57

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రోపార్

58

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), రూప్‌నగర్‌, జోధ్‌పూర్‌

59

బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ -(బిట్స్ పిలాని) (పిలాని క్యాంపస్)

60

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్

61

శ్రీ జి.ఎస్. ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్. మరియు సైన్స్, ఇండోర్‌

62

సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెక్యూరిటీ (ఎస్‌ఈటీఎస్‌), చెన్నై

63

రాజలక్ష్మి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరువళ్లూరు, చెన్నై, తమిళనాడు

64

ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, (పూర్వం ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ), కాంచీపురం, కట్టంకుళత్తూరు, తమిళనాడు

65

ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చెన్నై

66

బీఐటీఎస్‌ పిలానీ హైదరాబాద్ క్యాంపస్

67

ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ -(ఐఐఐటీ) హైదరాబాద్

68

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ హైదరాబాద్

69

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్

71

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

72

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్

73

హరీష్ చంద్ర రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ప్రయాగ్రాజ్

74

జయపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నోయిడా

75

శారదా యూనివర్సిటీ, గ్రేటర్ నోయిడా

76

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ

77

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్

78

ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్, కోల్‌కతా

79

ది చటర్జీ గ్రూప్ సెంటర్స్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (టీసీజీ క్రెస్ట్‌) కోల్‌కతా

80

ఎస్.ఎన్. బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్, కోల్‌కతా

81

ఎం.సి. కేజ్రీవాల్ విద్యాపీఠ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, హౌరా, పశ్చిమ బెంగాల్

82

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్- (ఐఐఎస్‌ఈఆర్‌) కోల్‌కతా

83

ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్, కోల్‌కతా

84

సాహా ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఆఫ్ కలకత్తా, కోల్‌కతా

85

అడమాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కోల్‌కతా

86

అహ్మదాబాద్ విశ్వవిద్యాలయం, గుజరాత్

 

***


(रिलीज़ आईडी: 2291968) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Tamil