కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీ డాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , సైన్స్ ఆవిష్కరణలు- అభివృద్ధి సంస్థతో టెలిమాటిక్స్ అభివృద్ధి కేంద్రం ఒప్పందం

టెలికాం రంగంలో స్వదేశీ పరిశోధన, అభివృద్ధిని పెంపొందించడమే లక్ష్యంగా పనిచేయనున్న సీ డాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

అధునాతన కమ్యూనికేషన్ సాంకేతికతల్లో అధిక ప్రభావం కలిగిన పరిశోధన, అభివృద్ధికి ప్రత్యేక కేంద్రంగా నిలవనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

టెలికాం రంగంలో స్వావలంబన, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు విద్యా సంస్థలు, పరిశ్రమల సంయుక్త భాగస్వామ్యానికి ఊతం

प्रविष्टि तिथि: 30 JUL 2026 1:46PM by PIB Hyderabad

కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ల విభాగానికి చెందిన ప్రముఖ టెలికాం పరిశోధనఅభివృద్ధి కేంద్రమైన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (టెలిమాటిక్స్ అభివృద్ధి సంస్థ-సీ డాట్), బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ), సైన్స్ ఆవిష్కరణలు-అభివృద్ధి సంస్థతో (ఎఫ్ఎస్ఐడీత్రైపాక్షిక ఒప్పందం కుదిరిందిఉమ్మడి పరిశోధనసాంకేతిక అభివృద్ధి ద్వారా దేశీయ టెలికాం ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషించనుంది.

ఈ ఒప్పందంలో భాగంగా ఐఐఎస్‌సీ బెంగళూరులోని ఎఫ్ఎస్ఐడీ ప్రాంగణంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను  సీ డాట్ ఏర్పాటు చేసిందిఅధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి స్వదేశీ పరిశోధనలుఆవిష్కరణలుసామర్థ్య పెంపువాణిజ్యీకరణను వినియోగాన్ని వేగవంతం చేయడమే ఈ ఎక్సలెన్స్ కేంద్రం ప్రధాన లక్ష్యంవిద్యా రంగానికిపారిశ్రామిక రంగానికి మధ్య ఒక ఉమ్మడి భాగస్వామ్య వేదికగా ఇది వ్యవహరిస్తుందిదేశ డిజిటల్ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక రంగాల్లో అత్యుత్తమ పరిశోధనలునూతన సాంకేతికతల అభివృద్ధిప్రతిభావంతులైన మానవ వనరుల తయారీకి ఎంతగానో తోడ్పడుతుంది.

కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైర్‌లెస్ కమ్యూనికేషన్స్క్వాంటమ్ టెక్నాలజీస్సైబర్ సెక్యూరిటీఏఐ ఆధారిత సమాచార వ్యవస్థలో పరిశోధనలుఆవిష్కరణలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందివీటితో పాటు 5జీ అడ్వాన్స్‌డ్/6జీ సాంకేతికతలుభారీ స్థాయి మిమో వ్యవస్థలుఇంటిగ్రేటెడ్ సెన్సింగ్ అండ్ కమ్యూనికేషన్ఏఐ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థలుపరికరాలుక్వాంటమ్పోస్ట్ క్వాంటమ్ సాంకేతికతలు వంటి వినూత్న రంగాలలో అధునాతన పరిశోధనలు చేపడుతుందిప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన  విద్యా నైపుణ్యాలనుటెలికాం పరిశోధనలో సీ డాట్‌కు ఉన్న విస్తృత అనుభవాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకే వేదికపైకి తీసుకువస్తుందిభవిష్యత్తు అవసరాలకు తగ్గ సమాచార సాంకేతికతల అభివృద్ధిని వేగవంతం చేయడంమేధో సంపత్తిని సృష్టించడండీప్ టెక్ అంకుర సంస్థలకు చేయూతనందించడం దీని లక్ష్యంఉమ్మడి పరిశోధనలువర్క్‌షాప్‌లుశిక్షణ కార్యక్రమాలువిద్యా-పారిశ్రామిక భాగస్వామ్యాల ద్వారా అనుభవాలుఆలోచనలును పంచుకునేందుకు తోడ్పడుతుంది.

నేటి కార్యక్రమంతో సీ డాట్ ఇప్పటి వరకు మొత్తం అయిదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ప్రారంభించిందిగతంలో ఐఐటీ హైదరాబాద్ఐఐటీ కాన్పూర్ఐఐటీ గాంధీనగర్ఐఐటీ రూర్కీలతో కుదుర్చుకున్న ఒప్పందాల వరుసలో ఐఐఎస్‌సీ బెంగళూరు చేరిందిసెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల విస్తరణ దేశీయ ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడంలో సీ డాట్ నిరంతర కృషికి అద్దం పడుతోందిఉమ్మడి పరిశోధనలను ప్రోత్సహించడంస్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను పెంచడం ద్వారా తదుపరి తరం టెలికాం రంగంలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి ఇది దోహదపడుతుంది.

సీ డాట్ సీఈఓ డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ఎఫ్‌ఎస్ఐడీ సీఈఓ శ్రీ ఓంప్రకాశ్ సుబ్బారావు సమక్షంలో ఈ ఒప్పందం జరిగిందిఈ కార్యక్రమానికి ఐఐఎస్‌సీ అధ్యాపకులుసీ డాట్ ఉన్నతాధికారులు హాజరయ్యారుసంతకాల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉమ్మడి అత్యున్నత పరిశోధనలుఆవిష్కరణల ద్వారా సమాచార సాంకేతికతలను ముందుకు తీసుకెళ్లేందుకు కేటాయించిన సీ డాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ‘‘వికసిత్ భారత్ నిర్మాణంలో సురక్షిత స్వదేశీ సమాచార సాంకేతికతల పాత్రసీ డాట్ భాగస్వామ్యం’’  అనే అంశంపై ఐఐఎస్‌సీ ప్రాంగణంలో డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ ప్రసంగించారుభారత్‌లో వేగవంతమైన డిజిటల్టెలికాం పరిణామాలునమ్మకమైన స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను ఆయన ఈ సందర్భంగా వివరించారుతదుపరి తరం టెలికాం నెట్‌వర్క్‌లుసైబర్ సెక్యూరిటీఏఐ ఆధారిత సమాచార వ్యవస్థలుక్వాంటమ్ సురక్షిత సమాచార ప్రసార రంగాల్లో సీ డాట్ అందిస్తున్న మార్గదర్శక సేవలను ప్రస్తావించారు. 6జీ సాంకేతికతలకు ఉన్న విప్లవాత్మక సామర్థ్యాన్నిప్రపంచ టెలికాం రంగ భవిష్యత్తు రూపకల్పనలో భారత్ సాధిస్తున్న ప్రపంచ స్థాయి నాయకత్వాన్ని ఈ సమావేశంలో చర్చించారు.

ఈ భాగస్వామ్య ప్రాధాన్యతను వివరిస్తూ సీ డాట్ సీఈఓ డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ మాట్లాడారు. ‘‘ఐఐఎస్‌సీ బెంగళూరులో సీ డాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయడం దేశ భవిష్యత్తు టెలికాం ఆవిష్కరణల వ్యవస్థలో ఒక వ్యూహాత్మక పెట్టుబడిఐఐఎస్‌సీకి ఉన్న ప్రపంచ స్థాయి పరిశోధనా సామర్థ్యాలనుస్వదేశీ టెలికాం సాంకేతికతల్లో సీ డాట్‌కు ఉన్న విస్తృత అనుభవాన్ని ఈ కేంద్రం ఒకే తాటిపైకి తెస్తుంది. 5జీ అడ్వాన్స్‌డ్, 6జీకృత్రిమ మేధక్వాంటమ్ కమ్యూనికేషన్స్ఇతర నూతన సాంకేతికతల్లో విప్లవాత్మక పరిశోధనలను వేగవంతం చేసేందుకు ఇదొక గొప్ప వేదికగా మారుతుందికమ్యూనికేషన్ల రంగంలో దేశ స్వయం సమృద్ధిని పెంచడమే కాకుండాతదుపరి తరం ఆవిష్కర్తలుపరిశోధకులుమేధో సంపత్తిడీప్ టెక్ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా వికసిత్ భారత్ దార్శనికతకు ఎంతో దోహదపడుతుంది’’ అని పేర్కొన్నారు.

ఈ భాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి ఐఐఎస్‌సీ బెంగళూరులోని ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈవిభాగాధిపతి ప్రొఫెసర్ నీలేష్ బీ మెహతా మాట్లాడుతూ.. అధునాతన పరిశోధనలు చేస్తున్న ఐఐఎస్‌సీ అధ్యాపకులువిద్యార్థులకు.. సీ డాట్ నిపుణులుఇంజనీర్లకు మధ్య ఈ భాగస్వామ్యం సుదీర్ఘకాలం నిలిచేలా దోహదపడుతుందని తెలిపారుఅధునాతన కమ్యూనికేషన్ సాంకేతికతల్లో ఆవిష్కరణలను మరింత వేగవంతం చేయడానికి ఈ సంబంధాలు తోడ్పడతాయని ఆయన వెల్లడించారు.

ఎఫ్‌ఎస్ఐడీ సీఈఓ శ్రీ ఓంప్రకాశ్ సుబ్బారావు మాట్లాడుతూ.. ‘‘సీ డాట్‌తో కలిసి ఈ కీలక స్థాయికి చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందిఐఐఎస్‌సీకి చెందిన పరిశోధకులుఆవిష్కర్తలతో కలిసి గొప్ప ఫలితాలనిచ్చే ప్రాజెక్టులనుపరిశోధనలను ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాంవిద్యాపారిశ్రామిక రంగాన్ని అనుసంధానించడానికి ఎఫ్‌ఎస్ఐడీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందిదేశ శాస్త్రీయ వ్యవస్థనుసాంకేతిక నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఉమ్మడి ఆవిష్కరణలు అత్యంత కీలకమని మేం నమ్ముతున్నాంఈ భాగస్వామ్యం దేశానికి ఎంతో ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తుందనే నమ్మకం మాకుంది’’ అని తెలిపారు

 

***


(रिलीज़ आईडी: 2291909) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Bengali , Gujarati , Tamil , Kannada