సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బ్రిక్స్ సాంస్కృతిక కార్యవర్గ సమావేశాల కీలక నిర్ణయాలు

నాడు పోస్టు చేయడమైనది: 30 JUL 2026 3:45PM by PIB Hyderabad

భారత్ బ్రిక్స్ అధ్యక్షతన వరుసగా 2026 ఏప్రిల్ 29-30, జూన్ 5-6 తేదీల్లో జరిగిన 1, 2వ బ్రిక్స్ సాంస్కృతిక కార్యవర్గ సమావేశాలు... సృజనాధారిత ఆర్థిక వ్యవస్థప్రజల మధ్య సహకారంసృజనాధారిత ఆర్థిక వ్యవస్థలో కాపీరైట్నైతిక ఏఐసాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వ్యూహాలుసాంస్కృతిక ఆస్తుల పునరుద్ధరణ మొదలైన అంశాలపై చర్చించాయి.

మారుతున్న డిజిటల్ వాతావరణంలో సృష్టికర్తలుకళాకారులుసాంస్కృతిక నిపుణుల హక్కులు-ప్రయోజనాలను పరిరక్షించడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయిఇందులో కాపీరైట్ రక్షణసరైన పారితోషికంకృత్రిమ మేధను నైతికతతోబాధ్యతాయుతంగా ఉపయోగించడంమేధో సంపత్తి విధాన ప్రణాళికల బలోపేతం మొదలైన అంశాలు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య చర్చకు వచ్చాయి.

బ్రిక్స్ సభ్య దేశాలు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణసాంస్కృతిక ఆస్తుల పునరుద్ధరణను ప్రాధాన్య రంగాల్లో ఒకటిగా పరిగణించి చర్చించాయినిరంతర చర్చలుఅనుభవాలు-ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడంసాంస్కృతిక ఆస్తుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి సమన్వయ ప్రయత్నాలు మొదలైన వాటి ద్వారా సహకారాన్ని బలోపేతం చేయడంపైనా ఈ చర్చలు దృష్టి సారించాయిసభ్య దేశాలు తమ తమ జాతీయ చట్టపరమైనసంస్థాగతమైన విధానాలకు అనుగుణంగా... సాంస్కృతిక ఆస్తుల పునరుద్ధరణపునస్థాపనకు సంబంధించిన సమస్యలపై నిరంతర భాగస్వామ్యానికీ మద్దతు తెలిపాయి.

వారణాసిలో జరిగిన 2వ బ్రిక్స్ సాంస్కృతిక కార్యవర్గ సమావేశ సిఫార్సులుచర్చల వివరాలను బ్రిక్స్ సభ్య దేశాలతో పంచుకున్నారు.

ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

***


(రిలీజ్ ఐడి: 2291902) సందర్శకుల సూచీ సంఖ్య : : 28
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil