హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో నక్సలిజం స్థితిగతులు

प्रविष्टि तिथि: 29 JUL 2026 3:41PM by PIB Hyderabad

భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలు ప్రకారం.. పోలీసు, ప్రజా భద్రత అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి. అయినప్పటికీ వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ప్రయత్నాలకు భారత ప్రభుత్వం తోడ్పాటునందిస్తోంది. వామపక్ష తీవ్రవాద ముప్పును అన్నివిధాలా ఎదుర్కోవడం లక్ష్యంగా ఏకోన్ముఖ ప్రభుత్వ విధానంపై ప్రధానంగా దృష్టి సారిస్తూ.. ‘వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనే జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక’ను 2015లో ప్రభుత్వం ఆమోదించింది. భద్రతా చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమాజాల హక్కుల వంటి బహుముఖ వ్యూహాన్ని ఈ విధానం అనుసరిస్తుంది.

దాదాపు ఆరు దశాబ్దాల హింస తర్వాత వామపక్ష తీవ్రవాదం నుంచి దేశం విముక్తి పొందింది. ఒకప్పుడు ఇది దేశ అంతర్గత భద్రతకు అతి పెద్ద ముప్పుల్లో ఒకటిగా ఉండేది. 2015 నాటి ‘వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక’ను కచ్చితంగా అమలు చేయడం, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ కృషి ద్వారానే ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ఏ జిల్లా కూడా వామపక్ష తీవ్రవాద ప్రభావిత జాబితాలో లేదు. నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 2018 ఏప్రిల్ నాటికి 126 నుంచి 90కి, 2021 జూలై నాటికి 70కి, 2024 ఏప్రిల్ నాటికి 38కి, 2025 డిసెంబరు నాటికి 8కి, 2026 మార్చి/ఏప్రిల్ నాటికి ‘సున్నా’కు తగ్గింది.

నక్సల్ ప్రభావిత గతం ఉండి, వామపక్ష తీవ్రవాదం తిరిగి వేళ్లూనుకోకుండా చూడాలనుకునే (లెగసీ అండ్ థ్రస్ట్) జిల్లాల విభాగంలో ప్రస్తుతం 37 జిల్లాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఆటంకాల్లేకుండా ఈ పరిస్థితిని కొనసాగించేందుకు భద్రత, అభివృద్ధి చర్యల విషయంలో మరికొంత కాలం పాటు నిరంతర చేయూత అవసరం. వామపక్ష తీవ్రవాద హింసాత్మక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టి, వాటి సంస్థాగత నిర్మాణాన్ని సమూలంగా నిర్మూలించిన ఒక (01) జిల్లాను ‘ప్రత్యేక నిఘా ఆవశ్యక జిల్లా (డిస్ట్రిక్ట్ ఆఫ్ కన్సర్న్)’ విభాగంలో చేర్చారు. ఈ జిల్లాలు నేడు వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తిని పొందినప్పటికీ.. ఆ సమస్య మళ్లీ తలెత్తే అవకాశం లేకుండా భద్రతా నిఘా, అభివృద్ధి కార్యక్రమాలను మరికొంత కాలం పాటు కొనసాగించాల్సి ఉంటుంది.

కేంద్ర సాయుధ పోలీసు బలగాలను అందించడం, భారత రిజర్వ్ బెటాలియన్లను ఏర్పాటు చేయడం, హెలికాప్టర్ సహాయం, భద్రతా శిబిరాల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, శిక్షణ, రాష్ట్ర పోలీసు బలగాల ఆధునికీకరణకు నిధులు, పరికరాలు - ఆయుధాలను సమకూర్చడం, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, పటిష్టమైన పోలిస్ స్టేషన్ల నిర్మాణం మొదలైన చర్యల ద్వారా... వామపక్ష తీవ్రవాద ప్రభావిత గతం ఉన్న రాష్ట్రాలకు భద్రతాపరమైన సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

  • రాష్ట్రాల సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం 2014-15 నుంచి ‘భద్రతా సంబంధిత వ్యయం (ఎస్ఆర్ఈ)’ పథకం కింద వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు రూ. 3,805.04 కోట్లు విడుదల చేశారు. భద్రతా బలగాల నిర్వహణ వ్యయం, శిక్షణ అవసరాలు, లొంగిపోయిన వామపక్ష తీవ్రవాద కార్యకర్తలకు పునరావాసం, వామపక్ష తీవ్రవాద హింసలో అమరులైన భద్రతా సిబ్బంది, మృతి చెదిన పౌరుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు మొదలైన అవసరాల కోసం ఈ నిధులను అందించారు.

o భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్రమైన లొంగుబాటు - పునరావాస విధానాలను రూపొందించాయి. భద్రతా సంబంధిత వ్యయం (ఎస్ఆర్ఈ) పథకంలో భాగంగా.. ‘లొంగుబాటు-పునరావాస’ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రయత్నంలో రాష్ట్రాలకు సహకారాన్ని అందిస్తోంది. లొంగిపోయిన వారి పునరావాసం కోసం వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలు చేసే ఖర్చును.. ఎస్‌ఆర్‌ఈ పథకం కింద భారత ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఈ పునరావాస ప్యాకేజీలో భాగంగా.. ఉన్నత స్థాయి వామపక్ష తీవ్రవాద కార్యకర్తలకు తక్షణ సాయంగా రూ. 5 లక్షలు, ఇతర కేడర్‌కు చెందిన సభ్యులకు రూ. 2.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. దీనికి అదనంగా ఆయుధాలు/మందుగుండు సామగ్రిని అప్పగించినందుకు కూడా ఈ పథకం కింద ప్రోత్సాహకాలు ఉంటాయి. అలాగే వారు ఇష్టపడే వృత్తి లేదా నైపుణ్యంలో శిక్షణనిస్తూ.. మూడేళ్ల పాటు నెలకు రూ. 10,000 చొప్పున స్టైపండ్ అందించే సదుపాయం కూడా ఉంది.

    • పోలీసు బలగాలను సన్నద్ధపరచడం, ఆధునికీకరణ కోసం రాష్ట్రాల చర్యలకు.. ‘పోలీసు బలగాల ఆధునికీకరణ’ పథకం కింద అదనపు తోడ్పాటు లభించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయుధాలు, సమాచార సాంకేతికత, కమ్యూనికేషన్ పరికరాలు, శిక్షణ, పోలీస్ స్టేషన్ల నిర్మాణం, రవాణా సౌకర్యాలు, పోలీసు గృహాల నిర్మాణం, ఇతర పోలీస్ మౌలిక సదుపాయాల కోసం ఈ పథకం కింద కేంద్రం సాయమందిస్తుంది. దీని ఉప పథకమైన ‘ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం (ఎస్ఐఎస్)’ కింద.. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల ప్రత్యేక దళాలు, ప్రత్యేక నిఘా విభాగాలు (ఎస్ఐబీ), జిల్లా పోలీసు వ్యవస్థలను బలోపేతం చేయడానికీ, అలాగే పటిష్టమైన పోలీస్ స్టేషన్ల నిర్మాణానికీ రూ. 1,761 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించింది. భద్రతా మౌలిక సదుపాయాలపై భారత ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించడం కీలకమైన అంశం. ఇప్పటివరకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగిన 663 పోలిస్ స్టేషన్లను నిర్మించారు.
    • వామపక్ష తీవ్రవాద నిర్వహణ కోసం కేంద్ర సంస్థలకు సాయం’ పథకం కింద... శిబిరాల ప్రాథమిక నిర్మాణానికి, వామపక్ష తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం హెలికాప్టర్లను సమకూర్చడానికి సాయమందిస్తారు. 2014-15 నుంచి ఈ పథకం ద్వారా కేంద్ర సంస్థలకు రూ. 1,303.68 కోట్లు అందించారు.
    • వామపక్ష తీవ్రవాద సంస్థల ఆర్థిక అణచివేతపైనా, సీపీఐ (మావోయిస్టు) - దాని ఆర్థిక మద్దతుదారుల మధ్య సంబంధాన్ని వెలికితీయడంపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్ర సంస్థలతో సమన్వయం ద్వారా వివిధ మార్గాల్లో రాష్ట్ర పోలీసులు చేపట్టిన చర్యలు.. గతంలో వామపక్ష తీవ్రవాదులకు అందుతున్న నిధులు, వనరుల సరఫరాను అడ్డుకోవడంలో మంచి ఫలితాలను ఇచ్చాయి.

అభివృద్ధి పరంగా – భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలతోపాటు, ఈ ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, టెలి కమ్యూనికేషన్ అనుసంధానాన్ని మెరుగుపరచడం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సమ్మిళితత్వంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నిర్దిష్ట అవసరాల మేరకు వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. అభివృద్ధి పరంగా చేపట్టిన ఇలాంటి కొన్ని కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి:

· రోడ్ రిక్వైర్‌మెంట్ ప్రణాళిక (ఆర్ఆర్‌పీ), ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు అనుసంధాన ప్రాజెక్టు (ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ) అనే రెండు ఎల్‌డబ్ల్యూఈ నిర్దిష్ట పథకాల పరిధిలో 15,189 కి.మీ.ల రహదారులను నిర్మించారు. దీనికి అదనంగా ఛత్తీస్‌గఢ్‌లోని గతంలో ఎల్‌డబ్ల్యూఈ ప్రభావం ఉన్న ప్రాంతంలో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా 127.08 కి.మీ. కీలకమైన రోడ్లు, 6 ప్రధాన వంతెనల నిర్మాణానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

· గతంలో ఎల్‌డబ్ల్యుఈ ప్రభావానికి గురయిన ప్రాంతాల్లో చోట టెలికాం సేవలను మెరుగుపరిచేందుకు 9,497 టవర్లను ఏర్పాటు చేశారు.

· నైపుణ్యాభివృద్ధి కోసం 47 పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటీఐలు), 49 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు (ఎస్‌డీసీలు) ప్రారంభించారు.

· గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు 179 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలు (ఈఎంఆర్ఎస్‌లు) కార్యకలాపాలను ప్రారంభించాయి.

· ఆర్థిక సమ్మిళిత్వం కోసం వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తి పొందిన ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందించే 6,025 పోస్టాఫీసులను పోస్టల్ విభాగం ఏర్పాటు చేసింది. అలాగే ఈ ప్రాంతాల్లో 1,804 బ్యాంకు శాఖలు, 1321 ఏటీఎంలను ప్రారంభించారు.

· అదే విధంగా, వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యూఈ) నిర్మూలన తర్వాత, ఎల్‌డబ్ల్యూఈ నుంచి విముక్తి పొందిన ప్రాంతాల్లో ఉన్న భద్రత శిబిరాల్లో మూడింట ఒక వంతును జన సువిధ కేంద్రాలుగా మారుస్తున్నారు. ఇవి స్థానికులకు జీవనోపాధిని పెంచడం, నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ పథకాలను, డిజిటల్ సేవలను, వైద్య సేవలను అందించడం, సాంస్కృతిక, క్రీడా వసతులతో సహా విస్తృతమైన సేవలను అందిస్తాయి. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో నేతానార్‌లో మొదటి జన సువిధ కేంద్రాన్ని షాహీద్ వీర్ గుండధూర్ సేవా దేరా కేంద్రంగా స్థాపించారు.

· ప్రత్యేక కేంద్ర సహాయం (ఎస్‌సీఏ) పథకం ద్వారా గతంలో ఎల్‌డబ్ల్యూఈ ప్రభావానికి గురైన జిల్లాల్లో అభివృద్ధిని వేగవంతం చేసేలా, ప్రజా మౌలిక వసతుల్లో కీలకమైన లోపాలను పూడ్చేందుకు నిధులను అందిస్తున్నారు. 2017లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 4,289.20 కోట్లు విడుదలయ్యాయి.

· స్థానికులకు హక్కులను, అధికారాలను అందించేలా లబ్ధిదారులకు 21,26,268 హక్కు పత్రాలను (20,20,268 వ్యక్తిగత హక్కు పత్రాలు, 1,06,000 సామాజిక హక్కుపత్రాలు) అందించారు. గతంలో ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న చోట స్థానిక పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా పంచాయతీరాజ్ వ్యవస్థతో కలసి సంయుక్త కార్యక్రమాన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ప్రభావిత ప్రాంతాల్లో సామాజిక హక్కులను బలోపేతం చేయడం, పాలనలో భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్యలు ప్రతిబింబిస్తాయి.

చత్తీస్‌గడ్‌లో గతంలో వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న ఏడు జిల్లాల్లో స్వతంత్ర ఏజెన్సీ ద్వారా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ సర్వేను నిర్వహించింది. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎంత మేర అమల్లోకి వచ్చాయో తెలుసుకోవడానికి, జీవనోపాధి కల్పనకు ఉన్న అవకాశాలను అంచనా వేయడానికి ఈ సర్వేను నిర్వహించారు. విద్యా స్థాయులు, ఆరోగ్య సూచికలు, ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సెకండరీ ఆరోగ్య సేవా కేంద్రాలు తదితర ప్రాథమిక సేవల లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. ఇది అభివృద్ధి అంతరాలను పూడ్చాలనే, జీవనోపాధిని కల్పించాలనే లక్ష్యాన్ని సాధించడంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి సహాయపడుతోంది.

స్థానిక యువత, సమాజాలతో నిర్మాణాత్మక విధానంలో అనుసంధానమయ్యేందుకు ట్రైబల్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం (టీవైఈపీ)ను భారత ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా గతంలో ఎల్‌డబ్ల్యూఈ ప్రభావానికి గురయిన ప్రాంతాలకు చెందిన యువతను దేశంలో వివిధ ప్రాంతాలకు వారం పాటు అధ్యయన పర్యటనకు పంపిస్తారు. వివిధ ప్రాంతాలు, నేపథ్యాలకు చెందిన ప్రజలతో మమేకయ్యే అవకాశాన్ని ఈ కార్యక్రమం వారికి అందిస్తుంది. తద్వారా జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం, భారత దేశ సాంస్కృతిక వైవిధ్యంపై అవగాహనను పెంపొందించడం, దేశ పారిశ్రామిక, వృద్ధి గురించి తెలుసుకొనే అవకాశం లభిస్తుంది. 2014 నుంచి మొత్తం 37,655 మంది గిరిజన యువత టీవైఈపీలో పాల్గొన్నారు.

అలాగే పౌర కార్యాచరణ కార్యక్రమం పరిధిలో సీఏపీఎఫ్‌లకు నిధులను భారత ప్రభుత్వం అందిస్తుంది. వీటి ద్వారా తమ కార్యకలాపాల పరిధిలో స్థానిక సమాజాలకు వైద్య శిబిరాలు, క్రీడా పోటీలు, నిత్యావసర వస్తువుల పంపిణీతో సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలను సీఏపీఎఫ్‌లు చేపడతాయి. ఈ పథకం ద్వారా 2014 నుంచి రూ. 221.88 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇది భద్రతా దళాలకు, స్థానిక ప్రజలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఎంతగానో తోడ్పడింది.

గడచిన అయిదేళ్లలో వామపక్ష తీవ్రవాదం వల్ల చెలరేగిన హింసలో ప్రాణాలు కోల్పోయిన సాధారణ పౌరులు, అమరులైన భద్రతా సిబ్బంది వివరాలు రాష్ట్రాల వారీగా అనుబంధం–Iలో ఉన్నాయి. అలాగే గత అయిదేళ్లలో వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం వివిధ పథకాల కింద విడుదల చేసిన ఆర్థిక సహాయం వివరాలు అనుబంధం–II లో ఉన్నాయి. గత అయిదేళ్లలో వామపక్ష తీవ్రవాదం ప్రభావిత జిల్లాల వివరాలు అనుబంధం–III లో ఉన్నాయి.

ఎల్‌డబ్ల్యూఈ అనంతర పరిస్థితుల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అన్ని చోట్లా అమలు చేయడం, స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయడం, లొంగిపోయిన కేడర్లకు పునారావాస సౌకర్యం కల్పించడం, గిరిజన గుర్తింపు, సంస్కృతిని పరిరక్షించడం, మారుమూల ప్రాంతాల్లో పరిపాలన, ప్రజా సేవల పరిధిని విస్తరించడంలో దృష్టి సారించారు.

మొత్తంగా, దేశంలో గతంలో ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత జిల్లాలో భద్రతను అందించడానికి, అభివృద్ధిని వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ANNEXURE I

LWE : Violence Data

 

Year

2021

2022

2023

2024

2025

2026

(till 21 July)

 

VPM*

Civilians

Death

SFs

Death

VPM

Civilians

Death

SFs

Death

VPM

Civilians

Death

SFs

Death

VPM

Civilians

Death

SFs

Death

VPM

Civilians

Death

SFs

Death

VPM

Civilians

Death

SFs

Death

Andhra Pradesh

8

1

0

3

1

0

3

1

0

1

0

0

0

0

0

0

0

0

Bihar

20

7

0

11

1

0

4

0

0

2

1

0

3

0

0

0

0

0

Chhattisgarh

188

56

45

246

51

10

305

68

27

268

106

17

144

52

27

18

3

4

Jharkhand

100

21

5

96

9

3

129

27

5

69

16

2

63

6

7

13

3

0

Kerala

0

0

0

0

0

0

4

0

0

0

0

0

0

0

0

0

0

0

Madhya Pradesh

15

3

0

16

2

0

7

1

0

11

0

0

5

2

0

0

0

0

Maharashtra

15

6

0

16

8

0

19

7

0

10

4

0

8

2

1

0

0

1

Odisha

11

3

0

16

8

3

12

3

0

6

2

0

4

1

1

0

0

0

Telangana

4

0

0

9

2

0

3

0

0

8

3

0

7

1

0

2

0

0

                                     

 

...

 


(रिलीज़ आईडी: 2291294) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , Tamil