సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ టాక్సీ డ్రైవర్లు

प्रविष्टि तिथि: 29 JUL 2026 4:46PM by PIB Hyderabad

బహుళ రాష్ట్రాల సహకార సంఘమైన సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్నసహకార రంగ నేతృత్వంలోని డిజిటల్ యాప్ మొబిలిటీ వేదిక 'భారత్ టాక్సీ'... ఢిల్లీ-ఎన్‌సీఆర్గుజరాత్మహారాష్ట్ర రాష్ట్రాల్లోని పలు నగరాల్లో అధికారికంగా ప్రారంభమైంది. 2026, జూలై 19 నాటికి దేశవ్యాప్తంగా దీనిలో చేరిన డ్రైవర్-భాగస్వాముల (సారథిలమొత్తం సంఖ్య 7.97 లక్షలుగా ఉందిప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం నుంచి 2.55 లక్షల మందిగుజరాత్‌ నుంచి 1.01 లక్షల మందిమహారాష్ట్ర నుంచి 71,095 మంది సారథిలుగా ఇందులో భాగమయ్యారు.

సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహిస్తున్న భారత్ టాక్సీ సేవలను ఇతర నగరాలురాష్ట్రాల్లో విస్తరించడం... కార్యాచరణ అవసరాలుఅవసరమైన ఆమోదాలకు లోబడి ఉంటుందికార్యాచరణ సంసిద్ధతసారథిల లభ్యతచట్టబద్ధమైన అవసరాలను పూర్తి చేయడంసంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలుసహకార సంస్థలుఇతర భాగస్వాములతో సమన్వయం వంటి అంశాల ఆధారంగా విస్తరణ చేపడతారు.

భారత్ టాక్సీ సున్నా-కమీషన్ విధానంపై పనిచేస్తుందిదీని ప్రకారం వేదిక ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణాలకు సారథి సంపాదించే ఛార్జీ నుంచి ఎటువంటి కమీషన్ మినహాయించరుేదిక సాంకేతికతఅప్లికేషన్ నిర్వహణవిస్తరణకు అయ్యే ఖర్చులను భరించడం కోసం సారథిల నుంచి నామమాత్రపు రైడ్ సబ్‌స్క్రిప్షన్/ేదిక వినియోగ రుసుమును విడిగా వసూలు చేస్తారుఈ కారణంగా సారథికి చెల్లించాల్సిన ఛార్జీపై ఎటువంటి ప్రభావం ఉండదు.

సహకార్ టాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్‌లో సభ్యులుగా నమోదు చేసుకున్న సారధులు... దాని ఉప-నిబంధనలుబహుళ-రాష్ట్ర సహకార సంఘాల చట్టం-2002లోని నిబంధనల ప్రకారం సహకార సంఘ సభ్యులకు లభించే ప్రయోజనాలకు అర్హులు అవుతారు.

సహకార సంఘం దాని సభ్యుల కోసం సంక్షేమంఆర్థిక సహాయాన్నీ సులభతరం చేస్తుందిరాయితీ రేట్లతో ఆరోగ్యవ్యక్తిగత ప్రమాద బీమాను అందుబాటులో ఉంచడం... ఎస్‌బీఐ ముద్రా రుణాలు సహా సంస్థాగత క్రెడిట్... బ్యాంకులుఇతర ఆర్థిక సంస్థల ద్వారా వాహన ఫైనాన్సింగ్ అందించడం వంటివి ఇందులో భాగంగా ఉన్నాయిదీనికి అదనంగాసారధులకు డిజిటల్ వేదిక వినియోగంకస్టమర్ సేవరహదారి భద్రతప్రయాణికుల భద్రతపై అవగాహన కల్పించడానికి ఎప్పటికప్పుడు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 
***

(रिलीज़ आईडी: 2291287) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali