జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్ లో విషపూరిత వాయువులు పీల్చి ఇద్దరి మృతి ఎన్ హెచ్ ఆర్ సీ నోటీసులు

ఉత్తరప్రదేశ్.. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా నోయిడాలో ఓ రెసిడెన్షియల్ సొసైటీలో దుర్ఘటన

ఓ వార్త కథనాన్ని స్వయంగా పరిశీలనకు తీసుకున్న ఎన్‌హెచ్ఆర్‌సీ

గౌతం బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేటుకు, పోలీస్ కమిషనరుకు నోటీసులు

రెండు వారాల్లోగా సమగ్ర నివేదికకు ఆదేశం

దర్యాప్తు స్థితితో పాటు మృతుల కుటుంబికులకు నష్టపరిహారం చెల్లించి ఉంటే ఆ వివరాలూ ఇవ్వండి

నాడు పోస్టు చేయడమైనది: 29 JUL 2026 11:18AM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్.. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా నోయిడాలో ఓ రెసిడెన్షియల్ సొసైటీలో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు (ఎస్‌టీపీలోపల విషపూరిత వాయువులను పీల్చడంతో ఓ పారిశుధ్య కార్మికుడితో పాటు ఒక సెక్యూరిటీ గార్డు చనిపోయారని ఈ నెల 26న ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తా కథనాన్ని భారత జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీస్వయంగా పరిశీలనకు తీసుకుందివార్తా కథనంలో ప్రస్తావించిన ప్రకారం.. ట్యాంకును శుభ్రం చేయడానికి ఎస్‌టీపీలోకి ప్రవేశించిన పారిశుధ్య కార్మికుడు స్పృహ తప్పాడుఆ వ్యక్తి బయటకు రాకపోవడంతోఅతడిని కాపాడటానికి రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ గార్డుల్లో ఒకరు ట్యాంకులోకి వెళ్లి స్పృహ తప్పాడు.
వార్తా కథనంలో పేర్కొన్న అంశాలు నిజమే అయిన పక్షంలోమానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొన్నదిదీనికి అనుగుణంగాగౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేటుకుపోలీస్ కమిషనరుకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసిఈ ఘటనపై రెండు వారాల లోపల సమగ్ర నివేదికను అందించాలని స్పష్టం చేసిందినివేదికలో దర్యాప్తు పురోగతి క్రమంతో పాటుమృతుల ఆత్మీయులకు ఏదైనా నష్టపరిహారాన్ని చెల్లించి ఉంటే ఆ వివరాలను కూడా పంపాలని కోరింది.
2026 
జులై 27న వెలుగులోకి వచ్చిన మీడియా కథనం ప్రకారం.. పోలీసులుఅగ్నిమాపక సిబ్బంది బాధితులను ఆస్పత్రిలో చేర్చారుచికిత్సను అందిస్తున్న క్రమంలో... బాధితులు మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

 

****


(రిలీజ్ ఐడి: 2290971) సందర్శకుల సూచీ సంఖ్య : : 51
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Tamil