ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గౌరవం, విశ్వాసం, సమర్థ నాయకత్వానికి... శీలమే పునాది! ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 JUL 2026 7:43AM by PIB Hyderabad

సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి సమాజంలో గౌరవాన్ని పొందుతారనీఅలాంటి వ్యక్తిని ప్రతి బాధ్యతా తీసుకోవడానికి సమర్థుడిగా భావిస్తారనీ తెలియజెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.


సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి  పొందుపరుస్తూ :
‘‘
శీలవాన్ పూజితో లోకే శీలవాన్ సాధుసమ్మతః
శీలవాన్ సర్వకర్మార్హః శీలవాన్ ప్రియదర్శనః’’ అని పేర్కొన్నారు
.


సదాచార స్వభావాన్ని కలిగివుండే మనిషి సమాజంలో గౌరవాన్నీమంచివారి ప్రశంసలనూ పొందుతారు.  ఇలాంటి వ్యక్తి తన నిజాయతీఅణకువక్రమశిక్షణతో కూడిన ప్రవర్తన కారణంగా ఏ బాధ్యతనైనా నిర్వహించడానికి తగిన వ్యక్తి అని ప్రజలు భావిస్తారుఆ మనిషి వ్యక్తిత్వం ప్రశంసనీయంగానుస్ఫూర్తిదాయకంగాను ఉండడమే కాక అనుసరణ యోగ్యం కూడా అవుతుందినిజానికి సత్ప్రవర్తనను కలిగివుండడం సదా విజయాలకీప్రభావవంతమైన నాయకత్వానికీవిశ్వాసానికీ సిసలైన పునాదిగా నిలుస్తుంది’ అని మనకు ఈ సుభాషితం బోధిస్తోంది.

***

 

(రిలీజ్ ఐడి: 2289970) సందర్శకుల సూచీ సంఖ్య : : 48