వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎఫ్‌సీవీ’ పొగాకు మార్కెట్ పరిస్థితిపై కేంద్ర వాణిజ్య శాఖ సమీక్ష

प्रविष्टि तिथि: 26 JUL 2026 6:57PM by PIB Hyderabad

  ఆంధ్రప్రదేశ్‌లో బ్యారన్లలో శుద్ధి చేసిన (ఫ్లూ-క్యూర్‌డ్) వర్జీనియా (ఎఫ్‌సీవీ) పొగాకు పంటపై ప్రస్తుత మార్కెట్ పరిస్థితిపై వాణిజ్య శాఖ బృందం ఇటీవల సమీక్షించింది. ఈ మేరకు ఈ నెల 25న ఆ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వాన ఒక బృందం రాష్ట్రంలో పర్యటించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పొగాకు బోర్డు చైర్మన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా పాల్గొన్నారు. ‘ఎఫ్‌సీవీ’ పొగాకు సాగుచేసే రైతుల ప్రయోజనాల పరిరక్షణ, ఈ రంగంలో స్థిరత్వం దిశగా దీర్ఘకాలిక చర్యలు తీసుకోవడంపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు.

ఈ పర్యటనలో భాగంగా వెల్లంపల్లిలోని పొగాకు బోర్డు వేలం కేంద్రాన్ని కేంద్ర బృందం సందర్శించి, అక్కడి కార్యకలాపాలను, వేలం ప్రక్రియను పరిశీలించింది. దీంతోపాటు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై ప్రత్యక్ష సమాచార సేకరణ నిమిత్తం అధికారులు రైతులతోనూ విస్తృతంగా సంభాషించారు. పారదర్శకంగా, క్రమబద్ధంగా వేలం నిర్వహిస్తున్న తీరుపై పొగాకు బోర్డును ఈ బృందం అభినందించింది.

మార్కెట్‌ పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని అదనపు కార్యదర్శి శ్రీ నితిన్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా రైతులకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, పొగాకు బోర్డు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో ఎఫ్‌సీవీ పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

 

***


(रिलीज़ आईडी: 2289685) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil