మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
మత్స్య పోషణ సహకార సంఘాలకు మహిళల సారథ్యం
प्रविष्टि तिथि:
22 JUL 2026 1:32PM by PIB Hyderabad
మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మత్స్య పోషణ విభాగం నడుపుతున్న ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ (పీఎంఎంఎస్‌వై)లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయడానికి మద్దతును అందిస్తున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచి 2026 జూన్ 15 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్.. కాకినాడ సహా 12 జిల్లాల్లో మత్స్య పోషణ, సముద్ర కలుపు మొక్కల సాగు, మెరైన ప్రాసెసింగ్ రంగాల్లో మహిళల నాయకత్వంలో మొత్తం 213 కోస్తాతీర సహకార సంఘాలను ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సొసైటీలతో 27,447 మందికి మేలు కలిగింది. మహిళల నాయకత్వంలోని కోస్తా తీర ప్రాంత సహకార సంఘాల జిల్లా వారీ వివరణతో పాటు వాటి లబ్ధిదారుల సంఖ్యను ‘అనుబంధం-1’ (Annexure-I ) లో పొందుపరిచారు.
దేశమంతటా మహిళల నాయకత్వంలోని కోస్తా తీర మత్స్య సహకార సంఘాలను ప్రోత్సహించడానికి, బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా రాష్ట్రాలతో, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతర అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే, మత్స్య సహకార సంఘాలను జాతీయ మత్స్య డిజిటల్ ప్లాట్‌ఫారమ్ (ఎన్ఎఫ్‌డీపీ)లో నమోదు చేసుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాక ఆయా సహకార సంఘాలు ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ- యోజన (పీఎం-ఎంకేఎస్ఎస్‌వై)లో భాగంగా రూ.2 కోట్ల వరకు పెర్ఫార్మెన్స్ గ్రాంటులు సహా మరింత ఎక్కువ ప్రోత్సాహకాలకు కూడా అర్హతను కలిగి ఉంటాయి. మహిళల నేతృత్వంలోని మత్స్య సహకార సంఘాలకు ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ (ఈఈజడ్)లో చేపలు పట్టుకోవడానికి లభ్యత (యాక్సెస్) పాసును సముద్ర మధ్యం (హై సీస్)లో చేపల వేటకు అధీకృత లేఖ (లెటర్స్ ఆఫ్ ఆథరైజేషన్.. ఎల్ఓఏ)ను జారీ చేయడంలో ప్రాధాన్యాన్ని ఇస్తారు. దీనికి అదనంగా, సముద్ర మధ్యంలో చేపలను వేటాడడంలో మత్స్య సహకార సంఘాలకు ఎక్కువ భాగస్వామ్యం లభించేలా మార్గాన్ని సుగమం చేయడానికి ఎల్ఓఏ దరఖాస్తు రుసుమును, పునరుద్ధరణ (రెన్యువల్) రుసుమును రూ.25,000 నుంచి తగ్గించి రూ.5,000గా చేశారు.
బ్లూ ఎకానమీలో భాగంగా, దేశమంతటా 12,000 మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయడానికి మద్దతివ్వడానికి మత్స్య విభాగం జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌డీఎఫ్‌బీ) ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దీనిలో ఇంతవరకు ఈ పథకం చేరని పంచాయతీలు, గ్రామాల్లో మహిళల నాయకత్వంలో కోస్తా తీర ప్రాంత సహకార సంఘాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కూడా చేర్చారు. దీనికి తోడు, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ- యోజన (పీఎం-ఎంకేఎస్ఎస్‌వై)లో భాగంగా దేశవ్యాప్తంగా 5,500 ప్రాథమిక మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేయాలని సంకల్పించారు. అయితే పీఎం-ఎంకేఎస్ఎస్‌వై.. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పరిధిలోకి వచ్చే ఒక ఉప పథకం. మహిళల సారథ్యంలోని సహకార సంఘాలు కూడా ఈ 5,500 ప్రాథమిక మత్స్య సహకార సంఘాల్లో ఓ భాగంగా ఉంటాయి. వీటికి మార్గదర్శకత్వాన్ని, సామర్థ్యాన్ని పెంచుకొనే ప్రణాళికలతో పాటు అవసరాల ప్రాతిపదికన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.
రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ సమాధానమిస్తూ, ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2287991)
आगंतुक पटल : 8