వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎగుమతి మార్కెట్ల వైవిధ్యీకరణ దిశగా ఎఫ్‌టీఏల విస్తరణ, ఎగుమతి ప్రోత్సాహక చర్యలను చేపట్టిన ప్రభుత్వం


స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతి అవకాశాల విస్తరణ, మెరుగైన మార్కెట్ ప్రవేశ సౌలభ్యం, సుంకాలకు సంబంధంలేని ఇతర అవరోధాలకు పరిష్కారం

ఎగుమతి ప్రోత్సాహక మిషన్, ఇ-కామర్స్ ఎగుమతి కేంద్రాలు, సరుకు రవాణాలో సంస్కరణలతో దేశాల నడుమ ఇ-కామర్స్ ఎగుమతులకు ఊతం

प्रविष्टि तिथि: 21 JUL 2026 3:27PM by PIB Hyderabad

మారుతున్న ప్రపంచ భౌగోళిక-రాజకీయఆర్థిక పరిణామాల నేపథ్యంలో ఎగుమతి మార్కెట్ల వైవిధ్యీకరణ దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందివీటిలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలుసమగ్ర ఆర్థిక భాగస్వామ్య/సహకార ఒప్పంద వ్యవస్థల విస్తరణఎగుమతిదారులకు ప్రాధాన్య మార్కెటును అందుబాటులోకి తేవడం కోసం ప్రధాన ఆర్థిక వ్యవస్థలుప్రాంతాలతో వాణిజ్య చర్చలుఎగుమతి ప్రోత్సాహక మిషన్విదేశాలలో భారతీయ దౌత్య కార్యాలయాలుఎగుమతి ప్రోత్సాహక మండళ్లుపారిశ్రామిక సంఘాలుఇతర భాగస్వాములు, ‘ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు’ కార్యక్రమం కింద జిల్లాలురంగాల వారీగా ఎగుమతి ప్రోత్సాహక చర్యల అమలుసామర్థ్యాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ వంటి కార్యక్రమాలు ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి.

గత కొన్నేళ్లలో వాణిజ్య ఒప్పందాల జాబితా అనుబంధం-I లో ఉందికొనసాగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల జాబితా అనుబంధం-II లో ఉంది.

మార్కెట్ ప్రవేశ పరిధిని విస్తరించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించుకోవడంవాణిజ్యం పెట్టుబడులను పెంచుకోవడం కోసం వాణిజ్యపరమైన పరిపూరక అంశాలను ఉపయోగించుకోవడంతద్వారా మెరుగైన ఎగుమతి సామర్థ్యాన్ని కల్పించడంతోపాటు పరిశ్రమలకురైతులకు లబ్ధి చేకూర్చడంఉపాధి అవకాశాలను పెంపొందించడం వంటి ప్రధాన లక్ష్యాలతో సంబంధిత వాణిజ్య భాగస్వామ్య దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటారుజౌళిదుస్తులుతోలు వస్తువుల వంటి కార్మికులు ఎక్కువగా ఉన్న రంగాల్లో వృద్ధినిఉపాధి అవకాశాలను ప్రోత్సహించే దిశగా.. ఆయా రంగాల ఉత్పత్తులకు ప్రాధాన్యతా మార్కెట్ ప్రవేశాన్ని ఈ ఒప్పందాలు కల్పిస్తాయినిష్పక్షపాతంపరస్పర ప్రయోజనాలుభాగస్వాములందరికీ సమగ్ర లబ్ధి చేకూర్చే ప్రాతిపదికన.. సమగ్రమైనసమతౌల్యంతో కూడినవిస్తృతమైనసమానమైన ఒప్పందాల దిశగా ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో ప్రభుత్వం కృషి చేస్తుంది.

ఇరువైపులా ప్రమాణాలుసాంకేతిక నిబంధనలుపారదర్శకతను పెంపొందించే చర్యలపై పరస్పర అవగాహనను ప్రోత్సహించడం కోసం.. వాణిజ్యంలో సాంకేతిక అడ్డంకులపై ఎఫ్‌టిఏలలో ప్రత్యేక నిబంధనలు ఉంటాయిభారతీయ వస్తువులు ఎగుమతి మార్కెట్లలోకి మరింత సులభంగాసమర్థంగా ప్రవేశించడానికి ఈ నిబంధనలు వీలు కల్పిస్తాయిటారిఫ్‌యేతర అడ్డంకుల సమస్యను పరిష్కరించడానికిభారతీయ ఎగుమతులకు మార్కెట్ లభ్యతను మెరుగుపరచడానికి ద్వైపాక్షికప్రాంతీయబహుపాక్షిక యంత్రాంగాల ద్వారా వాణిజ్య భాగస్వాములతో ప్రభుత్వం నిరంతరం చర్చిస్తోందిమారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా నిర్దిష్ట ఎగుమతి సమస్యల పరిష్కారానికి వాణిజ్య ఒప్పందాల కింద ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీలుకార్యాచరణ బృందాల ద్వారా భాగస్వాములతో ఎప్పటికప్పుడు సమావేశాలుప్రత్యక్ష చర్చలుమార్కెట్ ప్రవేశ సమస్యలను పరిష్కరించడం కోసం భాగస్వామ్య దేశాలతో సంప్రదింపులుశానిటరీ ఫైటోసానిటరీ చర్యలువాణిజ్యంలో సాంకేతిక అవరోధాలు(టీబీటీ), ప్రమాణాలుఅనుగుణ్యతా అంచనా విధానాలునియంత్రణ ఆవశ్యకాలపై సాంకేతిక చర్చలు నిర్వహించడంతోపాటు.. ఐరోపా యూనియన్ఆఫ్రికాఆగ్నేయాసియా సహా కీలక ఎగుమతి గమ్యస్థానాల్లో మార్కెట్ ప్రవేశానికి సంబంధించిన ఆందోళనలను గుర్తించి పరిష్కరించడం కోసం భాగస్వామ్య పక్షాలతో నిరంతర సంప్రదింపులు ఇందులో భాగంగా ఉన్నాయి.

వివిధ దేశాల నడుమ ఇ-కామర్స్ ఎగుమతులు.. ముఖ్యంగా సూక్ష్మచిన్నమధ్య తరహా పరిశ్రమలుఅంకుర సంస్థలుకళాకారులుఇతర చిన్న ఎగుమతిదారుల ప్రయోజనం కోసం వివిధ విధానపరమైనసరళీకరణ చర్యలను ప్రభుత్వం చేపట్టింది:

    1. ఎగుమతి ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం): ఎగుమతుల్లో దేశ పోటీతత్వాన్ని పెంచడం కోసం మొత్తం రూ. 25,060 కోట్ల వ్యయంతో.. 2025-26 నుంచి 2030-31 సమయానికి గాను ప్రభుత్వం దీనిని 2025లో ప్రారంభించిందిదీనికి అనుసంధానంగా ఉన్న రెండు ఉపపథకాల ద్వారా ఇది పనిచేస్తుంది:

  • నిర్యాత్ ప్రోత్సాహన్ – వడ్డీ రాయితీఎగుమతి ఫ్యాక్టరింగ్ఎగుమతి రుణం కోసం పూచీకత్తు గ్యారంటీలు-కామర్స్ ఎగుమతిదారుల కోసం క్రెడిట్ గ్యారంటీపరపతి మెరుగుదల కోసం సహకారం వంటి వివిధ సాధనాల ద్వారా వాణిజ్య ఆర్థిక సేవలను పొందే అవకాశాలను మెరుగుపరచడంపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

  • నిర్యాత్ దిశ – ఎగుమతి నాణ్యతనిబంధనల అమలులో సహకారంఅంతర్జాతీయ బ్రాండింగ్ప్యాకేజింగ్మార్కెట్ ప్రవేశ కార్యక్రమాలుఎగుమతి కోసం సరుకు రవాణాగిడ్డంగులువాణిజ్య నిఘా వంటి ఇతర వాణిజ్య సహాయక అంశాలపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

    1. సరుకు రవాణాకస్టమ్స్ అనుమతులుఇతర ఎగుమతి సంబంధిత సేవలను సులభతరం చేయడం ద్వారా.. -కామర్స్ ఎగుమతుల కోసం ఒక సమీకృత వ్యవస్థను నెలకొల్పేలా.. ‘-కామర్స్ ఎగుమతి కేంద్రం (ఈసీఈహెచ్)’ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడం.

    1. ఎగుమతి కేంద్రంగా జిల్లా (డీఈహెచ్– వికేంద్రీకృత ఎగుమతి ప్రోత్సాహం కోసం జిల్లా స్థాయి విధానాలను ఈ కార్యక్రమం అందిస్తుందిప్రతి జిల్లాలో నిర్దిష్ట చర్యల దిశగా.. ఎగుమతికి తగిన అవకాశాలున్న 3–5 ఉత్పత్తులు లేదా సేవలను గుర్తించివాటికి ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తోంది.

    1. కొరియర్ విధానం ద్వారా ఎగుమతులను సరళీకరించడానికినిబంధనల అమలు భారాన్ని తగ్గించడానికి సంస్కరణలు:

  • రూ. 10 లక్షల వరకు విలువైన ఎగుమతులకు సంబంధించి.. ఎగుమతి సమన్వయ నిబంధనలను భారతీయ రిజర్వ్ బ్యాంకు సడలించిందిఎగుమతిదారులు సమర్పించిన డిక్లరేషన్లుబ్యాంకులతో సర్దుబాటు ఆధారంగా.. ఎగుమతి డేటా ప్రాసెసింగ్పర్యవేక్షణ వ్యవస్థ (ఈడీపీఎంఎస్)లో ఎగుమతి లావాదేవీలను మూసివేయడానికి ఇది అనుమతిస్తుంది.

  • 2026 మార్చి 27 నాటి డీజీఎఫ్‌టీ నోటిఫికేషన్ నం. 67/2025–26, 2026 మార్చి 31 నాటి సీబీఐసీ నోటిఫికేషన్ నం. 34/2026 ప్రకారం.. కొరియర్ విధానంలో చేసే ఎగుమతులపై ఒక్కో రవాణా సరుకుకూ ఉన్న రూ. 10 లక్షల పరిమితిని తొలగించారు.

  • 2026 మార్చి 31 నాటి సీబీఐసీ నోటిఫికేషన్ నం33/2026 ప్రకారం దేశాల నడుమ ఇ-కామర్స్ ఎగుమతులకు సంబంధించి.. ఎగుమతిలో తిరస్కారం పొందిన వస్తువులువెనక్కి వచ్చిన వస్తువులను తిరిగి దిగుమతి చేసుకోవడాన్ని సులభతరం చేశారుతద్వారా సరుకును తిరిగి వెనక్కు రవాణా చేయడాన్ని (రివర్స్ లాజిస్టిక్స్‌సరళీకరించారు.

 

గమనిక: భారత్ ఐరోపా యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు 2026 జనవరి 27న ముగిశాయిఅలాగే పరస్పరఉభయ ప్రయోజనకరమైన వాణిజ్యానికి సంబంధించి ఒక మధ్యంతర ఒప్పందం కోసం ఒక విధానపరమైన ఏర్పాటుపై అంగీకారానికి వచ్చినట్లు 2026 ఫిబ్రవరి 7న భారత్అమెరికా ప్రకటించాయిచర్చలు కొనసాగుతున్నాయి.

అనుబంధం – II

చర్చల దశలో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు/సీఈసీఏ/సీఈపీఏ/ఈసీటీఏ

  1. భారత్ యూరేసియా ఆర్థిక సమాఖ్య (భారత్ ఈఏఈయూస్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

  2. భారత్ పెరూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

  3. భారత్ చిలీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

  4. భారత్ ఇజ్రాయెల్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

  5. భారత్ కెనడా సమగ్ర ఆర్థికభాగస్వామ్య ఒప్పందం

  6. భారత్ మాల్దీవులు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

  7. భారత్ కొరియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద చర్చల్లో మెరుగుదల (నవీకృత)

  8. భారత్ శ్రీలంక ఈటీసీఏ (నవీకరణ)

  9. భారత్ ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (నవీకరణ)

  10. ఆసియాన్ భారత్ వస్తువాణిజ్య ఒప్పందం (సమీక్ష దశలో)  

 

***


(रिलीज़ आईडी: 2287513) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati