యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ‘టెన్సింగ్ నార్కే సాహస పురస్కారం-2025’కు ఆన్‌లైన్‌లో నామినేషన్ల స్వీకరణ మొదలు


భూమి మీద, నీటిలో, నింగిలో చేసే సాహసిక కృత్యాల్లో శ్రేష్ఠత్వానికి,
అలాగే జీవన పర్యంతం సాధించిన విజయాలకు కూడా అందించే సత్కారం ఈ పురస్కారం

प्रविष्टि तिथि: 21 JUL 2026 4:10PM by PIB Hyderabad

సాహసిక కార్యకలాపాల రంగంలో శ్రేష్ఠ విజయాలను సాధించిన వారికి భారత్‌లో అందించే అత్యున్నత జాతీయ పురస్కారమైన ‘టెన్సింగ్ నార్కే జాతీయ సాహస పురస్కారం (టీఎన్ఎన్ఏఏ)-2025’ అందుకోవడం కోసం ఆన్‌లైన్లో నామినేషన్లను దాఖలు చేయాల్సిందిగా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ కోరింది. నామినేషన్లను 2026 జులై 21 నుంచి 2026 ఆగస్టు 20 మధ్య హోం వ్యవహారాల శాఖకు చెందిన జాతీయ పురస్కారాల పోర్టల్‌ ద్వారా స్వీకరిస్తారు.

సాహసిక కార్యకలాపాల రంగంలో అసాధారణ విజయాలకు గుర్తింపు ఇవ్వడం, యువతలో సహనశక్తి, సాహసం, జట్టు స్ఫూర్తి, నాయకత్వ భావనలకు స్ఫూర్తిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పురస్కారాలను నాలుగు కేటగిరీలలో ప్రదానం చేస్తున్నారు. ఆ కేటగిరీలు.. నేల మీద చేసిన సాహసిక కృత్యం, నీటిలో (సముద్రంలో) చేసిన సాహసకృత్యం, నింగిలో చేసిన సాహసిక కృత్యం, అలాగే జీవన సాఫల్య పురస్కారం. భారతీయ యువతీయువకులలో మరింత మంది సాహసిక కార్యకలాపాల్లో పాలుపంచుకొనేలా  ప్రోత్సాహాన్ని అందించడానికి ఈ పురస్కారాలను ఇస్తున్నారు.

‘టెన్సింగ్ నార్కే జాతీయ సాహస పురస్కారం’లో భాగంగా ఒక కాంస్య ప్రతిమనీ, ధ్రువపత్రాన్నీ, పట్టు టై తో పాటు బ్లేజరును గాని (లేదా చీరను గాని)  బహూకరిస్తారు. దీనికి తోడు, రూ.15 లక్షల నగదును కూడా అందిస్తారు. ఈ పురస్కారం స్థాయిలో అర్జున పురస్కారానికి సమానమైంది. దీనిని జాతీయ క్రీడా పురస్కారాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

 

ముఖ్య వివరణ

పురస్కారం

టెన్సింగ్ నార్కే జాతీయ సాహస పురస్కారం

కేటగిరీలు

భూమి మీద, జలం (సముద్రం)లో, నింగిలో చేసిన సాహసకృత్యం, జీవన సాఫల్యం

బహుమతి

కాంస్య ప్రతిమ, సర్టిఫికెట్టు, బ్జేజరు (లేదా చీర), రూ.15 లక్షల నగదు 

స్థాయి

అర్జున పురస్కారం స్థాయికి సమానమైన పురస్కారం ఇది

నామినేషన్లను

స్వీకరించే కాలం

2026 జులై 21 మొదలు 2026 ఆగస్టు 20 వరకు

దరఖాస్తు చేసే పద్ధతి

 ఆన్‌లైన్‌లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ పురస్కారాల పోర్టల్ https://awards.gov.in లోకి పోయి, దరఖాస్తును దాఖలు చేయాలి

సాహసిక పనుల రంగంలో అసాధారణ విజయాలను సాధించిన భారతీయ పౌరులు దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తులను ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా హోం వ్యవహారాల శాఖకు చెందిన జాతీయ పురస్కారాల పోర్టల్‌లోకి వెళ్లి దాఖలు చేయాలి. దరఖాస్తుదారులు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ యువజన విభాగం లేదా క్రీడల విభాగం లేదా గుర్తింపు గల సాహసిక సంస్థల నుంచి సిఫారసును తీసుకోవాలి. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం సిబ్బంది విషయంలో అయితే సిఫారసులు తప్పనిసరి. మంత్రిత్వ శాఖ సంస్థల వద్ద నుంచి కూడా నామినేషన్లను ఆహ్వానించవచ్చు, లేదా అర్హులైన వ్యక్తులను స్వయంగానూ నామినేట్ చేయవచ్చు.

దరఖాస్తుదారులు సంవత్సరం వారీగా విజయాలను కాలక్రమాన్ని అనుసరించి తెలియజేయవచ్చు. వర్తించే సందర్భాల్లో సహాయక దస్తావేజులతో కూడిన ఒక సూచీబద్ధ పీడీఎఫ్ ఫైలును అప్‌లోడ్ చేయాల్సివుంటుంది. భూమి, జల, వాయు సాహసిక కార్యాల కేటగిరీలకు గాను, ఎంపిక ప్రక్రియలో గత మూడు క్యాలెండర్ సంవత్సరాల తాలూకు విజయాలను పరిశీలిస్తారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్లను జాతీయ పురస్కారాల పోర్టల్ ( https://awards.gov.in) లో లేదా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో తాజా వార్తల విభాగంలో దాఖలు చేయవచ్చు. అలాగే పూర్తిత మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలు, తరుచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్ఏ‌క్యూస్)తో పాటు దరఖాస్తు ఫార్మేట్‌ను కూడా అక్కడే పొందవచ్చు.

 

***


(रिलीज़ आईडी: 2287228) आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Kannada , Malayalam