వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏపీఈడీఏ సహకారంతో ఉత్తరాఖండ్ నుంచి ఇరాక్‌కు 24 టన్నుల ఫ్రోజెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ తొలి ఎగుమతి


దీంతో ఉత్తరాఖండ్ విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు

प्रविष्टि तिथि: 20 JUL 2026 1:07PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) సహకారంతో ఉత్తరాఖండ్‌లోని ఉద్దం సింగ్ నగర్ జిల్లా కాశీపూర్ నుంచి 24 టన్నుల ఫ్రోజెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇరాక్‌కు తొలిసారిగా ఎగుమతి అయింది. విరున్ గ్లోబల్ ట్రేడ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ చేపట్టిన ఈ ఎగుమతి, భారత శుద్ధి చేసిన ఆహార ఎగుమతుల పరిధిని విస్తరించడంతో పాటు ఉత్తరాఖండ్ నుంచి విలువ ఆధారిత వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది.

 

ఈ ఉత్పత్తి నాణ్యత అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ మళ్లీ ఆర్డర్లు రావడానికి, సుదీర్ఘకాల వ్యాపార సంబంధాలకు దారితీస్తుందని, సంస్థతో పాటు ఈ ప్రాంతానికి నిరంతర ఎగుమతి అవకాశాలను సృష్టిస్తుందని ఎగుమతిదారు ధీమా వ్యక్తం చేశారు. సియాల్ (ఎస్‌ఐఏఎల్‌), గల్ఫ్‌ఫుడ్, ఇండస్‌ఫుడ్, వరల్డ్ ఫుడ్ ఇండియా వంటి ప్రముఖ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనల్లో ఎగుమతిదారు పాల్గొనేందుకు ఏపీఈడీఏ మద్దతు ఇచ్చింది. ఇది మార్కెట్ విస్తరణకు, అంతర్జాతీయ కొనుగోలుదారులతో అనుసంధానం కావడానికి తోడ్పడింది.

 

 

 

శుద్ధి వ్యవసాయ ఉత్పత్తుల ప్రపంచ సరఫరాదారుగా భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. 2025-26లో భారతదేశ ప్రాసెస్ చేసిన కూరగాయల ఎగుమతులు 7,26,874.70 మెట్రిక్ టన్నులకు చేరుకుని, 932.25 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించాయి. ఇందులో విలువ ఆధారిత బంగాళాదుంప ఉత్పత్తుల ఎగుమతులు 2,77,108.51 మెట్రిక్ టన్నులుగా నమోదు కాగా, వాటి విలువ 289.40 మిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంవత్సరంలో ఏపీఈడీఏ నిర్దేశిత ఎగుమతుల్లోలో ప్రాసెస్ చేసిన పండ్లు, కూరగాయలు రెండూ కలిసి దాదాపు 10 శాతంగా ఉన్నాయి.

ఉత్తరాఖండ్ వంటి తీరప్రాంతం లేని రాష్ట్రాల నుంచి జరిగే ఎగుమతుల పోటీతత్వాన్ని రవాణా ఖర్చులు ప్రభావితం చేస్తూనే ఉన్నాయని ఏపీఈడీఏ ఛైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్ తెలిపారు. ఎగుమతి పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి, ఎగుమతిదారులకు విస్తృత మార్కెట్ అందుబాటును కల్పించడానికి రవాణా సహాయక నిబంధనలతో సహా రాష్ట్ర వ్యవసాయ ఎగుమతి విధానం రూపకల్పన, అమలుపై ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో ఏపీఈడీఏ కలసి పనిచేస్తోందని ఆయన వెల్లడించారు.

 

 

 

ఉత్తరాఖండ్‌లో విస్తరిస్తున్న ఆహార శుద్ధి పరిశ్రమ, నాణ్యమైన ముడి ఉత్పత్తులకు నిరంతర డిమాండును సృష్టిస్తోంది. స్థానికంగా విలువ జోడింపును ప్రోత్సహిస్తూ, ఎగుమతి ఆధారిత సరఫరా వ్యవస్థలలో ఎక్కువమంది భాగస్వాములయ్యేలా ప్రోత్సహిస్తూ వ్యవసాయ విలువ వ్యవస్థ అంతటా బలమైన మార్కెట్ అవకాశాలను ఏర్పరుస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు మెరుగైన మార్కెట్ సౌకర్యాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు రాష్ట్ర ఆహార శుద్ధి ఎగుమతులను గణనీయంగా పెంచుతాయని భావిస్తున్నారు.

 

ఎగుమతి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ప్రపంచ మార్కెట్లకు ప్రాప్యతను సులభతరం చేయడానికి, భారత్‌ నుంచి విలువ ఆధారిత వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, ఎగుమతిదారులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ప్రాసెసర్లు, ఇతర వాటాదారులతో ఏపీఈడీఏ కలసి పనిచేస్తూనే ఉంది.

****

 

 


(रिलीज़ आईडी: 2286551) आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Tamil