ప్రధాన మంత్రి కార్యాలయం
సంప్రదాయ భారతీయ హస్తకళల ఆర్థికవృద్ధికి దోహదపడతాయనే తీరును వివరిస్తూ వచ్చిన వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
19 JUL 2026 12:57PM by PIB Hyderabad
ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా సంప్రదాయ భారతీయ హస్తకళలు ఆర్థికవృద్ధికి ఎలా దోహదపడతాయనే అంశాన్ని వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
'ఒక జిల్లా, ఒక ఉత్పత్తి' (ఓడీఓపీ) పథకం స్థానిక కళలకు మార్కెట్ అవకాశాలను కల్పించడంతో పాటు సుస్థిర జీవనోపాధిని సృష్టించడానికి, మన వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రపంచ వేదికపై భారత్ పోటీతత్వాన్ని బలోపేతం చేయడానికి ఎంతగానో తోడ్పడుతోందని ప్రధాని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
"ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా సంప్రదాయ భారతీయ హస్తకళలు ఆర్థికవృద్ధికి ఎలా దోహదపడతాయనే అంశాన్ని కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు వివరించారు.
'ఒక జిల్లా, ఒక ఉత్పత్తి' పథకం స్థానిక కళలకు మార్కెట్ అవకాశాలను కల్పించడంతో పాటు సుస్థిర జీవనోపాధిని సృష్టించడానికి, మన వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రపంచ వేదికపై భారతదేశ పోటీతత్వాన్ని బలోపేతం చేయడానికి ఎంతగానో తోడ్పడుతోంది."
(రిలీజ్ ఐడి: 2286423)
సందర్శకుల సూచీ సంఖ్య : : 86
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Urdu
,
English
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam