సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024 సంవత్సరానికి గానూ 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన

జాతీయ ఉత్తమ చలనచిత్రం ‘ఆర్టికల్ 370’

‘చందు ఛాంపియన్’, ‘భ్రమయుగం’ చిత్రాలకు గానూ కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టి ఉత్తమ నటులుగా ఎంపిక

‘ఆర్టికల్ 370’ చిత్రానికి గానూ యామీ గౌతమ్‌కు ఉత్తమ నటి పురస్కారం

ఉత్తమ తొలి దర్శకునిగా ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ దర్శకుడు రణ్‌దీప్ హుడా


ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ పురస్కారం గెలుచుకున్న 'భంగార్'
ఉత్తమ డాక్యుమెంటరీ పురస్కారం దక్కించుకున్న 'రామ్-నామి'
జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో మెరిసిన బ్లాక్‌బస్టర్ చిత్రాలు
‘కల్కి 2898 AD’, ‘పుష్ప: ది రూల్ పార్ట్-02’, ‘స్త్రీ 2’, ‘అమరన్’

प्रविष्टि तिथि: 18 JUL 2026 7:30PM by PIB Hyderabad

2024 సంవత్సరానికి గానూ 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలను ఈ రోజు ప్రకటించారు. ఈ పురస్కారాలు ఫీచర్ ఫిల్మ్‌లు, నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు, సినిమాపై రచనలు వంటి విభాగాల్లో భారతీయ సినీ రంగంలోని ఉత్తమ విజయాలను గుర్తించాయి.

 

‘ఆర్టికల్ 370’ చిత్రం జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ పురస్కారం గెలుచుకుంది. ‘భంగార్’ ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్‌, ‘రామ్-నామి’ ఉత్తమ డాక్యుమెంటరీ పురస్కారాలను గెలుచుకున్నాయి.

 

ప్రధాన తారాగణంలో ‘ఆర్టికల్ 370’ చిత్రానికి గానూ యామీ గౌతమ్ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకోగా... మమ్ముట్టి (భ్రమయుగం), కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్) జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని పంచుకున్నారు.

 

‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ చిత్రానికి రణదీప్ హూడా ఉత్తమ తొలి దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. కల్కి 2898 AD, అమరన్, పుష్ప: ది రూల్ పార్ట్-02, భూల్ భులయ్యా 3, స్త్రీ 2 వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలూ ప్రధాన పురస్కారాలను దక్కించుకున్నాయి. ఇది భారతీయ సినిమా వైవిధ్యానికి, శ్రేష్ఠతకు నిదర్శనంగా నిలిచింది.

 

ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ ఛైర్‌పర్సన్ శ్రీ జయరాజ్, నాన్-ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ ఛైర్‌పర్సన్ శ్రీ అసీమ్ సిన్హా, బెస్ట్ రైటింగ్ ఆన్ సినిమా జ్యూరీ ఛైర్‌పర్సన్ శ్రీ ఎ. చంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శి (ఫిల్మ్స్) డా. అజయ్ నాగభూషణ్ ఎం.ఎన్., ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ ధీరేంద్ర ఓఝాలు పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించారు.

 

పురస్కార గ్రహీతల పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి


(रिलीज़ आईडी: 2286221) आगंतुक पटल : 66
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Marathi , Kannada , Odia , Tamil , English , Malayalam , Khasi , Urdu , Urdu , हिन्दी , Gujarati