హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘2027 జన గణన’ ఒకటో దశ

తమిళనాడు, త్రిపురలో స్వీయ గణన ఆరంభం

కేరళ, నాగాలాండ్‌లో చురుగ్గా ఇళ్ల జాబితా, గృహ గణన

29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇళ్ల జాబితాతో పాటు గృహ గణన పూర్తి

మొదటిసారి డిజిటల్ పరికరాలతో ‘2027 జనగణన’

ప్రత్యేక మొబైల్ యాప్‌ ద్వారా డేటా సేకరణ..

ఇంటింటికీ వెళ్లి లెక్కించే సంప్రదాయ ప్రక్రియ కూడా యథాతథం

సెన్సస్ చట్టం-1948 కింద సేకరించిన సమాచారం గోప్యం..

గణాంక ప్రక్రియకూ, అభివృద్ధి పథకాల రూపకల్పనకూ మాత్రమే ఆ సమాచార వినియోగం

प्रविष्टि तिथि: 17 JUL 2026 3:17PM by PIB Hyderabad

ఇళ్ల జాబితాగృహ గణనకు (హౌస్‌లిస్టింగ్హౌసింగ్ సెన్సస్.. హెచ్ఎల్ఓఉద్దేశించిన స్వీయ గణన (ఎస్ఈప్రక్రియను నేడు తమిళనాడుత్రిపురలో మొదలుపెట్టారుఇది ‘2027 జనగణన’ మొదటి దశలో  ఒక భాగం. 2026 జులై 31 వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుందిదీని తరువాత 2026 ఆగస్టు నుంచి ఆగస్టు 30 మధ్య ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లిక్షేత్ర సంబంధిత గణన పనులను చేపడతారు.
తమిళనాడుత్రిపురల ప్రజలు అధికారిక స్వీయ గణన వెబ్‌సైట్ se.census.gov.in )లో స్వీయ గణనను పూర్తి చేయవచ్చుస్వీయ గణనను పూర్తి చేసిన కుటుంబ సభ్యులు స్వీయ గణన ఐడీ (ఎస్ఈ ఐడీ)ని సిద్ధంగా ఉంచుకునిఎన్యూమరేటరు క్షేత్ర పర్యటనకు వచ్చిన సమయంలో అందజేయాలిఅలా అందిస్తేహెచ్ఎల్ఓ ప్రక్రియ సాఫీగా పూర్తి అవుతుంది.
కేరళనాగాలాండ్‌లో ప్రస్తుతం ఇళ్ల జాబితాతో పాటు గృహ గణనకు సంబంధించిన క్షేత్ర స్థాయి కార్యకలాపాలు పురోగమిస్తున్నాయిఈ పనులను 2026 జులై 30 వరకూ కొనసాగిస్తారుస్వీయ గణనకు మొగ్గు చూపని కుటుంబాలను ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లేటప్పుడు వివరాలు అడిగి నమోదు చేసుకుంటారు.

ఇంతవరకు 2027 జన గణనను 29 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలలో పూర్తి చేశారువీటిలో అండమాన్నికోబార్ దీవులుఆంధ్రప్రదేశ్అరుణాచల్ ప్రదేశ్బీహార్చండీగఢ్ఛత్తీస్‌గఢ్దాద్రానగర్ హవేలీదమన్దీవ్ఢిల్లీగోవాగుజరాత్హర్యానాహిమాచల్ ప్రదేశ్జమ్మూకాశ్మీర్జార్ఖండ్కర్నాటకలద్దాఖ్లక్షద్వీప్మధ్యప్రదేశ్మహారాష్ట్రమేఘాలయమిజోరంఒడిశాపుదుచ్చేరిపంజాబ్రాజస్థాన్సిక్కింతెలంగాణఉత్తరప్రదేశ్ఉత్తరాఖండ్ ఉన్నాయి.
‘2027 
జనగణన’లో మొదటి సారి డిజిటల్ పరికరాలను విస్తృత స్థాయిలో ఉపయోగిస్తున్నారుసమాచారాన్ని మొబైల్ యాప్ ద్వారా సేకరిస్తున్నారుసమగ్రఖచ్చిత కవరేజీని నిర్ధారించడం కోసం ఇంటింటికి వెళ్లి జనాభా లెక్కలను సేకరించే సాంప్రదాయిక పద్ధతిని కూడా పాటిస్తున్నారుఈ దశలో నోటిఫై చేసిన 33 ప్రశ్నలతో కూడిన పత్రాల సాయంతో.. ఇంటి స్థితికుటుంబ సభ్యుల వివరాలుఅందుబాటులో ఉన్న సదుపాయాలుఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు.
సెన్సస్ చట్టం-1948’లో భాగంగా సేకరించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచుతారుఆ సమాచారాన్ని గణాంక ప్రక్రియలకీఅభివృద్ధి పథకాల రూపకల్పనకీ మాత్రమే ఉపయోగిస్తారునోటిఫై చేసిన రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ప్రజలు జన గణన ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలనీఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు వారు అడిగిన సమాచారాన్ని ఇచ్చి పూర్తి స్థాయిలో సహకరించాలనీ హోం శాఖ సూచిస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2285783) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati