రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్‌లో ఆపరేషన్ సదరన్ రెడీనెస్ 26-2 నిర్వహిస్తున్న భారత నావికాదళం

प्रविष्टि तिथि: 16 JUL 2026 1:21PM by PIB Hyderabad

2026 జులై 20 నుంచి 23 వరకు కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్‌లో ఆపరేషన్ సదరన్ రెడీనెస్ 26-2ను భారత నేవీ నిర్వహించనుందినాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ బహుళజాతి శిక్షణ కార్యక్రమాన్ని కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ (సీఎంఎఫ్భాగస్వామ్యంతో చేపడుతున్నారుసీఎంఎఫ్ ప్రత్యేక శిక్షణ విభాగమైనభారత నావికాదళ నేతృత్వంలోని కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 154 (సీటీఎఫ్ 154) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది

వృత్తిపరమైన సముద్ర భద్రతా శిక్షణకూప్రయోగాత్మక అనుభవానికీఉత్తమ పద్దతులను ఇచ్చిపుచ్చుకోవడానికీ... సీఎంఎఫ్ భాగస్వామ్య దేశాల సిబ్బందిని ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. 40కి పైగా దేశాలతో కూడిన బహుళ జాతీయ సముద్ర భాగస్వామ్య సంస్థ అయిన సీఎంఎఫ్ సహకారంతో... ప్రాంతీయంగా సామర్థ్య నిర్మాణానికిసామూహిక సముద్ర భద్రతకు భారత నౌకాదళం తన వంతు సహకారాన్ని అందిస్తుంది.

బోధనసిమ్యులేటర్ ఆధారిత శిక్షణప్రయోగాత్మక అనుభవం ఈ శిక్షణలో భాగంగా ఉంటాయిఈ సెషన్లలో సముద్ర చట్టాలుసముద్ర రంగంపై అవగాహనసమాచార వినిమయంమాదక ద్రవ్యాలను అరికట్టడంబలగాల పరిరక్షణఅనూహ్య దాడులుమానవ రహిత సముద్ర వ్యవస్థలుతదితర అంశాల గురించి వివరిస్తారుఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి నష్ట నివారణఅగ్నిమాపకంమ్యారిటైమ్ కమ్యూనికేషన్లుసముద్రంలో ప్రాణరక్షణబోర్డింగ్ విధానాలపై శిక్షణ ఇస్తారుఅలాగేభారతీయ నౌకాదళానికి చెందిన నౌకలో ప్రత్యేక శిక్షణ పొందుతారు.

భారతీయ నౌకాదళం అందించే ఆధునిక శిక్షణ సదుపాయాలుఅత్యాధునిక సిమ్యులేటర్లుఅధునాతన బోధనా పద్ధతులువృత్తిపరమైన అనుభవాన్ని ఆపరేషన్ సదరన్ రెడీనెస్ 26-2 ప్రదర్శిస్తుందిబోధనను ఆచరణాత్మక అనువర్తనంతో అనుసంధానించడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే దేశాల మధ్య పరస్పర కార్యాచరణ సామర్థ్యాన్నీవృత్తిపరమైన అవగాహననూసహకారాన్నీ పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం.. బహుళ దేశాల నావికా దళ శిక్షణలో పెరుగుతున్న భారతీయ నౌకాదళ సహకారాన్ని తెలియజేస్తుందిఅలాగే అత్యుత్తమ శిక్షణ కేంద్రంగా సదరన్ నేవల్ కమాండ్ పాత్రను తెలియజేస్తుందివృత్తిపరమైన సముద్ర శిక్షణకు ప్రాధాన్య ఎంపికగా భారతీయ నౌకాదళ స్థానాన్ని బలోపేతం చేస్తుంది.

image.png


 

 

***


(रिलीज़ आईडी: 2285408) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati