కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సదస్సును ప్రారంభించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


సామాజిక న్యాయం, బాధ్యతాయుతమైన ఆవిష్కరణ, సార్వత్రిక సామాజిక భద్రతతో కూడిన మానవ హిత ఉపాధి దిశగా కృషి చేయాలని పిలుపు

భారతదేశంలో సామాజిక భద్రతా కవరేజీ 2015లో 19 శాతం నుంచి 2026లో ఒక బిలియన్ మందికి విస్తరించిందని వెల్లడి

प्रविष्टि तिथि: 14 JUL 2026 4:35PM by PIB Hyderabad

కేంద్ర కార్మికఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు హైదరాబాద్‌లో ‘15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ (టియుఎఫ్) సదస్సు–2026’ను ప్రారంభించారు. సాంకేతిక పురోగతికి సామాజిక న్యాయంబాధ్యతాయుతమైన ఆవిష్కరణలుమానవ గౌరవం... మార్గనిర్దేశం చేయాలనికార్మిక సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే అంతర్జాతీయ వ్యవస్థను నిర్మించాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రారంభోత్సవంలో బ్రిక్స్ దేశాల నుంచి హాజరయిన ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. భారత్ అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్ ఇతివృత్తం – ‘‘స్థిరత్వంఆవిష్కరణలుసహకారంసుస్థిరత కోసం నిర్మాణం’’ గురించి వివరించారు. భవిష్యత్తులో ఉపాధి సమ్మిళితంగాసమానత్వంతో కూడినదిగాకార్మికుల సంక్షేమమే ప్రధానంగా ఉండేలా చూడటంలో దేశం ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధిని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు.

బ్రిక్స్ దేశాల ప్రతినిధులకు డాక్టర్ మాండవీయ ఆహ్వానం పలికారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంలోనూపారిశ్రామిక సామరస్యాన్ని బలోపేతం చేయడంలోనూఆర్థిక పురోగతితో పాటు సామాజిక న్యాయం కలసి సాగేలా చేయడంలోనూ కార్మిక సంఘాలు కీలకమైన పాత్రను పోషించాయని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో సబ్ కా సాథ్సబ్ కా వికాస్ దార్శనికతకు భారత్ కట్టుబడి ఉందనిదీనిలో సుస్థిరాభివృద్ధికి బలమైన ఆధారాలుగా ఆర్థిక వృద్ధికార్మిక సంక్షేమం ఉంటాయని తెలియజేశారు. ప్రభుత్వం చేపట్టిన కార్మిక సంస్కరణల గురించి మంత్రి వివరించారు. 29 కార్మిక చట్టాలను నాలుగు సరళమైన లేబర్ కోడ్‌లుగా మార్చామనిఅవి కార్మికుల హక్కులను మరింత బలోపేతం చేశాయని మంత్రి చెప్పారు. ఈ సంస్కరణల ద్వారా కనీస వేతనాలునియామక పత్రాలుమెరుగైన వృత్తి భద్రతఆరోగ్యండిజిటల్ అమలు వ్యవస్థలను అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా మొదటిసారి గిగ్ప్లాట్‌ఫామ్ శ్రామికులకు అధికారిక గుర్తింపునిచ్చాయి.

కార్మిక విధానాలను మార్చడానికి డిజిటల్ మౌలిక వసతులను భారత్ సద్వినియోగం చేసుకుందని డాక్టర్ మాండవీయ అన్నారు. ‘ఈ–శ్రామ్’ పోర్టల్లో 317 మిలియన్ల మంది అసంఘటిత కార్మికులు నమోదు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. తద్వారా వారికి వివిధ సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఉద్యోగార్థులుసంస్థలుకెరీర్ సెంటర్లుశిక్షణ సంస్థలను జాతీయ స్థాయి డిజిటల్ ఉపాధి వేదిక అయిన నేషన్ కెరీర్ సర్వీస్ పోర్టల్ అనుసంధానించిందని చెప్పారు. జాతీయ సామాజిక భద్రత వ్యవస్థ గురించి కూడా మంత్రి వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద సామాజిక భద్రత సంస్థల్లో ఒకటైన ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో 80 మిలియన్ల మంది క్రియాశీలక సభ్యులు, 8 మిలియన్ల మంది పింఛనుదారులు ఉన్నారని మంత్రి తెలియజేశారు. అలాగే 150 మిలియన్ల మంది బీమాదారులకువారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య సేవలనుసామాజిక భద్రతా ప్రయోజనాలను కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) అందిస్తుంది. ఈపీఎఫ్‌వోఈఎస్ఐసీల్లో నిరంతరం చేపడుతున్న సంస్కరణల వల్ల కవరేజీ విస్తృతి పెరిగిందనివిధాన ప్రక్రియలు సరళీకృతమయ్యాయనిసేవలు మెరుగయ్యాయని ఆయన వెల్లడించారు.

భారత్‌లో సామాజిక భద్రత పరిధిలోకి వచ్చే వారి సంఖ్య 2015లో 19 శాతం మాత్రమే ఉండగా.. 2025 నాటికి దేశంలో 94 కోట్ల మందితో అది 64.3 శాతానికి పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ సంఖ్య వంద కోట్లకు చేరినట్టు 2026 ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయన్నారు. ఉద్యోగ కల్పనపై మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం దాదాపు 170 మిలియన్ల ఉపాధి అవకాశాలను కల్పించిందని డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ అన్నారు. ‘ఉద్యోగావకాశాలను బట్టి ప్రోత్సాహకాల’ విధానం ద్వారా.. వచ్చే రెండేళ్లలో వ్యవస్థీకృత రంగంలో 35 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించాలని ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

ప్రభుత్వంయాజమాన్యాలుకార్మిక సంఘాల మధ్య త్రైపాక్షిక చర్చల ఆధారంగా దేశ కార్మిక పరిపాలన విధానాన్ని రూపొందించినట్టు డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వోఈఎస్ఐసీ వంటి సంస్థలూకార్మిక చట్టాల పరిధిలోని చట్టబద్ధ సంస్థలూ త్రైపాక్షిక యంత్రాంగం ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తాయనికార్మిక వ్యవహారాల నిర్వహణలో అన్ని వర్గాల ప్రాతినిధ్యం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని వివరించారు.

దాదాపు సగం ప్రపంచ జనాభాకు బ్రిక్స్ దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయనిప్రపంచంలో అతిపెద్ద కార్మిక శక్తుల్లో ఒకటిగా బ్రిక్స్ ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. సామాజిక భద్రతకార్మికుల రాకపోకలునైపుణ్యాభివృద్ధిఏఐ పాలనగౌరవప్రదమైన పని వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి గణనీయమైన అవకాశాలున్నాయన్నారు. త్వరలో నిర్వహించనున్న బ్రిక్స్ దేశాల కార్మికఉపాధి శాఖ మంత్రుల సమావేశానికి.. ఈ వేదిక చేసే సిఫార్సులు ఎంతో దోహదపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

అంతకుముందు బ్రిక్స్ కార్మిక సంఘాల ఫోరం సదస్సు - 2026 చైర్మన్భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జాతీయ అధ్యక్షుడు శ్రీ సుంకరి మల్లేశం మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించడానికిసమ్మిళిత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడమే ఈ సదస్సు లక్ష్యమన్నారు. బీఎంఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీబ్రిక్స్ కార్మిక సంఘాల ఫోరం ముఖ్య సంధానకర్త శ్రీ బి. సురేంద్రన్ ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ చర్చలు అర్థవంతమైన ఫలితాలనిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

బ్రిక్స్ దేశాల ప్రతినిధులు శ్రీ కార్లస్ అగస్టో ముల్లర్ (బ్రెజిల్)రష్యా స్వతంత్ర కార్మిక సంఘాల సమాఖ్య (ఎఫ్ఎన్‌పీఆర్) చైర్మన్ శ్రీ సెర్గీ చెర్నోగాయేవ్శ్రీ హుజియాంగ్ ఝూ (చైనా)శ్రీ మసలే గాడ్‌ఫ్రే సెలెమత్సేలా (దక్షిణాఫ్రికా)ఐఎల్‌వో-న్యూఢిల్లీ కార్మిక వ్యవహారాల నిపుణురాలు శ్రీమతి యూకీ ఒట్సుజీజస్టిస్ (విశ్రాంత) ఎన్. నగరేశ్ ప్రారంభ సదస్సులో పాల్గొన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) నిర్వహించిన ఈ మూడు రోజుల సదస్సు.. 50కి పైగా అంతర్జాతీయ ప్రతినిధులుభారతీయ కార్మిక సంఘాలకు చెందిన దాదాపు 70 మంది ప్రతినిధులుకార్మిక వ్యవహారాల నిపుణులువిద్యావేత్తలను ఒకే వేదికపై చేర్చింది. సార్వత్రిక సామాజిక భద్రత - అందరికీ ప్రయోజనాల వర్తింపుసమాజ హిత సాంకేతికత - బాధ్యతాయుత ఏఐభవిష్యత్ ఉపాధి అవకాశాల దిశగా నైపుణ్యాభివృద్ధిమారుతున్న పని వ్యవస్థలో మహిళలు అనే నాలుగు ప్రత్యేక ఇతివృత్తాలపై మిగతా రెండు రోజుల్లో ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారిస్తారు.  

 

***


(रिलीज़ आईडी: 2284564) आगंतुक पटल : 47
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Gujarati