ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో పడవ ప్రమాదం... ప్రాణనష్టం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని
ఎక్స్-గ్రేషియా ప్రకటించిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
13 JUL 2026 9:47PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో పడవ మునిగిన ఘటనలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి తన సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 అందజేస్తారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం:
‘‘పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో పడవ మునిగిన ఘటనలో ప్రాణ నష్టం జరగడం తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించింది. బాధిత కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మరణించిన వారి కుటుంబాలకి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని అందిస్తారు’’
***
(రిలీజ్ ఐడి: 2284420)
సందర్శకుల సూచీ సంఖ్య : : 43
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam