ప్రధాన మంత్రి కార్యాలయం
''భారత్-న్యూజిలాండ్: ఒక విజయవంతమైన భాగస్వామ్యం'' ఇతివృత్తంతో న్యూజిలాండ్ ప్రధాని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
11 JUL 2026 12:30PM by PIB Hyderabad
"భారత్-న్యూజిలాండ్: ఒక విజయవంతమైన భాగస్వామ్యం" ఇతివృత్తంతో న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ నిర్వహించిన ప్రత్యేక విందు కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ మోదీ హాజరయ్యారు. రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, విద్యా, సాంకేతిక, క్రీడా, కళా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
న్యూజిలాండ్ ప్రధాని తన స్వాగతోపన్యాసంలో... భారత్-న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న బలమైన, శాశ్వత సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ద్వైపాక్షిక సహకారం బలోపేతం, పరస్పర శ్రేయస్సును పెంపొందించడం పట్ల ఇరు దేశాల ఉమ్మడి దార్శనికతను ఆయన వివరించారు. ప్రధానమంత్రి శ్రీ మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర సహకార సమగ్రతను, శాశ్వతమైన ప్రజా సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఉన్నతీకరించడాన్ని ఆయన స్వాగతించారు. ఇది కొనసాగుతున్న సహకారాన్ని మరింతగా పెంపొందిస్తుందని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. రికార్డు సమయంలో కుదిరిన భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఇరు దేశాల్లోని వ్యాపారాలకు, యువతకు, రైతులకు కొత్త అవకాశాలను కల్పిస్తుందన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని సాధించడంలోనూ ఇది సహాయపడుతుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
గాలా లంచ్ అనంతరం, ఆ ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచిన వినూత్న క్రీడా పరికరాలను ఇరు దేశాల ప్రధానమంత్రులు పరిశీలించారు. న్యూజిలాండ్‌కు చెందిన ప్రఖ్యాత క్రీడాకారులు, క్రీడలకు సంబంధించిన అత్యున్నత స్థాయి భాగస్వాములతో వారు సమావేశమయ్యారు. ఇరుపక్షాల మధ్య వందేళ్ల క్రీడా సంబంధాలను గుర్తుచేసుకుంటూ... ఈ పర్యటన సందర్భంగా కుదిరిన క్రీడల ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, క్రికెట్‌కు అతీతంగా ఇరు దేశాలు తమ సంబంధాలను విస్తరించుకోవడానికి సహాయపడుతుందని ప్రధానమంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు. 2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యమివ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, క్రీడా సహకారాన్ని విస్తరించాలన్న ఇరుపక్షాల ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ పర్యటన సాగింది.
***
(रिलीज़ आईडी: 2283667)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam