ప్రధాన మంత్రి కార్యాలయం
నిస్వార్థ సేవా భావనను చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 JUL 2026 8:22AM by PIB Hyderabad
నిస్వార్థ సేవే మానవాళికి ఉన్న అత్యంత పెద్ద శక్తి అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సేవ, అంకితభావాల స్ఫూర్తితో, పౌరులందరి జీవితాలను మెరుగుపరచాలనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.
‘‘హితం యత్సర్వభూతానామాత్మానశ్చ సుఖావహమ్
తత్కృర్యాదీశ్వరే హ్యేతన్మూలం సర్వార్థ సిద్ధయే’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
ప్రాణులన్నింటికీ హితకరంగా ఉండే పనులను, స్వయంగా మీకు కూడా శాంతిని ఇచ్చే పనులను మాత్రమే చేయాలి. ఇదే దైవం పట్ల నిజమైన భక్తి. ఎందుకంటే, ఈ మార్గం ప్రతి మనిషీ చేసే ప్రయత్నాలకు, ఆధ్యాత్మిక విజయాలకు మూలాధారంగా నిలుస్తోందని మనకు ఈ సుభాషితం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ,
‘‘స్వార్థానికి చోటీయకుండా చేసే పనులే మానవాళికి ఉన్న అత్యంత పెద్ద శక్తి. సేవ, అంకిత భావంతో ప్రతి ఒక్కరి జీవితాన్ని మెరుగుపరచాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నాం.
‘‘హితం యత్సర్వభూతానామాత్మానశ్చ సుఖావహమ్
తత్కృర్యాదీశ్వరే హ్యేతన్మూలం సర్వార్థ సిద్ధయే’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2283199)
आगंतुक पटल : 6