రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఎన్‌హెచ్ఎల్ఎంఎల్ ప్రాజెక్టుల పురోగతిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమీక్ష.. మల్టీమోడల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని పిలుపు
प्रविष्टि तिथि:
06 JUL 2026 2:10PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా రవాణా రంగాన్ని ఆధునీకరించేలా నిర్మిస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు (ఎంఎంఎల్‌పీ) రోప్వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్లు, రహదారుల వెంబడి ఉండే ప్రయాణికుల వసతుల ప్రగతిపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో నేడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారుల లాజిస్టిక్స్ నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్ఎల్ఎంఎల్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సాగుతున్న వివిధ ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పురోగతిని ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు.
భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా, అన్ని రవాణా మార్గాలను అనుసంధానించే సమగ్ర రవాణా వ్యవస్థను నిర్మించడంలో ఈ విప్లవాత్మక ప్రాజెక్టులు అత్యంత వ్యూహాత్మకమైనవని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇవి వివిధ రవాణా మార్గాల మధ్య అనుసంధానతను బలోపేతం చేయడమే కాకుండా, సరికొత్త ఆర్థిక అవకాశాలను సృష్టిస్తాయని తెలిపారు. అలాగే ప్రాంతీయ అసమానతలను తొలగించి సమతుల్య అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశపు లాజిస్టిక్స్ పోటీతత్వాన్ని ఇవి గణనీయంగా పెంచుతాయని మంత్రి వివరించారు.
ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న కీలక సవాళ్లు, ఆటంకాలను పరిశీలించిన కేంద్రమంత్రి... పనులకు అడ్డుపడుతున్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో వెంటనే పరిష్కరించి, ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని సంబంధిత భాగస్వాములందరినీ ఆదేశించారు. ఈ ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడం ద్వారా దేశంలో లాజిస్టిక్స్ సామర్థ్యం పెరుగుతుందని, రవాణా ఖర్చులు తగ్గుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఆధునిక వసతులు అందుబాటులోకి రావడం ద్వారా వికసిత భారత్, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.


***
(रिलीज़ आईडी: 2281623)
आगंतुक पटल : 16