ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పాండవానీ గాయని తిజన్ బాయి మృతిపై ప్రధానమంత్రి సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 05 JUL 2026 12:07PM by PIB Hyderabad

   ప్రముఖ పాండవానీ గాయని తిజన్ బాయి మృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. అద్భుత ప్రతిభావంతురాలైన ఆమె తన ప్రదర్శనలతో ఛత్తీస్‌గఢ్ పాండవానీ జానపద కళారూపానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చారని శ్రీ మోదీ కొనియాడారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సంతాప సందేశంలో:

   “ప్రసిద్ధ పాండవానీ గాయని తిజన్ బాయి మృతి వార్త నన్నెంతో కలచి వేసింది. ఆమె తన అద్భుత ప్రదర్శనలతో ఈ ఛత్తీస్‌గఢ్ ప్రాంత జానపద కళారూపానికి అంతర్జాతీయ గుర్తింపును ఆర్జించి పెట్టారు. ఆమె మరణం కళాసాంస్కృతిక లోకానికి పూడ్చలేని లోటు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను... ఓం శాంతి!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2281437) సందర్శకుల సూచీ సంఖ్య : : 55