సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఎమ్ఎస్ఎమ్ఈ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఎస్‌సీ-ఎస్‌టీ హబ్ (ఎన్ఎస్ఎస్‌హెచ్) పథకం... షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పనే ఈ పథకం లక్ష్యం


దీని బిజినెస్ యాక్సిలరేటర్ ప్రోగ్రాము (బీఏపీ)... సువ్యవస్థిత మార్గదర్శకత్వం, పరిశ్రమ సంబంధిత సమాచారం, లక్షిత వాణిజ్య కార్యక్రమాల అమలు ద్వారా
ఉన్నత సామర్థ్యాలను మ్యాపింగ్ చేసేందుకు వీలైన వాణిజ్యాభివృద్ధితో జోడించడంలో
పరివర్తనపూర్వక పాత్రను పోషిస్తోంది

కార్యకలాపాలను పెంచుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని తగ్గించడంతో పాటు ప్రధాన స్రవంతికి చెందిన ఆర్థిక కార్యకలాపాల్లో భాగం పంచుకోవడంలో
వాణిజ్య సంస్థలు వాటి సామర్థ్యాన్ని వివిధ, భౌగోళిక ప్రాంతాల్లో వెల్లడించుకొనేందుకు
బీఏపీ తన లక్షిత మద్దతుతో తోడ్పడుతోంది

प्रविष्टि तिथि: 03 JUL 2026 9:50AM by PIB Hyderabad

జాతీయ ఎస్‌సీ-ఎస్‌టీ హబ్ (ఎన్ఎస్ఎస్‌హెచ్) పథకం ద్వారా సమ్మిళిత అభివృద్ధికి వేగాన్ని జతపరచడం
జాతీయ ఎస్‌సీ-ఎస్‌టీ హబ్ (ఎన్ఎస్ఎస్‌హెచ్) పథకం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారతను కల్పించడానికి రూపొందించిన ఒక లక్షిత పథకం. మార్కెట్లు, ఆర్థికసాయం, సాంకేతికత, సామర్థ్య లేమి, సంస్థాగత నెట్‌వర్క్ వంటి సమస్యలను దూరం చేసి, ఈ వాణిజ్య సంస్థలు తమ పోటీతత్వాన్ని, స్థిరత్వాన్ని పెంచుకోవడానికి ఈ పథకం తోడ్పడుతోంది. పబ్లిక్ టెండర్లలో పాలుపంచుకోవడాన్ని ప్రోత్సహించడానికి తోడు దీర్ఘకాలిక అభివృద్ధి, సుదృఢత్వం, మరింత ఎక్కువ ఉనికి.. వీటికి సంబంధించిన అవకాశాలను ఎన్ఎస్ఎస్‌హెచ్ అందిస్తోంది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రధాన స్రవంతి ఆర్థిక వ్యవస్థలో అధిక ప్రభావవంతమైన పద్ధతిలో ఏకీకృతం కావడానికి, దేశ ఆర్థిక ప్రగతికి అర్థవంతమైన తోడ్పాటును అందించడానికీ ఈ స్కీము వీలు కల్పిస్తోంది.
సామర్థ్యాలను పెంచడం: వాణిజ్య అభివృద్ధికి పునాదిని వేయడం
సామర్థ్యాల పెంపుపై శ్రద్ధ చూపడమే ఈ మార్పునకు మూలాధారంగా ఉంది. ఇది షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు సువ్యవస్థిత, నియమాల్ని పాటించే మార్కెట్లలో విజయవంతం కావడానికి అవసరమైన ఉపకరణాలనూ, జ్ఞానాన్నీ అందిస్తోంది. ఈ కార్యక్రమాలు ఆర్థిక నిర్వహణ, టెండర్లలో పాలుపంచుకోవడం, ధరల ఖరారు వ్యూహాలతో పాటు నియంత్రణ సంబంధిత అవగాహన వంటి కీలక అంశాలను కలుపుకొని సాంప్రదాయిక శిక్షణ కన్నా మరింతగా ముందుకు సాగుతున్నాయి. ఈ సమగ్ర దృష్టికోణం మార్కెట్లో భాగస్వామ్యం కోసం వాటి సన్నాహాల్ని పెంపొదించడంతోనే సరిపెట్టకుండా, వాటి వాణిజ్య సంబంధ ఆత్మవిశ్వాసాన్ని, సుదృఢత్వాన్ని కూడా పెంపొందిస్తోంది.  
 బిజినెస్ యాక్సిలరేటర్ ప్రోగ్రాం (బీఏపీ): మెరుగైన మార్కెట్ అవకాశాల ప్రవేశద్వారం
ఇదే ఆధారంగా చేసుకొని, ఉన్నత సామర్థ్యాలను కొలవదగిన వాణిజ్యాభివృద్ధితో ముడిపెట్టడంలో ఒక పరివర్తనకారి పాత్రను బిజినెస్ యాక్సిలరేటర్ ప్రోగ్రాము (బీఏపీ) పోషిస్తున్నది. సువ్యవస్థిత మార్గదర్శనాన్నీ, పరిశ్రమల సమాచారాన్నీ, లక్షిత వాణిజ్య జోక్యాల్నీ బీఏపీ అందించి, వాణిజ్య వ్యూహం, ధరల ఖరారు, నిర్వహణ సామర్థ్యం, మార్కెట్టుకు సంబంధించిన కీలక సవాళ్లను అధిగమించడంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాయపడుతుంది.
వివిధ రంగాల్లో, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ముక్కచెక్కలైన దృష్టికోణాలను దాటి సువ్యవస్థిత, డేటా ఆధారిత వ్యూహాల వైపు సాగిపోయే స్థితిని బీఏపీ కల్పించింది. ఫలితంగా వారు మార్కెట్ల అంచనాలకు తగినట్లు మారడంలోనూ, పెద్ద అవకాశాల వరకూ చేరుకోగలిగేటట్లుగానూ.. ప్రత్యేకించి ప్రభుత్వ కొనుగోళ్ల విషయంలో.. సాయాన్ని అందిస్తోంది.  
పరివర్తనాత్మక కథలు: వాణిజ్య సంస్థల కార్యాచరణ

     నియమపాలన ఆధారిత మార్కెట్లలో సందర్భశుద్ధిని ఏర్పరచడం - పశ్చిమ బెంగాల్‌లోని మెసర్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంజినీరింగ్ గాథ
అత్యధిక స్థాయి నియంత్రణ కొనసాగుతున్న అగ్ని ప్రమాదాల నివారణ పరిశ్రమలో పని చేస్తున్న శ్రీ దేబాశీస్ మండల్‌‌కు చెందిన వాణిజ్య సంస్థ మొదట్లో ధరల ఖరారు, మార్కెట్లో ఉనికి, పోటీతత్వంతో కూడిన సవాళ్లని ఎదుర్కోవలసి వచ్చింది. అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ కల్పించే సాధనాలు, జీవన సురక్షకు సంబంధించిన ఉపకరణాల వంటి విశ్వసనీయ ఉత్పాదనల్ని అందిస్తున్నప్పటికీ కూడా ఒక సువ్యవస్థిత వ్యూహం లోపించడం ఈ సంస్థ వృద్ధికి పరిమితులను ఏర్పరిచింది.
ఐఐఎమ్ సంబల్‌పూర్‌లో బీఏపీ మాధ్యమం ద్వారా ధరల ఖరారు ప్రాథమిక ప్రణాళికనూ, ఖర్చు పెట్టే అంశాల్లోనూ ఆయన స్పష్టమైన అవగాహనను సంపాదించుకున్నారు. దీంతో ఆయనకు డేటా ఆధారిత దృష్టికోణాన్ని అలవరుచుకోవడంలో సాయం లభించింది. ఫలితంగా ఆయనలో పోటీతత్వం, మార్కెట్లో ఉనికీ బలపడ్డాయి. దీంతో ఆయన ప్రభుత్వ కొనుగోళ్లలో విజయవంతంగా పాలుపంచుకోగలిగారు. పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి రూ.8.48 లక్షల టెండరును ఆయన చేజిక్కించుకున్నారు.
     స్వచ్ఛ ఇంధన విస్తరణ - అస్సామ్‌లోని మెసర్స్ రెనెర్జీ సొల్యూషన్ సంస్థ కథ
పునరుత్పాదక ఇంధనంలో బలమైన సాంకేతిక పునాదిని కలిగిన శ్రీ భార్గవ్ దేవోరీ నెలకొల్పొన వాణిజ్య సంస్థ రెనెర్జీ సొల్యూషన్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ ప్రణాళికలో గట్టి పట్టును సాధించింది. ప్రభుత్వ సంస్థలకు సౌర ఇంధన ప్లాంటులను ఏర్పాటు చేసే అవకాశాలను చురుగ్గా అందుకుంటోంది. ఏమైనా, అభివృద్ధిని నిలబెట్టుకోవడంతో పాటు మరింత ముందుకు తీసుకుపోవడానికి వ్యూహాత్మక దిశను పటిష్ఠపరుచుకోవడం, వాణిజ్య ప్రక్రియలకు లాంఛన రూపాన్ని ఇవ్వడం ఎంతో ముఖ్యం.
బీఏపీ ద్వారా మెసర్స్ రెనెర్జీ సొల్యూషన్ సంస్థ సంపాదించిన అనుభవం ఆధారంగా నిర్వహణ దశ నుంచి మారి, మరింత ఎక్కువ వృత్తికౌశలాన్ని సంతరించుకుని మార్కెట్- ప్రధాన దృష్టికోణాన్ని అనుసరించింది. ఇది ఈ సంస్థ స్థితిని బలోపేతం చేసింది. కొనుగోలు వేదికలతో అనుబంధాన్ని పెంచి, ప్రభుత్వ టెండర్లలో భాగం పంచుకొనేందుకు సంస్థ సన్నద్ధతను పటిష్ఠపరిచింది. దీంతో అవకాశాలను ఇదివరకటితో పోలిస్తే ఎక్కువ ప్రభావవంతంగా వినియోగించుకోగల స్థితికి సంస్థ ఎదిగేట్లు చేసింది. పబ్లిక్ కొనుగోలుదార్లు, ప్రభుత్వ కొనుగోలుదార్లతో పునరుత్పాదక ఇంధన రంగంలో తన ప్రభావాన్ని చెప్పుకోదగిన స్థాయిలో మెరుగుపరుచుకొనేట్లు చేసింది.
     ఖచ్చితమైన వేగాన్ని జతపరచడం: మహారాష్ట్రలోని సావల్‌రామ్ ఎంటర్‌ప్రైజెస్ కథ ఇది
నాసిక్‌లో ఉన్న సావల్‌రామ్ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు శ్రీ సునీల్ పోపట్‌రావ్ జగ్‌తాప్‌ హైడ్రాలిక్ సిలిండర్ల తయారీలో నిపుణుడు. ఒక ఇంజినీరింగ్ సంస్థలో 18 సంవత్సరాల పాటు ఆయన పని చేసిన తరువాత, 2010లో  సొంత తయారీ సంస్థను ప్రారంభించారు. ఒక బలమైన హైడ్రాలిక్ సిలిండరును అభివృద్ధి చేశారు.
తన వ్యాపారాన్ని దృఢతరం చేసుకొనే ఉద్దేశంతో, ఐఐఎమ్ షిల్లాంగుకు చెందిన బిజినెస్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ (బీఏపీ)లో ఆయన చేరారు. అక్కడ వాణిజ్య వ్యూహంతో పాటు ప్రభుత్వ టెండర్లను గురించిన లోతైన అవగాహనను ఆయన ఏర్పరుచుకోగలిగారు. కార్యక్రమం ద్వారా లభించిన జ్ఞానాన్నీ, అవగాహననీ వినియోగించుకొని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐఎల్) నుంచి హైడ్రాలిక్ సిలిండర్ల సరఫరాకు సంబంధించిన రూ.5.10 లక్షల టెండరును విజయవంతంగా ఆయన దక్కించుకున్నారు. ఈ విజయంతో వాణిజ్య సంస్థ వ్యాపార పనితీరు పెంపొందింది. మార్కెట్లో సంస్థ ఉనికి విస్తరించింది. సుస్థిరాభివృద్ధి బాటలో ఈ సంస్థ దూసుకుపోతోంది.
     భవిష్యత్తుకేసి చూడడం: సమ్మిళిత వృద్ధి కోసం మరిన్ని అవకాశాల్ని అందుకొని, ప్రభావాన్ని నిలబెట్టుకొంటున్న వైనం
ఈ వాణిజ్య సంస్థలు పుంజుకొంటూ, సమ్మిళిత వృద్ధికి సంబంధించిన విస్తృత అవగాహనకు రూపురేఖలను తీర్చిదిద్దుతున్నాయి. ఈ క్రమంలో, సాధికారత, ఆర్థిక భాగస్వామ్యాలకు ఒక సాధనంగా ఔత్సాహిక పారిశ్రామికత్వం మారుతున్నది. అడ్డంకుల్ని అధిగమించడం మొదలు కార్యకలాపాలను విస్తరించడం, ప్రధాన స్రవంతికి చెందిన ఆర్థిక కార్యకలాపాల్లో భాగం పంచుకోవడం వరకూ.. లక్షిత సాయం అందినప్పుడు వివిధ రంగాల్లోనూ, భౌగోళిక ప్రాంతాల్లోనూ అవకాశాల్ని ఏ స్థాయిలో ఈ వాణిజ్య సంస్థలు అందుకోగలవో అనే దానికి ఉదాహరణల్ని అందిస్తున్నాయి. 2047 కల్లా ఒక ‘వికసిత్ భారత్’ను ఆవిష్కరించాలని మన దేశం భావిస్తున్న నేపథ్యంలో, జాతీయ ఎస్‌సీ-ఎస్‌టీ హబ్ స్కీము వ్యక్తిగత వాణిజ్య సంస్థల్ని బలోపేతం చేయడం ఒక్కటే కాకుండా సామర్థ్యాల పెంపుదల, మార్గదర్శకత్వంతో కూడిన సహాయం, వ్యూహాత్మక చొరవలు సమ్మిళితత్వాన్ని అర్థవంతమైన ఆర్థిక పురోగతిగా మార్చే పద్ధతికీ ఒక కొత్త రూపాన్నిస్తోంది.  
ఎస్‌సీ-ఎస్‌టీ హబ్ పథకాన్ని గురించి మరింత ఎక్కువ సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు.. :  https://www.scsthub.in/

 

***


(रिलीज़ आईडी: 2280950) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Tamil