శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బీహార్‌లోని ముంగేర్‌లో 700 ఏళ్ల నాటి మర్రిచెట్టు

प्रविष्टि तिथि: 03 JUL 2026 3:43PM by PIB Hyderabad

బీహార్‌లోని ముంగేర్‌లో దాదాపు 700 సంవత్సరాల నాటి పురాతన మర్రిచెట్టును శాస్త్రవేత్తలు గుర్తించారురేడియోకార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా ఖచ్చితమైన వయసును నిర్ధారించిన అత్యంత పురాతన మర్రిచెట్టు (ఫైకస్ బెంగాలెన్సిస్‌)గా ఇది రికార్డు సృష్టించిందికేవలం స్థానిక కథలుచారిత్రక రికార్డులపై ఆధారపడకుండాపక్కా శాస్త్రీయ ఆధారాలపై మాత్రమే దీని వయసు లెక్కించడం విశేషం.

మర్రిచెట్లు ఊడలుకొమ్మలతో పక్షులుకీటకాలు వంటి ఎన్నో రకాల వన్యప్రాణులకు సహజ సిద్ధమైన ఆవాసాలను కల్పిస్తాయిశతాబ్దాలుగా దేశ సామాజికసాంస్కృతిక జీవనంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయిసాధారణంగా ఇటువంటి ప్రాచీన వృక్షాల వయసును అంచనా వేయడానికి జానపద కథలుస్థానిక కథనాలపాత రికార్డులను ఉపయోగించేవారుకానీ ఇవి చాలా వరకు ఖచ్చితంగా ఉండవుచరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఇటువంటి వృక్షాలకు గతంలో స్పష్టమైన నిబంధనలు లేపోవడం వల్ల శాస్త్రీయంగా వయసు నిర్ధారణ జరగలేదుక్షేత్రస్థాయి నమూనాలుప్రయోగశాల విశ్లేషణల ద్వారా ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే వెడల్పాటి ఆకులు గల వృక్షాల్లో వయసును తెలిపే వార్షిక వలయాలు స్పష్టంగా ఉండవుదీనివల్ల సంప్రదాయ డెండ్రోక్రోనలాజికల్ (వృక్ష కాలగణన పద్ధతులుఇక్కడ పని చేయలేదుఅందుకే దీనిని రేడియో కార్బన్ డేటింగ్ వంటి ప్రత్యామ్నాయఅత్యంత ఖచ్చితత్వంతో కూడిన సరికొత్త సాంకేతిక పద్ధతులను ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది.

 

బీహార్ అటవీ శాఖ ఆహ్వానం మేరకు కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ (డీఎస్‌టీపరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన లక్నోలోని బీర్బల్ సాహ్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ త్రినా బోస్ ఈ పరిశోధనను ప్రారంభించారుఉష్ణమండల ప్రాంతాల్లోని వెడల్పాటి ఆకులు గల వృక్షాల వయసును నిర్ధారించడానికి సంప్రదాయ పద్ధతులు సరిపోవని గుర్తించి సరికొత్త శాస్త్రీయ విధానానికి ఆమె శ్రీకారం చుట్టారుడాక్టర్ త్రినా బోస్ నేతృత్వంలో డాక్టర్ మయాంక్ శేఖర్డాక్టర్ అఖిలేష్ కే యాదవ్‌లతో కూడిన పరిశోధనా బృందం సంయుక్తంగా ఈ వినూత్న పద్ధతిని అభివృద్ధి చేసిమర్రిచెట్టును వయసును విజయవంతంగా నిర్ధారించారు.

 

డాక్టర్ బోస్ నేతృత్వంలోని డాక్టర్ శేఖర్డాక్టర్ యాదవ్‌లతో కూడిన శాస్త్రవేత్తల బృందం.. ఈ మర్రిచెట్టు ద్వితీయ కాండంఒక పురాతన ప్రాథమిక కొమ్మ లోపలి భాగం నుంచి చెక్క నమూనాలను సేకరించిందివృక్షం పెరిగే ప్రాథమిక దశలో ఏర్పడే మొదటి భాగం కాబట్టి ఈ లోపలి భాగం పరిశోధనకు అత్యంత కీలకంఈ నమూనాల నుంచి మొక్కల కణ గోడల్లో ఉండే అత్యంత స్థిరమైన ప్రాథమిక భాగమైన ఆల్ఫా-సెల్యులోజ్‌ను వారు వేరు చేశారుఈ సెల్యులోజ్ నమూనాలకు యాక్సిలరేటర్ మాస్ స్పెక్ట్రోమెట్రీ సాంకేతికతను ఉపయోగించి అత్యంత ఖచ్చితత్వంతో కూడిన రేడియో కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించారుఆ తర్వాత ఈ ఫలితాలను కొత్త ఇంట్‌ కాల్ 20 కాలిబ్రేషన్ కర్వ్ఆక్స్ కాల్ సాఫ్ట్‌వేర్‌లతో సరిపోల్చడం ద్వారా ఈ మర్రిచెట్టు వయసుకు సంబంధించిన అత్యంత విశ్వసనీయమైనపక్కా అంచనాపై శాస్త్రవేత్తల బృందం నిర్ధారణకు వచ్చింది.

 

ఈ కొత్త పరిశోధన ముంగేర్ మర్రిచెట్టుకు సంబంధించి గతంలో ఉన్న అంచనాలను పూర్తిగా తొలగించేసిందిఇక్కడి చారిత్రక ‘బుర్రా బంగ్లా నిర్మాణం..మొఘల్ పాలన చివరి దశ లేదా బ్రిటీష్ పాలన ప్రారంభ కాలానికి సుమారు 300 నుంచి 350 సంవత్సరాల క్రితంచెందినదని దాని నిర్మాణ శైలిని బట్టి తెలుస్తోందిదీంతో అప్పట్లో పాలకులుప్రజల మధ్య చర్చలుగ్రామ సభలుమతపరమైన ఆచారాలుసాంస్కృతిక మార్పిడిల కోసం ఈ బంగ్లా ముందే ఈ మర్రిచెట్టును నాటారని అంతా భావించేవారుకానీ ఈ చెట్టు వయసు 700 ఏళ్లుగా తేలడంతో.. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న సహజ సిద్ధమైన అడవికి చెందిన సజీవ సాక్ష్యంగా ఈ మర్రిచెట్టు మిగిలిందనిదాని నీడలోనే ఈ బుర్రా బంగ్లా నిర్మాణం జరిగిందని స్పష్టమైందిఈ విశ్లేషణ ఈ ప్రాంతపు చారిత్రక సంఘటనల క్రమాన్ని పునర్నిర్వచిస్తుంది.

 

క్వాటర్నరీ రీసెర్చ్‌ పత్రికలో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి వారసత్వ వృక్షాల ఖచ్చితమైన వయసును నిర్ధారించడానికి ఒక ప్రామాణిక శాస్త్రీయ పద్ధతిని అందించిందిఇది ప్రభుత్వాలుఅటవీ శాఖలుసంరక్షణా సంస్థలకు సాంస్కృతికపర్యావరణ ప్రాధాన్యత కలిగిన వృక్షాలను గుర్తించికాపాడుకోవడానికి ఎంతో సహాయపడుతుందిఊహాజనిత అంచనాల స్థానంలో నమ్మకమైన శాస్త్రీయ ఆధారాలను తీసుకురావడం ద్వారా సహజసాంస్కృతిక వారసత్వ సంరక్షణను ఇది మరింత బలోపేతం చేస్తుందిఈ వినూత్న పద్ధతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాచీన ఉష్ణమండల వృక్షాలకు కూడా వర్తింపజేయవచ్చుఇది జీవవైవిధ్య సంరక్షణవారసత్వ నిర్వహణపర్యావరణ విద్యగతకాలపు వాతావరణంచారిత్రక భూభాగాలపై జరిగే పరిశోధనలకు ఎంతగానో సహాయపడుతుంది.

 

ఫోటో క్యాప్షన్: బీహార్‌ రాష్ట్రం ముంగేర్‌లోని ఐటీసీ క్యాంపస్‌లో ఉన్న పురాతన మర్రిచెట్టు

 

(చెట్టు సముదాయంచిత్రంలో పసుపు రంగు గుర్తు ద్వారా నమూనాలను సేకరించిన ద్వితీయ కాండంకొమ్మను సూచిస్తుంది.

 

(బిద్వితీయ కాండం నుంచి టీబీ-ఎంయూఎన్-01గా పేర్కొన్న నమూనాను సేకరించారు.

 

(సిఅత్యంత పురాతనమైన కొమ్మ నుంచి టీబీ-ఎంయూఎన్-02గా పేర్కొన్న నమూనాను సేకరించారు.

 

ఈ పరిశోధనఉష్ణమండల ప్రాంతాలలోని పురాతన వృక్షాలముఖ్యంగా మర్రిచెట్టు వంటి సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన వాటి శాస్త్రీయ కాల నిర్ధారణలో ఒక ప్రధాన పురోగతిని సూచిస్తుందిఇది అటువంటి చెట్ల వయస్సును మరింత కచ్చితంగా నిర్ధారించడంలో సహాయపడటమే కాకుండాదక్షిణాసియా మరియు ఇతర ప్రాంతాలలో సహజచారిత్రకసాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే ప్రయత్నాలకు కూడా మద్దతు ఇస్తుంది.

 

ఉష్ణమండల ప్రాంతాలలోని ప్రాచీన వృక్షాలకుముఖ్యంగా దేశ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత కలిగిన మర్రిచెట్టు వంటి చారిత్రక చెట్లకు శాస్త్రీయంగా వయసు నిర్ధారించే ప్రక్రియలో ఈ పరిశోధన అత్యంత కీలకంగా నిలుస్తుందిఈ సరికొత్త పద్ధతి ఇటువంటి వృక్షాల వయసును మరింత ఖచ్చితంగా లెక్కించడానికే కాకుండా.. భారత్‌తో పాటు యావత్ దక్షిణాసియాప్రపంచవ్యాప్తంగా ఉన్న సహజచారిత్రకసాంస్కృతిక వారసత్వ సంరక్షణ ప్రయత్నాలకు ఎంతగానో తోడ్పడుతుంది.

ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలను కింద పేర్కొన్న లింక్ ద్వారా చదవవచ్చు.

https://doi.org/10.1017/qua.2026.10086


(रिलीज़ आईडी: 2280944) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil