ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జులై 4న రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి పర్యటన


బాలోతరాలో సుమారు రూ.1.06 లక్షల కోట్ల ఖర్చుతో పూర్తి చేసిన అభివృద్ధి ప్రాజెక్టులను దేశ ప్రజలకు అంకితం చేయడం, ప్రారంభించడంతో పాటు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

వీటిలో పెట్రోరసాయనాలు నుంచి పట్టణ రవాణా, రైల్వేలు, రోడ్లు, పునరుత్పాదక ఇంధనంతో పాటు విద్యుత్తు సరఫరా సహా వివిధ రంగాలకు చెందిన ప్రాజెక్టులు

బాలోతరా.. పచ్‌పద్‌రాలో భారత మొదటి గ్రీన్‌ఫీల్డ్ ఏకీకృత రిఫైనరీ, పెట్రోరసాయనాల కాంప్లెక్సును దేశ ప్రజలకు అంకితం చేయనున్న ప్రధానమంత్రి

ఈ అత్యాధునిక కాంప్లెక్సులో రిఫైనింగ్, పెట్రోరసాయనాల ఉత్పత్తిని ఏకీకరించారు.. రూ.79,450 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు ఏర్పాటు

జైపూర్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

మార్పుచేర్పులు చేసిన ఉడాన్ పథకాన్ని జోధ్‌పూర్‌లో ప్రారంభించనున్న ప్రధానమంత్రి

జోధ్‌పూర్ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్న ప్రధాని

భారత సెమీకండక్టర్ తయారీ రంగంలో ఓ కీలక ప్రగతి ప్రస్థానానికి సూచికగా నిలిచే సీజీ సెమీ ఓఎస్ఏటీ కేంద్రాన్ని అహ్మదాబాద్‌.. సాణంద్‌లో ప్రారంభించనున్న ప్రధానమంత్రి

సీజీ సెమీ ప్లాంటులో భారత్‌కు చెందిన మొదటి ఎండ్-టూ-ఎండ్ ఓఎస్ఏటీ సౌకర్యాలలో ఒకటి కానుంది.. ఇది సెమీకండక్టర్ అసెంబ్లీ, పరీక్షా సేవలను అందిస్తుంది

పూర్తి స్థాయిలో ప్రారంభించిన తరువాత, ఈ కేంద్రానికి ఏటా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్స్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది

प्रविष्टि तिथि: 03 JUL 2026 11:25AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జులై 4న రాజస్థాన్గుజరాత్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నారుఉదయం సుమారు 10:45 గంటలకు జోధ్‌పూర్ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటుసవరించిన ఉడాన్ పథకాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారుఆ తరువాత మధ్యాహ్నం దాదాపు 12:15 గంటలకుఆయన బలోతరాకు వెళ్తారుఅక్కడ దాదాపు రూ.1.06 లక్షల కోట్ల ఖర్చుతో నిర్మాణం పూర్తి అయిన అభివృద్ధి ప్రాజెక్టులను దేశ ప్రజలకు అంకితం చేయడంప్రారంభించడంతో పాటు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారుఈ సందర్భంగా ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
దీని తరువాతప్రధానమంత్రి గుజరాత్ వెళ్తారుసాయంత్రం దాదాపు 4:30 గంటలకుఅహ్మదాబాద్.. సాణంద్‌లో సీజీ సెమీ అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీటెస్ట్ (ఓఎస్ఏటీకేంద్రాన్ని ప్రధాని ప్రారంభిస్తారుఈ సందర్భంగా ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
జోధ్‌పూర్‌లో ప్రధానమంత్రి
ప్రాంతీయ అనుసంధానంపై ప్రధానంగా దృష్టిని సారిస్తూ విమానయాన రంగానికి పెద్ద దన్నుగా తీర్చిదిద్దిన ‘ఉడాన్’ (UDAN) పథకాన్ని జోధ్‌పూర్‌లో ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఇది భారత పౌర విమానయాన రంగంలో ఓ కీలక మలుపు అని చెప్పవచ్చుఅంతేకాదుఇది ‘‘ఉడే దేశ్ కీ ఆమ్ నాగరిక్’’ (దేశంలో సామాన్య పౌరులు కూడా విమాన ప్రయాణాలు చేయాలిఅనే దృష్టికోణాన్ని మరింత ముందుకు తీసుకుపోనుందిరాబోయే 10 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని రూ.28,840 కోట్లను ఈ పథకానికి కేటాయించారువిమానయాన ఆధారిత అభివృద్ధిలో తదుపరి దశను వేగిరపరచడమే ఈ పథకం లక్ష్యంఈ పథకాన్ని సమగ్రసుస్థిర అనుసంధానాన్ని నిర్ధారించడానికి రూపొందించారు.
దేశమంతటా విమానయాన మౌలిక సదుపాయాలను విస్తరించడానికిప్రస్తుతం ఉపయోగించకుండా ఉన్న ఎయిర్ స్ట్రిప్‌లను 100 ఏరోడ్రోమ్‌లుగా మార్చడంపై దృష్టి సారిస్తారుదీనికి రూ.12,000 కోట్ల కన్నా ఎక్కువ బడ్జెటును కేటాయించారుదీనికి అదనంగాప్రాంతీయ విమానాశ్రయ కార్యకలాపాలను మొదలుపెట్టిన కొన్ని సంవత్సరాల్లోనే వాటి లాభదాయకతను నిర్ధారించడానికి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ( అండ్ ఎమ్)కు రూ.2,500 కోట్ల కన్నా ఎక్కువ మొత్తాన్ని కేటాయించారుఈ పథకంలో భాగంగా దూరకఠిన ప్రాంతాలకు చేరుకోవడానికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడానికి 200 ఆధునిక హెలీప్యాడ్లను అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది.
విమానయాన సంస్థలకు రూ.10,000 కోట్ల కన్నా ఎక్కువ విలువైన వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్సహాయాన్ని ఈ పథకంలో భాగంగా అందిస్తున్నారుదీంతో ప్రాంతీయ కార్యకలాపాలు నిరంతరాయంగా సాగేందుకు అవకాశం ఉంటుందిక్రమ క్రమంగా వాణిజ్య లాభదాయకత పుంజుకొనేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ దృష్టికోణానికి మరింత బలాన్ని అందిస్తూహెచ్ఏఎల్ ధ్రువ్డార్నియర్ ప్లాట్‌ఫారాల వంటి స్వదేశీ విమానాలూహెలీకాప్టర్ల సేకరణను కూడా ఈ కార్యక్రమంలో చేర్చారుసేవలు తక్కువగా అందుబాటులో ఉన్న  ప్రాంతాలకు అనుసంధానంనిర్వహణ కార్యకలాపాలను పెంచడం దీని ముఖ్యోద్దేశం.
ఈ కార్యక్రమంలో భాగంగాజోధ్‌పూర్‌ విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఈ ప్రాజెక్టును మొత్తం రూ.480 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేశారు. 23,000 కన్నా ఎక్కువ చ.కి.మీవిస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నూతన టెర్మినల్ భవనం ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలను అందిస్తుందిప్రయాణికులు నిరంతరాయంగాహాయిగా ప్రయాణించడానికి అనువైన అనేక సౌకర్యాలను ఈ భవనంలో ఏర్పాటు చేశారు.
రాజస్థానుకు చెందిన రాచఠీవి ఉట్టిపడే వాస్తుకళ నుంచి స్పూర్తిని పొందుతూఅదే సమయంలో సమకాలిక డిజైన్లను కూడా మేళవించి ఈ టెర్మినల్‌ కమాన్లనూకిటికీలనూ తీర్చిదిద్దారుఇంధనాన్ని ఆదా చేసే వ్యవస్థలనూనీటి సంరక్షణ చర్యలనూహరిత భవన నిర్మాణ పద్ధతులనూ అనుసరించి సుస్థిరాభివృద్ధిని వెన్నుదన్నుగా తీసుకుని, 5 నక్షత్రాల ‘గృహ’ (GRIHA) రేటింగును దక్కించుకొనే లక్ష్యంతో ఈ టెర్మినల్‌ను డిజైన్ చేశారుజోధ్‌పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన తరువాతఈ ప్రాంతంలో పర్యటనవాణిజ్యంఉపాధి అవకాశాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించనుంది.
బాలోతరాలో ప్రధానమంత్రి
సుమారు రూ.1.06 లక్షల కోట్ల ఖర్చుతో బాలోతరాలో చేపట్టే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారునిర్మాణం పూర్తి అయిన కొన్ని ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. వీటిలో పెట్రోరసాయనాలుపట్టణ రవాణారైల్వేలురోడ్లుపునరుత్పాదక ఇంధనంవిద్యుత్తు సరఫరా వంటి అనేక రంగాలకు చెందిన ప్రాజెక్టులున్నాయి.
బాలోతరా.. పచ్‌పద్‌రాలో భారత తొలి గ్రీన్‌ఫీల్డ్ ఏకీకృత రిఫైనరీపెట్రోరసాయనిక కాంప్లెక్సును దేశ ప్రజలకు ప్రధాని అంకితం చేస్తారుఇది దేశంలో ఇంధనంపెట్రోరసాయనాల రంగంలో ఒక కీలక ప్రగతి ప్రస్థానానికి సూచికగా నిలవనుంది.
ప్రభుత్వానికీహిందుస్తాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ సంస్థ (హెచ్‌పీసీఎల్)కీ మధ్య సంయుక్త సంస్థ (జేవీ)గా అభివృద్ధిపరిచిన ఈ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీపెట్రోరసాయనిక కాంప్లెక్సు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎమ్ఎమ్‌టీపీఏ). దీనిని రూ.79,450 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడితో ఏర్పాటు చేశారు.
ఈ అత్యాధునిక కాంప్లెక్సు రిఫైనింగుతో పాటు పెట్రోరసాయనాల ఉత్పాదనను ఏకీకరిస్తుందిదీనిలో ప్రతి సంవత్సరం 2.4 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎమ్ఎమ్‌టీపీఏఉత్పాదనలు లభిస్తాయిరిపైనరీ 17.0 నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్సును కలిగివుందిదీని పెట్రోకెమికల్ ఉత్పాదనలు 26 శాతాన్ని మించనున్నాయిఇవి సామర్థ్యంస్థిరత్వం విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానూ ఉంటాయి.
ఈ ప్రాజెక్టు భారత్ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలోపెట్రోరసాయనిక రంగంలో స్వయంసమృద్ధిని పెంచడంలోపారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడడంలో కీలక పాత్రను పోషిస్తుందని భావిస్తున్నారుఆ ప్రాంతంలో పెట్రోరసాయనికప్లాస్టిక్ పార్కు అభివృద్ధికి ఒక ముఖ్యాధారంగా నిలవనుందిదీని రాకతో సంబంధిత పరిశ్రమలూఅనుబంధ రంగాలకు దన్ను లభిస్తుందిఈ రిఫైనరీ చెప్పుకోదగ్గ ఉద్యోగావకాశాలను కూడా అందిస్తుందిఫలితంగా ఆ ప్రాంతంలో సామాజికఆర్థిక అభివృద్ధికీ ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది.
జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారుఈ ప్రాజెక్టుకు రూ.13,000 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు చేయనున్నారురెండో దశలో భాగంగాప్రహ్లాద్‌పురా నుంచి తోడీ మోడ్ వరకూ 41 కి.మీపొడవైన ఉత్తర-దక్షిణ మెట్రో కారిడారును అభివృద్ధి చేస్తారుఇది 36 స్టేషన్ల గుండా సాగుతూ సీతాపురావిశ్వకర్మ పారిశ్రామిక ప్రాంతానికి (వీకేఐచెందిన పారిశ్రామిక ప్రాంతాలనూనివాస ప్రాంతాలను కలుపుతుందిఈ కారిడార్ సీతాపురా పారిశ్రామిక ప్రాంతంవీకేఐజైపూర్ విమానాశ్రయంటోంక్ రోడ్డుఎస్ఎమ్ఎస్ ఆస్పత్రిఎస్ఎమ్ఎస్ స్టేడియమ్అంబాబాడీవిద్యాధర్‌నగర్ సహా ప్రధాన స్థానాలను ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా జోడిస్తుందిఈ ప్రాజెక్టు జైపూర్ లో ప్రధాన పారిశ్రామికనివాస ప్రాంతాలకు అనుసంధానాన్ని చెప్పుకోదగిన రీతిలో మెరుగుపరుస్తుందిదీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు వేగవంతమైనసురక్షితమరింత సౌకర్యవంత ప్రజా రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుందిఒకటో దశలో 11 స్టేషన్లతో 11.64 కి.మీపొడవైన మెట్రో కారిడార్ ఇప్పటికే సేవలను అందిస్తోంది.
దాదాపు రూ.900 కోట్ల ఖర్చుతో నిర్మాణం పూర్తి చేసిన చురు-సాదుల్‌పూర్ (58 కి.మీ.), చురూ-రతన్‌గఢ్ (46 కి.మీ.) రైలు డబ్లింగ్ ప్రాజెక్టులను కూడా దేశ ప్రజలకు ప్రధానమంత్రి అంకితం చేస్తారుమొత్తం 104 కి.మీపొడవున విస్తరించిన ఈ ప్రాజెక్టులు రాజస్థాన్ ఉత్తర-పశ్చిమ ప్రాంతాల్లో రైలు అనుసంధానాన్ని పటిష్ఠపరుస్తాయివీటితో రైలు మార్గాల సామర్థ్యం పెరుగుతుందిఫలితంగా రైళ్ల రాకపోకలూసరకు రవాణా రైళ్ల రాకపోకలూ సాఫీగానూసురక్షితంగానూసమయబద్ధంగానూ నడిచేందుకు ఆస్కారం ఉంటుందిరైల్ నెట్‌వర్కులో రద్దీ తగ్గుతుందిఈ ప్రాజెక్టులు ఆ ప్రాంతంలో పెట్టుబడిఉద్యోగావకాశాల కల్పనతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి కూడా నూతనోత్తేజాన్ని అందిస్తాయి.
జోధ్‌పూర్ రింగ్ రోడ్డులో 2వ సెక్షను (కార్వార్-డాంగియావాస్)లో నెలకొన్న ఎన్‌హెచ్-125ఏను నాలుగు దోవలు కలిగిందిగా విస్తరించారుదీనిని ప్రధానమంత్రి ప్రారంభించనున్నారుసుమారు రూ.740 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టుతో జోధ్‌పూర్ చుట్టుపక్కల ప్రాంతాలకు అనుసంధానం మెరుగుపడిప్రయాణాలు సాఫీగానూసురక్షితంగానూ మారతాయి.
దీనికి అదనంగాఎస్‌జేవీఎన్ కు చెందిన 1,000 మెగావాట్ల బీకానేర్ సౌర ఇంధన ప్రాజెక్టును దేశ ప్రజలకు ప్రధానమంత్రి అంకితం చేస్తారుదీనిని దాదాపు రూ.5,500 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేశారు.  దేశీయంగా నిర్మించిన 24.22 లక్షల సౌర మాడ్యూళ్లను ఈ ప్రాజెక్టులో ఉపయోగించారుఎన్‌హెచ్‌పీసీకి చెందిన 300 మెగావాట్ల కర్ణిసర్ బీకానేర్ సౌర ఇంధన ప్లాంటును కూడా దేశ ప్రజలకు ప్రధానమంత్రి అంకితం చేస్తారుదేశీయంగా నిర్మించిన దాదాపు 7.75 లక్షల సౌర పీవీ సెల్స్‌నూమాడ్యూళ్లనూ ఈ ప్రాజెక్టులో ఉపయోగించారు.
రాజస్థాన్ రిన్యూవబుల్ ఎనర్జీ జోన్ (ఆర్ఈజడ్నుంచి విద్యుత్తు సరఫరా కోసం రూ.1,900 కోట్ల కన్నా ఎక్కు ఖర్చుతో నిర్మించిన ట్రాన్స్‌మిషన్ లైనును కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారురాజస్థాన్ ఆర్ఈజడ్ కోసం 530 కి.మీపొడవైన విద్యుత్తు సరఫరా వ్యవస్థకు ఆయన శంకుస్థాపన చేయనున్నారుఈ విద్యుత్తు సరఫరా వ్యవస్థలు రాజస్థాన్లో ఉత్పత్తి చేసిన పునరుత్పాదక ఇంధనాన్ని సరఫరా చేయడంలో సౌలభ్యంతో పాటు రాష్ట్రంలో విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా కావడానికి కూడా తోడ్పడతాయి.
రాజస్థాన్ ప్రభుత్వ వివిధ విభాగాల్లో నియామకాలు పూర్తి అయిన దాదాపు 54,000 మంది యువతకు నియామక పత్రాలను ప్రధానమంత్రి అందిస్తారుభర్తీ ప్రక్రియను ముగించుకున్న వారిలో.. విద్యఇంధనంహోంపంచాయతీ రాజ్రవాణాఉన్నత విద్యనైపుణ్యాభివృద్ధిప్రణాళికవ్యవసాయంసమాచార సాంకేతికతతో పాటు పరిపాలన సంస్కరణల విభాగాలకు చెందిన సిబ్బంది ఉన్నారు.
సాణంద్‌లో ప్రధానమంత్రి
గుజరాత్.. సాణంద్‌లో సీజీ సెమీ అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీటెస్ట్ (ఓఎస్ఏటీకేంద్రాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఈ ప్రారంభోత్సవం భారత్ సెమీకండక్టర్ తయారీ రంగంలో ఓ ముఖ్య ప్రగతి ప్రస్థానాన్ని సూచిస్తుందిఈ కేంద్రంలో వాణిజ్య సరళిలో ఉత్పాదన మొదలవనుండడమే దీనికి కారణంఇది అంతర్జాతీయ సెమీకండక్టర్ వేల్యూ చైన్లో భారత్ స్థానాన్ని బలోపేతం చేసే దిశలో ఒక పెద్ద అడుగు కానుందిఈ ప్రాజెక్టు ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎమ్)లో భాగంగా ఆమోదించిన తొలి నాలుగు ప్రాజెక్టుల్లో ఒకటిఅంతేకాక రూ.7,500 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడితో దీనిని అభివృద్ధి చేశారు.
పూర్తి సామర్ధ్యంతో పని చేయడం మొదలైతే ఈ కేంద్రం ఏటా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్స్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగివుంటుందికృత్రిమ మేధ (ఏఐ), ఉన్నత పనితీరు కలిగిన కంప్యూటింగ్‌లలో వేగంగా చోటుచేసుకుంటున్న వృ‌ద్ధి కారణంగా మెమరీస్టోరేజ్ పరిష్కారాల విషయంలో పెరుగుతున్న అంతర్జాతీయ గిరాకీని తీర్చడంలో ఈ కేంద్రం సాయపడుతుందిఆటోమోటివ్పారిశ్రామికటెలికమ్యూనికేషన్స్, 5జీఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీరంగాల వినియోగదారుల అవసరాలను ఈ ప్లాంటు తీరుస్తుందిసీజీ సెమీ కేంద్రం వేఫర్ సార్టింగ్అసెంబ్లీటెస్టింగ్ప్యాకేజీ డిజైన్వైఫల్యాల విశ్లేషణటెస్ట్ ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్ఉత్పాదన విశిష్టత నిర్ధారణలతో పాటు ఆధునిక రవాణా వ్యవస్థ సేవలను కూడా ఇది అందిస్తుంది.
ఈ కేంద్రం పని చేయడం మొదలయితే భారత్ ఒక విశ్వసనీయస్వయంసమృద్ధ సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా వెలుగులోకి రావడాన్ని గురించి ప్రపంచానికి చాటి చెబుతుందిఅంతేకాకుండా ఈ ప్రాజెక్టు దేశంలో ఒక సుదృఢస్వయంసమృద్ధ సాంకేతిక విస్తారిత అనుబంధ వ్యవస్థను నిర్మించాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా కూడా నిలుస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2280735) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Bengali-TR , Assamese , English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Kannada , Malayalam