ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తుది లక్ష్యాన్ని సాధించడానికి క్రమశిక్షణతో పాటు మనో నియంత్రణ ముఖ్యమని చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 01 JUL 2026 12:13PM by PIB Hyderabad

‘‘విజ్ఞ‌ానసారథిర్యస్తు మనఃప్రగ్రహవాన్నరః సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ఏ వ్యక్తి బుద్ధి సచేతనంగా ఉంటూశాస్త్రీయ సారథిగా వ్యవహరిస్తుందోఏ వ్యక్తి మనస్సు క్రమశిక్షణతోఅదుపులో ఉంటుందో..  ఆ వ్యక్తి జీవన సంక్లిష్టతల్ని అధిగమించితుది లక్ష్యాన్ని సాధించగలుగుతారని ఈ సుభాషితం స్పష్టం చేస్తోంది.
డిజిటల్ ఇండియా’ విజయవంతంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం భారత్‌‌కు ప్రపంచంలో ఒక కొత్త గుర్తింపును అందించిందని కూడా శ్రీ మోదీ అన్నారుఇది నూతన ఆవిష్కరణలతో పాటు సాంకేతికతను అనుసరిస్తూ దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకుపోవడానికి దేశ ప్రజలు దృఢసంకల్పాన్ని చెప్పుకొన్నారని కూడా సూచిస్తోందని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘‘
డిజిటల్ ఇండియా’ విజయవంతంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో భారత్‌‌కు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త గుర్తింపు లభించిందిఇది నూతన ఆవిష్కరణలతో పాటు సాంకేతికతను అనుసరిస్తూ దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకుపోవాలన్న మన పౌరుల దృఢసంకల్పాన్ని చాటుతోంది.
విజ్ఞ‌ానసారథిర్యస్తు మనఃప్రగ్రహవాన్నరః
సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2279746) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam