ప్రధాన మంత్రి కార్యాలయం
హుల్ దివస్ సందర్భంగా వీర యోధులకు ప్రధానమంత్రి నివాళులు
प्रविष्टि तिथि:
30 JUN 2026 6:10PM by PIB Hyderabad
నేడు హుల్ దివస్ సందర్భంగా విదేశీ పాలన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన సిదో-కన్హూ, చాంద్-భైరవ్, ఫూలో-ఝానో వంటి వీర యోధులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. గిరిజన ఆత్మగౌరవం, మర్యాదను కాపాడటం కోసం వారు చేసిన పోరాటం, త్యాగాల గాథ దేశ ప్రజల హృదయాల్లో నిరంతరం సరికొత్త శక్తిని నింపుతూనే ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన మన గిరిజన సమాజం అద్భుతమైన ధైర్యసాహసాలకు హుల్ దినోత్సవం ఒక శక్తిమంతమైన ప్రతీక. భారతీయ చరిత్రలోని ఈ గర్వకారణమైన సందర్భంలో.. పరాయి పాలన అన్యాయాన్ని ధీటుగా ఎదుర్కొన్న సిదో-కన్హూ, చాంద్-భైరవ్, ఫూలో-ఝానో వంటి వీర యోధులందరికీ నా గౌరవపూర్వక నివాళులు. గిరిజన గౌరవం, ఆత్మగౌరవ రక్షణ కోసం వారు చేసిన పోరాటం, త్యాగాల గాథ దేశ ప్రజల్లో సరికొత్త శక్తిని నింపుతూనే ఉంటుంది’’.
(रिलीज़ आईडी: 2279560)
आगंतुक पटल : 7