రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సముద్రంలో చిక్కిన ఆరుగురు మత్స్యకారులను రక్షించిన ఐసీజీ

प्रविष्टि तिथि: 30 JUN 2026 2:02PM by PIB Hyderabad

మంగళూరు తీరంలో మునిగిపోతున్న భారత మత్స్యకార పడవ (ఐఎఫ్‌బీమంజుమాతలోని ఆరుగురు మత్స్యకారులను భారత తీర రక్షక దళం కాపాడిందికఠినమైన పరిస్థితుల్లో గాలింపురక్షణ (ఎస్ఏఆర్చర్యలు చేపట్టిందిసూరత్కల్ తీర ప్రాంతానికి 33 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న పడవ నుంచి సాయంత్రం సుమారు గంటల ప్రాంతంలో అత్యవసర సాయాన్ని కోరుతూ ఐసీజీ నౌక సచేత్‌కు వీహెచ్ఎఫ్ ఆర్‌టీ కాల్ వచ్చిందిసముద్రం అల్లకల్లోలంగా ఉండటం వల్ల పడవ లోపలికి నీరు చేరుతోందనీదీనివల్ల పడవలోని ఆరుగురి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని సమాచారం అందిందితక్షణమే స్పందించిన ఐసీజీసహాయం అందించడం కోసం నౌకను మళ్లించిప్రమాదంలో ఉన్నవారిని చేరుకుంది.

 

image.png

 

అల్లకల్లోలమైన సముద్రంబలమైన గాలులువెలుతురు తక్కువగా ఉండటం లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఐసీజీఎస్ సచేత్ సిబ్బంది ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారుమత్స్యకారులను చేరుకోవడానికి ప్రతికూల సముద్ర పరిస్థితులలో ఉపయోగించడానికి ప్రత్యేకంగా రూపొందించిన రిమోట్-ఆపరేటెడ్ లైఫ్‌బాయ్‌లను ఉపయోగించి వారిని రక్షించారుసాయంత్రం ఆరు గంటల సమయానికి పడవలో చిక్కుకున్న ఆరుగురినీ కాపాడారువారితో
సహా ఐఎన్ఎస్ సచేత్ న్యూమంగుళూరు దిశగా తిరుగు ప్రయాణంలో ఉంది.

సముద్రంలో ప్రమాదాలకు గురైన వారిని కాపాడటంలో భారత తీరరక్షక దళానికి ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ ఆపరేషన్ నిదర్శనంగా నిలుస్తుందిసముద్రాల్లో ఏర్పడిన సంక్లిష్టమైన అత్యవసర పరిస్థితులను అధిగమించేలా తీర రక్షక దళ సిబ్బంది ధైర్యంశిక్షణవృత్తి నైపుణ్యంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అనుసంధానాన్ని ఇది తెలియజేస్తుంది.

 

image.png

 

***


(रिलीज़ आईडी: 2279380) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Tamil , Kannada