రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ

प्रविष्टि तिथि: 30 JUN 2026 12:51PM by PIB Hyderabad

నాలుగు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలను అందించిన జనరల్ ఉపేంద్ర ద్వివేదిపీవీఎస్ఎంఏవీఎస్ఎం భారత సైన్యాధిపతి (సీఓఏఎస్బాధ్యతల నుంచి ఇవాళ పదవీ విరమణ పొందారుఅత్యున్నత స్థాయి కార్యాచరణ సన్నద్ధతను కొనసాగించటంత్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయటంసైన్యంలో పరివర్తనాత్మక ప్రక్రియను వేగవంతం చేయటంసాంకేతికతను అందిపుచ్చుకోవటంసాయుధ దళాల పునర్వ్యవస్థీకరణసైనికుల సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వటం వంటివి ఆయన పదవీకాలంలో గుర్తిండిపోయే అంశాలు.

భారత సైన్యాధిపతిగా జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్ని రక్షణ రంగాల్లో సైనిక సంసిద్ధతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారుఆయన నాయకత్వంలో ఆపరేషన్ స్నో లెపర్డ్ ద్వారా ఉత్తర సరిహద్దుల్లో పటిష్టమైనఅప్రమత్తమైన వ్యూహాన్ని భారత సైన్యం కొనసాగించిందిపశ్చిమ సరిహద్దులో పట్టుదలసంయమనంవృత్తిపరమైన నిబద్ధతతో బాధ్యతలను నిర్వర్తించిందిమారుతున్న భద్రతా వ్యవస్థలో భారత సైన్యం సంసిద్ధతనుఖచ్చితత్వాన్ని వ్యూహాత్మక స్పందనను ప్రతిబింబిస్తూ ఆపరేషన్ సిందూర్.. ఆయన పదవీకాలంలో కీలక ప్రస్థానంగా నిలిచింది.

భారత సైన్యంలో ప్రస్తుతం సాగుతున్న దశాబ్దపు మార్పుల దిశగా జనరల్ ఉపేంద్ర ద్వివేది బలమైన దిశా నిర్దేశం చేశారుఆయన నాయకత్వంలో సైనిక బలగాల పునర్వ్యవస్థీకరణఆధునీకరణసాంకేతిక వినియోగంసమన్వయంవ్యవస్థాగత సంస్కరణలుమానవ వనరుల నిర్వహణ వంటి రంగాల్లో భారత సైన్యం సంస్కరణలను చేపట్టిందిఆధునికక్రీయాశీలకభవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా భారత సైన్యాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా.. రుద్ర బ్రిగేడ్స్భైరవ్ బెటాలియన్స్అశ్ని డ్రోన్ ప్లాటూన్స్శక్తిబాణ్ రెజిమెంట్స్దివ్యాస్త్ర బ్యాటరీస్ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ బ్రిగేడ్స్ఇంటిగ్రేటెడ్ బాటిల్ గ్రూప్స్ (ఐబీజీలువంటి కీలక వినూత్న చర్యలను చేపట్టారు.

త్రివిధ దళాలు పరస్పరానుబంధంగా పనిచేయాలని జనరల్ ఉపేంద్ర ద్వివేది భావించారుభవిష్యత్తులో జరిగే సంయుక్తయుద్ధ రంగ ఆధారిత కార్యకలాపాల అవసరాలకు అనుగుణంగా ఆర్మీనేవీవైమానిక దళాల మధ్య సమగ్రతఉమ్మడి కార్యాచరణ ఆలోచనమెరుగైన సమన్వయాన్ని ఆయన ప్రోత్సహించారు.

సైనిక సిబ్బందిమాజీ సైనిక ఉద్యోగులువీర నారీల సంక్షేమానికి ఆయన పదవీకాలంలో అత్యంత ప్రాధాన్యత లభించిందివెటరన్స్ అచీవర్స్ అవార్డు వంటి కార్యక్రమాల ద్వారా వారి సహకారానికి గుర్తింపును అందించటంతో పాటు సైనికులుమాజీ సైనిక ఉద్యోగులతో సైన్యానికున్న బంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో పలు కార్యక్రమాలను నిర్వహించారుసైనికులువారి కుటుంబాల పట్ల సైన్యానికున్న బాధ్యత కేవలం విధుల్లో ఉన్నంత వరకే పరిమితం కాదని.. ఆ తర్వాత కూడా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

 

భారత సైన్యం భవిష్యత్ సన్నద్ధతకు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికను అందించేందుకు వికసిత్ భారత్ విజన్-2047, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ విజన్-2047ల స్ఫూర్తితో రూపొందించిన వ్యూహాత్మక భద్రతా మార్గదర్శకాలు-2047 తయారీకి జనరల్ ఉపేంద్ర ద్వివేది దిశా నిర్దేశం చేశారు.

భారత సైన్యానికి జనరల్ ఉపేంద్ర ద్వివేది అందించిన విశేష సేవలకు గానూ ప్రతిష్ఠాత్మక పరమ విశిష్ట సేవా మెడల్అతి విశిష్ట సేవా మెడల్ పురస్కారాలను అందుకున్నారు.

***


(रिलीज़ आईडी: 2279350) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil