చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నోటరీ నియామకాల కోసం ఆన్‌లైన్‌ నూతన దరఖాస్తు విధానాన్ని ప్రారంభించిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్

प्रविष्टि तिथि: 29 JUN 2026 8:04PM by PIB Hyderabad

నోటరీ నియామకాల కోసంనోటరీ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ నూతన దరఖాస్తు విధానాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఇవాళ ప్రారంభించారునోటరీల చట్టం-1952, నోటరీల నియమాలు-1956 నిబంధనల ప్రకారం పబ్లిక్ నోటరీల నియామకానికి ఈ విధానాన్ని రూపొందించారు.

అర్హులైన వృత్తిలో ఉన్న న్యాయవాదులుఅడ్వొకేట్లు నోటరీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించటానికి ఈ నూతన విధానం ఉపయోగపడుతుందినేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీసహకారంతో న్యాయ వ్యవహారాల శాఖ అభివృద్ధి చేసిన ఈ విధానం.. దరఖాస్తు ప్రక్రియను మరింత పారదర్శకంగాసమర్థవంతంగాపౌరులకు సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది.

నోటరీ పోర్టల్‌లోని ముఖ్యమైన అంశాలను వివరిస్తూ.. న్యాయ వ్యవహారాలుశాసన విభాగం కార్యదర్శి డాక్టర్ రాజీవ్ మణి కీలక వ్యాఖ్యలు చేశారునోటరీల నియామకానికి సంబంధించి ఇప్పటికే పలు ఆన్‌లైన్ సేవలను అందిస్తున్న ప్రస్తుత పోర్టల్‌తో నూతన దరఖాస్తు విధానాన్ని విజయవంతంగా అనుసంధానించినట్లు చెప్పారుఈ దరఖాస్తుల ప్రక్రియకు సజావుగావేగంగా సాగేందుకు వీలుగా ఈ మాడ్యూల్‌లో ఆటోమేటెడ్ పని విధానాలనువినియోగదారులకు సులభంగా అర్థమయ్యే ఇంటర్ ఫేస్‌ను పొందుపరచినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా గౌరవ మంత్రి మాట్లాడుతూ.. కాగిత రహితపారదర్శకమైనపౌర కేంద్రీకృత పాలన వ్యవస్థను ప్రోత్సహించేలా గౌరవ ప్రధానమంత్రి కలలుగన్న డిజిటల్ ఇండియా విజన్ సాకారం దిశగా ఈ మాడ్యూల్ ప్రారంభం కీలక ముందడుగని అన్నారువినియోగదారులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించిన ఈ విధానం.. దరఖాస్తు ప్రక్రియను సరళంగా మారుస్తుందనినోటరీలుగా మారాలనుకునే వారికి సులభంగా సేవలను అందిస్తుందని చెప్పారు.

నోటరీల చట్టం-1952, నోటరీల నిబంధనలు-1956 ప్రకారం.. న్యాయ వ్యవహారాల శాఖ ఎప్పటికప్పుడు ఈ విధానం ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుందిదరఖాస్తులు సమర్పించేందుకు సంబంధించిన సూచనలుమార్గదర్శకాలు నోటరీ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి.

నోటరీల నియామకానికి దరఖాస్తుల పరిశీలనకు క్రమబద్ధమైనపారదర్శకమైనసమర్థవంతమైన విధానాన్ని అందించటం ద్వారా డిజిటల్ పాలనను బలోపేతం చేయటంలో నూతన దరఖాస్తు విధానాన్ని ప్రారంభించటం కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2279278) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati