నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘గ్లోబల్ స్కిల్స్ ఛాలెంజ్ ఆస్ట్రేలియా-2026’ పోటీల్లో 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం కైవసం చేసుకున్న భారత జట్టు


వరల్డ్ స్కిల్స్ షాంఘై సన్నాహాలకు ఊపు

प्रविष्टि तिथि: 29 JUN 2026 6:43PM by PIB Hyderabad

‘గ్లోబల్ స్కిల్స్ ఛాలెంజ్ (జీఎస్‌సీఆస్ట్రేలియా-2026’లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టు... 3 స్వర్ణాలు1 రజతం1 కాంస్యం సహా మొత్తం 5 పతకాలను గెలుచుకుంది. ఈ ఏడాది చివర్లో షాంఘైలో జరగనున్న 48వ వరల్డ్‌స్కిల్స్ పోటీల కోసం భారత సన్నాహక ప్రయాణంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. జూన్ 23 నుంచి 29 వరకు జరిగిన ఈ అంతర్జాతీయ పోటీలో... భారత్, ఆస్ట్రేలియాఆస్ట్రియాచైనాఅమెరికాజపాన్ఫ్రాన్స్కొరియా సహా 16 వరల్డ్‌స్కిల్స్ సభ్య దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 600 మంది పోటీదారులునిపుణులుఅనువాదకులు, అధికారులు పాల్గొన్నారు.

భారత జట్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసినవారు:

• పవన్ భద్రావతి సురేష (కర్ణాటక): యాడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో స్వర్ణ పతకం

o (జపాన్‌ - రజతం)

• మౌసమ్ కుమార్ గిరి (బీహార్): క్లౌడ్ కంప్యూటింగ్‌లో స్వర్ణ పతకం

o (జపాన్‌-రజతం, సింగపూర్‌-కాంస్యం)

• విష్ణుప్రియ సునీల్ (ఢిల్లీ): ఆరోగ్యం, సామాజిక సంరక్షణలో స్వర్ణ పతకం

o (ఆస్ట్రేలియా-రజతం)

• హర్ష్ రమేష్ పవార్ (మహారాష్ట్ర): 3డి డిజిటల్ గేమ్ ఆర్ట్‌లో రజత పతకం

• ముస్కాన్ (హర్యానా): పెయింటింగ్, డెకరేటింగ్‌లో కాంస్య పతకం

అధునాతన తయారీడిజిటల్ సాంకేతికతలుసృజనాత్మక రంగాలు, సేవా రంగ నైపుణ్యాల్లో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన యువతతో పెరుగుతున్న భారత ప్రపంచస్థాయి సామర్థ్యాలను ఈ విజయాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇతర పోటీదారులూ పలు విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును పొందారు. ప్రపంచంలోని అత్యుత్తమ నైపుణ్యం గల యువ నిపుణులకు గట్టిపోటీనిచ్చారు.

భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి భారత జట్టు ప్రదర్శనను అభినందించారు. "గ్లోబల్ స్కిల్స్ ఛాలెంజ్-2026లో భారత జట్టు 3 స్వర్ణాలు1 రజతం, 1 కాంస్య పతకాలను సాధించడం దేశానికి గర్వకారణం. ఇది మన స్కిల్ ఛాంపియన్లునిపుణులుమార్గదర్శకులు, పారిశ్రామిక భాగస్వాముల ప్రతిభపట్టుదల, కృషికి నిదర్శనం. ఈ అద్భుత విజయాలతో పాటుప్రపంచస్థాయి ప్రమాణాలపై ఈ పోటీ అమూల్యమైన అవగాహనను కల్పించింది. షాంఘైలో జరగబోయే వరల్డ్ స్కిల్స్ పోటీకి మన సన్నాహాలను మరింత బలోపేతం చేసింది. భారత శ్రేష్ఠతను ప్రదర్శించినైపుణ్యం గల యువతరానికి స్ఫూర్తినిచ్చిన టీమ్ ఇండియాలోని ప్రతి సభ్యుడినీ నేను అభినందిస్తున్నాను" అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

15 మంది పోటీదారులు, 15 మంది నిపుణులతో కూడిన 30 మంది సభ్యుల భారత బృందం... అధునాతన తయారీడిజిటల్ సాంకేతికతలునిర్మాణ వ్యాపారాలుసృజనాత్మక రంగాలు, సేవా రంగ నైపుణ్యాలను విస్తరించి 15 నైపుణ్య విభాగాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించింది. వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ కోసం పూర్తి స్థాయి అనుకరణగా రూపొందించిన గ్లోబల్ స్కిల్స్ ఛాలెంజ్ అంతర్జాతీయ పోటీ ప్రమాణాలుమూల్యాంకన వ్యవస్థలు, వాస్తవ-ప్రపంచ పరిస్థితుల్లో ప్రపంచంలోని అత్యుత్తమ యువ నైపుణ్యం కలిగిన నిపుణులతో పోటీపడే అవకాశాన్ని టీమ్ ఇండియాకు అందించింది. ఈ అనుభవం విలువైన ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని గురించి భారత బృందానికి చక్కని అవగాహన కల్పించడం సహాసాంకేతిక సంసిద్ధతను బలోపేతం చేసింది. ఈ ఏడాది చివర్లో షాంఘైలో జరిగే 48వ ప్రపంచ నైపుణ్యాల పోటీకి భారత్ సంసిద్ధతను మరింత పదును పెట్టింది.

పోటీ అంతటావరల్డ్‌స్కిల్స్ పోటీల్లో ఉపయోగించే మూల్యాంకన విధానాన్ని అనుకరిస్తూ... అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కాంపిటీషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను ఉపయోగించి పోటీదారుల సామర్థ్యాలను అంచనా వేశారు. ఈ కార్యక్రమం భారతీయ పోటీదారులకు పోటీల ఒత్తిడిని నిర్వహించడంఅంతర్జాతీయ సాధనాలకు అనుగుణంగా మారడంప్రపంచస్థాయి నాణ్యత, పనితీరు ప్రమాణాలను అందుకోవడం వంటి విషయాలను గురించి ప్రత్యక్ష అనుభవాన్ని అందించింది.

3డి డిజిటల్ గేమ్ ఆర్ట్అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ఆటోమొబైల్ టెక్నాలజీబ్యూటీ థెరపీబ్రిక్‌లేయింగ్క్లౌడ్ కంప్యూటింగ్ఫ్లోరిస్ట్రీగ్రాఫిక్ డిజైన్ టెక్నాలజీహెయిర్‌డ్రెస్సింగ్ఆరోగ్యం-సామాజిక సంరక్షణఇండస్ట్రియల్ మెకానిక్స్పెయింటింగ్-డెకొరేటింగ్రెస్టారెంట్ సర్వీస్వాల్-ఫ్లోర్ టైలింగ్వెబ్ టెక్నాలజీస్ వంటి నైపుణ్య విభాగాల్లో భారత్ పోటీపడింది.

గ్లోబల్ స్కిల్స్ ఛాలెంజ్-2026 ఆస్ట్రేలియా వంటి నైపుణ్య పోటీల్లో సాధించిన విజయాలు... యువ భారత్ నైపుణ్యాలను ఆకాంక్షనీయంగా మార్చడంలో శక్తిమంతమైన పాత్ర పోషిస్తాయి. వాణిజ్యంసాంకేతికతరూపకల్పన, సేవా రంగ నైపుణ్యాల్లో రాణించడం జాతీయ గుర్తింపుప్రపంచవ్యాప్త అనుభవం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఉద్యోగాలకు మార్గాలను సుగమం చేస్తుందని ఇది స్పష్టం చేస్తుంది.

గ్లోబల్ స్కిల్స్ ఛాలెంజ్‌లో భారత్ పాల్గొనడం ద్వారా భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడం... భారత యువతను ప్రపంచంలోని అత్యుత్తమ నైపుణ్యం గల నిపుణుల సరసన నిలపడం అనే స్కిల్ ఇండియా మిషన్ విస్తృత దార్శనికతలో ఒక భాగం. శిక్షణా మౌలిక సదుపాయాల్లో నిరంతర పెట్టుబడులునిపుణుల మార్గదర్శనంపరిశ్రమ భాగస్వామ్యాలు, అంతర్జాతీయ అనుభవం ద్వారా... ప్రపంచ వేదికపై భారత్ తన సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటూనే ఉంది.

 

***


(रिलीज़ आईडी: 2279200) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Kannada