రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

డీఆర్‌డీఓకు ఆర్థిక అధికారాలు-2026


వ్యూహాత్మక ఆర్‌ అండ్ డీ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని, జవాబుదారీతనాన్ని పెంచేందుకు, సకాలంలో ప్రాజెక్టులను పూర‌్తి చేసేందుకు సరికొత్త సంస్కరణలను ప్రవేశపెట్టిన రక్షణ మంత్రి

సవరించిన విధానం కీలక వ్యవస్థలను వేగంగా అందుబాటులోకి తీసుకువస్తుందని.. పరిశ్రమలు, విద్యాసంస్థలతో బలమైన సహకారాన్ని పెంపొందిస్తుందన్న రక్షణ మంత్రి

డీఎఫ్‌పీ-2026 ద్వారా ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి మరింత ఊతం.. రక్షణ సన్నద్ధత బలోపేతం: ఆర్‌ఎం

నాడు పోస్టు చేయడమైనది: 29 JUN 2026 3:28PM by PIB Hyderabad

వ్యూహాత్మక ఆర్‌ అండ్ డీ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని, జవాబుదారీతనాన్ని పెంచేందుకు, సకాలంలో ప్రాజెక్టులను పూర‌్తి చేసేందుకు కీలక సంస్కరణ మార్గదర్శకాలు- డీఆర్‌డీఓకు ఆర్థిక అధికారాలు (డీఎఫ్‌పీ-2026)- జూన్ 29, 2026న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విడుదల చేశారు. ఆర్‌ అండ్ డీ వ్యవస్థలో పుట్టుకొస్తున్న నూతన వ్యవస్థలు, వేదికలు, సాంకేతికతలను వేగంగా అభివృద్ధి చేసి, ప్రవేశపెట్టడాన్ని డీఎఫ్‌పీ-2026 సులభతరం చేస్తుందని రక్షణ మంత్రి తెలిపారు. సవరించిన విధానం పరిశ్రమలు, విద్యాసంస్థలతో బలమైన సహకారాన్ని పెంపొందిస్తుందని, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. ఈ నూతన వ్యవస్థ రక్షణ సాంకేతికతల్లో స్వావలంబనను పెంపొందించేందుకు, దేశ రక్షణ సన్నద్ధతను మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని వివరించారు.

రక్షణ ఆర్ అండ్ డీ విభాగంలో వివిధ స్థాయిల్లో కార్యాచరణ సాధికారతను పెంపొందించటమే డీఎఫ్‌పీ-2026 లక్ష్యం. సవరించిన వ్యవస్థ పలు కీలక అవసరాలను తీరుస్తుంది. ఇందులో ప్రయోగాత్మక ప్రచార కార్యక్రమాలు, పరీక్షలు, మూల్యాంకన కార్యకలాపాల కోసం ప్రత్యేక ఆర్థిక కేటాయింపులు, ప్రాజెక్టుకు ముందస్తుగా పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసే అధికారాన్ని కల్పించటం, ఎక్స్‌ట్రా మ్యూరల్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టులు, డిఫెన్స్ ఇన్నోవేషన్‌ యాక్సిలరేటర్‌- సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ప్రాజెక్టులకు సంబంధించి సహాయక నిధుల ఆర్థిక అధికారాల స్పష్టమైన విభజన వంటివి ఉన్నాయి.

న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి, రక్షణ శాఖ కార్యదర్శి, రక్షణ శాఖ ఆర్ అండ్ డీ విభాగం కార్యదర్శి, డీఆర్‌డీఓ ఛైర్మన్ శ్రీ రాజేశ్ కుమార్ సింగ్, కార్యదర్శి (రక్షణ ఉత్పత్తి) శ్రీ సంజీవ్ కుమార్, కార్యదర్శి (మాజీ సైనికుల సంక్షేమం) శ్రీమతి సుకృతి లిఖి, కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ శ్రీ అనుగ్రహ నారాయణ దాస్, డీఆర్‌డీఓ డీజీ (నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్) శ్రీ ఆర్వి హర ప్రసాద్, డీజీ (రిసోర్సెస్ అండ్ మేనేజ్‌మెంట్) డాక్టర్ రవీంద్ర సింగ్, డైరెక్టర్, ఫైనాన్స్ అండ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ డాక్టర్ మైయా దిన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2279003) సందర్శకుల సూచీ సంఖ్య : : 187
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Malayalam , Urdu , हिन्दी , Tamil