ప్రధాన మంత్రి కార్యాలయం
సీషెల్స్ పర్యటన (జూన్ 27 నుంచి 29, 2026 వరకు) నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన
प्रविष्टि तिथि:
27 JUN 2026 8:30AM by PIB Hyderabad
నా మిత్రుడు, సీషెల్స్ దేశ అధ్యక్షుడు గౌరవ డాక్టర్ పాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు 2026 జూన్ 27 నుంచి 29 వరకు నేను ఆ దేశంలో పర్యటిస్తాను. అక్కడ జరగనున్న జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొంటాను.
మహాసాగర్ విజన్‌లో, గ్లోబల్ సౌత్ పట్ల మా ఉమ్మడి నిబద్ధతలో కీలక సముద్ర తీర పొరుగుదేశం, కీలక భాగస్వామి సీషెల్స్. పరస్పర నమ్మకం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం పట్ల గౌరవం, ఇరుదేశాల ప్రజల మధ్య ఉన్న అనుబంధంతో మన దౌత్య సంబంధాల 50వ వార్షికోత్సవాన్ని ఈ ఏడాది మనం జరుపుకుంటున్నాం.
ఫిబ్రవరి 2026లో అధ్యక్షుడు హెర్మినీ భారత్ పర్యటన ఆధారంగా మన మధ్యనున్న శాశ్వతమైన స్నేహాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరపాలని ఆసక్తితో ఉన్నాను. ఇరుదేశాల ప్రజల పురోగతికి, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత, సంక్షేమాన్ని పెంపొందించేందుకు మనం కలిసి పనిచేద్దాం.
ఈ పర్యటనలో సీషెల్స్ జాతీయ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానమంత్రిగా గౌరవాన్ని పొందుతాను. ఈ చరిత్రాత్మక అవకాశం రెండు దేశాలను అనుసంధానించే బలమైన ప్రజాస్వామ్య విలువలను, పార్లమెంటరీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.
భారత్, సీషెల్స్ మధ్య తరాలుగా ప్రత్యేక స్నేహాన్ని పెంపొందిస్తూ, ఇరుదేశాల మధ్య సజీవ వారధిగా నిలుస్తున్న అక్కడి భారత ప్రజలతో ముచ్చటించేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఉన్నాను.
ఈ పర్యటన సుదీర్ఘకాలంగా రెండు దేశాల మధ్యనున్న బంధాలను మరింత బలోపేతం చేస్తుందని, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందిస్తుందని.. సురక్షితమైన, శాంతియుతమైన, సుసంపన్నమైన హిందూ మహాసముద్ర ప్రాంతం కోసం మనకున్న ఉమ్మడి దార్శనికతను ముందుకు తీసుకెళ్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను.
***
(रिलीज़ आईडी: 2278525)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam