సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా వృద్ధులకు సేవలందించేందుకు సంరక్షకుల వ్యవస్థను మరింతగా విస్తరించిన శతాయు డాష్‌బోర్డు
శతాయు యాప్‌లో సాంకేతిక లోపాల సవరణ... తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పౌరులకు విజ్ఞప్తి
వృద్ధుల అవసరాలకు తగినట్లుగా అందరికీ మేలు చేసేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటునకు కట్టుబడి ఉన్నామన్న కేంద్ర మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
25 JUN 2026 3:32PM by PIB Hyderabad
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 22.05.2022న శతాయు డాష్‌బోర్డును ప్రారంభించింది. శిక్షణ పొందిన వృద్ధుల సంరక్షకులంతా ఈ డాష్‌బోర్డులో పేర్లను నమోదు చేసుకుని, అవసరమున్న వృద్ధులకు సేవలందించేందుకు వేదికను కల్పిస్తుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, శతాయు డాష్‌బోర్డును నిర్వహిస్తుంది. ఈ సంస్థే వృద్ధుల సంరక్షకులకు శిక్షణనిస్తుంది.
ఈ సమాచార నిధిని మరింత బలోపేతం చేసేందుకు 2023-24, అంతకన్నా ముందు శిక్షణ పొందిన సంరక్షకులకు కూడా శతాయు డ్యాష్‌బోర్డులో స్వయంగా పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంది. వీలైనంత ఎక్కువ మంది వృద్ధుల సంరక్షకుల వివరాలు ఈ డ్యాష్‌బోర్డులో ఉండటం వల్ల ఎక్కువ మంది వృద్ధులు వీరి సేవలను పొందే అవకాశం ఉంటుంది. నమోదవుతున్న వివరాలను సాంకేతిక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. డేటాను ఒకచోట చేర్చి... అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నాయి.
వృద్ధుల సంరక్షకుల శిక్షణలో అభ్యర్థుల నమోదు సంఖ్య... ఆయా శిక్షణా కేంద్రాల భౌగోళిక ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. ఈ శిక్షణా కేంద్రాల సమీప ప్రాంతాల నుంచే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీని వల్ల అధిక సంఖ్యలో శిక్షణ పొందే అభ్యర్థులు ఏదైనా నిర్దిష్ట జిల్లా, నగరం, పట్టణానికి చెందినవారై ఉంటారు.
స్వయంగా నమోదు చేసుకునే విధానం ద్వారా లబ్ధిదారులను స్వయం సమృద్ధులుగా మార్చాలనే శతాయు ఉద్దేశం అభినందనీయం. ఇందులో మొదట్లో తలెత్తిన సాంకేతిక లోపాలను సమర్థవంతమైన సాంకేతిక బృందం పరిష్కరిస్తోంది. ఈ డ్యాష్‌బోర్డు గురించి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారమవుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మకూడదని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. భారతదేశవ్యాప్తంగా ఉన్న వృద్ధుల సంక్షేమానికి తోడ్పడేలా... సమ్మిళిత, అవసరాలకు తగిన వ్యవస్థ ఏర్పాటునకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
***
(रिलीज़ आईडी: 2277965)
आगंतुक पटल : 17