నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

‘యూత్ కో: ల్యాబ్ నేషనల్ ఇన్నొవేషన్ చాలెంజ్ - 2026’లో యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరు అంకుర సంస్థల విజయం


వ్యర్థాల పునర్వినియోగం, పర్యావరణ హిత పద్ధతిలో తయారు చేసిన వస్త్రాలు, ఆహార వ్యవస్థల్లో ముందున్న ఆవిష్కర్తలకు హైదరాబాద్‌లోని టి-హబ్‌లో సత్కారం..

28 రాష్ట్రాల నుంచి వచ్చిన 350కి పైగా దరఖాస్తుదారుల నుంచి ఎంపిక

प्रविष्टि तिथि: 24 JUN 2026 11:21AM by PIB Hyderabad

వ్యర్థాల పునర్వినియోగ ఆవిష్కరణలుపర్యావరణహిత పద్ధతిలో రూపొందించిన వస్త్రాలు ఫ్యాషన్ రంగంసుస్థిర ఆహార వ్యవస్థలుజల సంరక్షణ ద్వారా.. పర్యావరణ హిత పద్ధతులను ముందుకు తీసుకెళ్లే వినూత్న ఆవిష్కరణల అభివృద్ధికి గాను యువత నేతృత్వంలో నడుస్తున్న దేశంలోని ఆరు అంకుర సంస్థలు ‘యూత్ కోల్యాబ్ నేషనల్ ఇన్నొవేషన్ ఛాలెంజ్-2026’ ఎనిమిదో ఎడిషన్ విజేతలుగా నిలిచాయి.

 

అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఏఐఎంభాగస్వామ్యంతో.. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ)- భారత్సిటీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో టి-హబ్ ఫౌండేషన్ ఈ ‘యూత్ కోల్యాబ్ నేషనల్ ఇన్నొవేషన్ ఛాలెంజ్’ను నిర్వహించిందిసుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనను వేగవంతం చేసే దిశగా.. యువత నేతృత్వంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో దేశంలో ప్రముఖమైన వేదికగా నిలిచింది.

 

ఈ ఏడాది దేశంలోని 28 రాష్ట్రాలకు చెందిన యువత నేతృత్వంలో నడుస్తున్న అంకుర సంస్థల నుంచి 350కి పైగా దరఖాస్తులు వచ్చాయికఠినమైన ఎంపిక ప్రక్రియ అనంతరం.. అత్యంత ప్రతిభావంతమైన 50 అంకుర సంస్థలను ‘నేషనల్ స్ప్రింగ్‌బోర్డ్ ప్రోగ్రామ్’కు ఎంపిక చేశారుసంబంధిత పరిశ్రమకు చెందిన 16 మంది మార్గనిర్దేశకులుఆయా రంగాల్లో నిపుణుల పర్యవేక్షణలో వీరికి మూడు నెలల పాటు వర్చువల్ విధానంలో సామర్థ్యాభివృద్ధి శిక్షణను అందించారు.

 

పోటీలో పాల్గొన్న అంకుర సంస్థలు రంగాల వారీగా మూడు ప్రత్యేక విభాగాల్లో సేవలందించాయి:

 

  • పర్యావరణ హిత పద్ధతిలో వస్త్రాల రూపకల్పన ఫ్యాషన్

  • ·పునర్వినియోగ ఆవిష్కరణలు

  • సుస్థిర ఆహార వ్యవస్థలు, జల సంరక్షణ

 

2026 జూన్ 4న నిర్వహించిన జాతీయ ఆవిష్కరణ చర్చల్లో.. న్యాయ నిర్ణేతల బృందం ఎదుట ఈ 50 అంకుర సంస్థలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించాయివాటి నిశితంగా మదింపు చేశారుఅందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 అగ్రశ్రేణి అంకుర సంస్థలు.. 2026 జూన్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లోని టి-హబ్‌లో నిర్వహించిన ప్రాంతీయ ప్రత్యక్షానుభవ బూట్ క్యాంపునకు అర్హత సాధించాయి.

 

అయిదు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. వ్యాపార నమూనాలను బలోపేతం చేయడంతోపాటువాటి ప్రభావ పరిధిని విస్తరించడం లక్ష్యంగా నిపుణుల ప్రసంగాలుమార్గనిర్దేశక సదస్సులుక్షేత్రస్థాయి సందర్శనలుపరస్పర అవగాహన కార్యక్రమాల ద్వారా.. అంకుర సంస్థల నిర్వాహకులుసుస్థిరాభివృద్ధి నిపుణులుపెట్టుబడిదారులుప్రభుత్వ భాగస్వామ్య పక్షాలుఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఒక్కచోట చేరారు.

 

2026 జూన్ 18న న్యాయనిర్ణేతల తుది పరిశీలన అనంతరం.. విస్తరణకు అనువైనఅత్యధిక ప్రభావాన్ని చూపే పద్ధతులను రూపొందించిన ఆరు అంకుర సంస్థలు ఎంపికయ్యాయి.

విజేతలుగా నిలిచిన మూడు అంకుర సంస్థలకు రూ.3,50,000 చొప్పున ప్రారంభ మూలధన ఆర్థిక సాయంతోపాటు.. సామర్థ్యాన్ని పెంపొందించుకునే అవకాశాలనూవ్యవస్థాగత అనుసంధానాన్నీ కల్పించారుఅలాగేరన్నర్లుగా నిలిచిన మరో మూడు సంస్థలకు.. వారి ఆశాజనకమైన కృషికీసామర్థ్యానికీ గుర్తింపుగా రూ.2,20,000 చొప్పున అందించారు.

 

యూఎన్‌డీపీ, అటల్ ఆవిష్కరణల మిషన్టి-హబ్ప్రభుత్వ సంస్థలుపెట్టుబడిదారులుఆవిష్కరణ వ్యవస్థా ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డులను అందించారు.

భారత్‌లో పర్యావరణ హిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంయువతపెట్టుబడిరానున్న ఆవిష్కరణల దశాబ్దం’ అన్న అంశంపై తెలంగాణ ఆవిష్కరణల విభాగం (టీజీఐసీసీఈవో మెరాజ్ ఫహీం ప్రత్యేకంగా ప్రసంగించారు. ‘‘మనం ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సవాళ్ల పరిష్కారం దిశగా.. ఆవిష్కరణసహకారంయువ నాయకత్వ శక్తిని యూత్ కో:ల్యాబ్ వంటి కార్యక్రమాలు బలోపేతం చేస్తాయిఈ ప్రయాణంలో భాగమైనందుకు మేం గర్విస్తున్నాంఆలోచనలను అర్థవంతమైన ఫలితాలుగా మలచుకునేలా యువ ఆవిష్కర్తలకు తోడ్పడే వ్యవస్థలను పెంపొందించడానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని మెరాజ్ ఫహీం పేర్కొన్నారు.

 

భారత్‌కు స్టార్టప్‌ల సమస్య లేదు. ఉన్నది విస్తరణ సమస్యేముఖ్యంగా పెట్టుబడుల విస్తరణ బెంగళూరుఢిల్లీలకే చాలావరకూ పరిమితమైందిఅలాగే మార్గనిర్దేశకత్వం కూడా తృతీయ శ్రేణి నగరాలుఈశాన్య రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉందిఇక మహిళలుదివ్యాంగులుసామాజికంగా వెనుకబడిన వర్గాల నుంచి వస్తున్న వ్యవస్థాపకులకు అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయిఈ సమస్యలను పరిష్కరించడం కోసమే యూత్ కో:ల్యాబ్ వంటి కార్యక్రమాలున్నాయిఈ రోజు మనం చూస్తున్న ఫలితాలు ఆ మార్పు మొదలైందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి’’ అని నీతి ఆయోగ్ అటల్ ఆవిష్కరణల మిషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రతీక్ దేశ్‌ముఖ్ వివరించారు.

‘‘భారతదేశపు గొప్ప వనరుల్లో దాని యువశక్తి ఒకటిదేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వయసువారే ఉన్నారుఆలోచనలను ఆచరణలోకి తెచ్చేలా యువ ఆవిష్కర్తలకు మనం ఎంత సమర్థంగా మద్దతిస్తామన్నదే.. దేశ అభివృద్ధివాతావరణ లక్ష్యాల సాధనలో మన సమర్థతకు ప్రాతిపదికవ్యర్థాలునీటి కొరతపర్యావరణ అననుకూల ఉత్పత్తి విధానాల వంటి మన కాలపు అత్యంత తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలతో 350కి పైగా అంకుర సంస్థలు ముందుకొచ్చాయిఎంపిక చేసిన సంస్థల్లో 40 శాతానికి పైగా మహిళల నేతృత్వంలో నడుస్తున్నవేఆవిష్కరణ వ్యవస్థలో వైవిధ్యాన్ని ఇది చాటుతోందిఈ వైవిధ్యమే దేశంలో ఆవిష్కరణలకు ఊతమిస్తోందిమెరుగైన భవితను క్రియాశీలంగా నిర్మిస్తున్న ఇలాంటి తరం కోసం.. మా భాగస్వాముల సహకారంతో పెట్టుబడి పెట్టడం మాకు గర్వకారణం’’ అని యూఎన్డీపీ భారత్ రెసిడెంట్ ప్రతినిధి డాక్టర్ ఏంజెలా లుసిగి వ్యాఖ్యానించారు.

ఈ ముగింపు వేడుకల్లో భాగంగా.. ‘మౌలిక వసతిగా సమ్మిళితత్వంఅందరికీ ఉపయోగపడేలా ఆవిష్కరణ వ్యవస్థల నిర్మాణం’ అంశంపై నిపుణుల బృందంతో చర్చను కూడా నిర్వహించారుటీ-హబ్ జీసీసీల స్టార్టప్ విభాగం అధిపతి పంకజ్ వైష్ ఈ చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించారుఈ చర్చాగోష్టిలో శ్రావ్య కనీతి (అభ్యసనంసమ్మిళిత్వంలో నిపుణులు), మనబేంద్ర సన్యాల్ (యూత్ ఎయిడ్ ఫౌండేషన్ సీఈవో), వైజయంతీ వసంత మొగ్లి (అభివృద్ధి నిపుణులుసుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ ఆశా మీనన్ సలహా కమిటీ సభ్యురాలుతదితరులు ప్యానెలిస్టులుగా పాల్గొన్నారు.

 

యువతపై భరోసాతదుపరి తరం ప్రభావశీల వ్యవస్థాపకుల్లో పెట్టుబడిదారులుసంస్థలు ఏం ఆశిస్తున్నాయి?’ అనే అంశంపై రెండో చర్చాగోష్టిని నిర్వహించారుఅటల్ ఆవిష్కరణల మిషన్ ఇన్నొవేషన్ లీడ్ వితస్తా తివారీ ఈ చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించారుకాగా బ్రహ్మ కమల్ వ్యవస్థాపకులుఏంజెల్ ఇన్వెస్టర్ సిద్ధార్థ మొహంతిఅప్‌సర్జ్ గ్లోబల్ వ్యవస్థాపకుడుసీఈవో వివేక్ వర్మయూఎన్‌డీపీభారత్ సుస్థిరసమ్మిళిత అభివృద్ధి విభాగం అధిపతి అమిత్ కుమార్అటల్ ఆవిష్కరణల మిషన్ ప్రోగ్రామ్ లీడ్ ప్రతీక్ దేశ్‌ముఖ్అలియాప్ నైపుణ్యాభివృద్ధి విభాగం వైస్ చైర్‌పర్సన్ పద్మావతీ అన్నపూర్ణ తదితరులు ఈ బృంద చర్చలో పాల్గొన్నారు.

 

యూత్ కో:ల్యాబ్ గురించి

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ), సిటీ ఫౌండేషన్ సంయుక్తంగా 2017లో యూత్ కో:ల్యాబ్‌ను నెలకొల్పాయియువతను సాధికారులను చేసివారిపై పెట్టుబడులు పెట్టే దిశగా.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాల కోసం ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం దీని లక్ష్యంతద్వారా నాయకత్వంసామాజిక ఆవిష్కరణవ్యవస్థాపకత ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలును వారు వేగవంతం చేయగలరుయూత్ కో:ల్యాబ్ గురించి  ఇక్కడ  మరింత చదవండి.

 

అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఏఐఎం) గురించి

స్వయం ఉపాధి - ప్రతిభా సద్వినియోగం (సేతు)తో కూడిన అటల్ ఆవిష్కరణల మిషన్.. దేశంలో ఆవిష్కరణలువ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమంసాంకేతికత ఆధారిత రంగాల్లో ప్రపంచ స్థాయి ఆవిష్కరణల కేంద్రాలుగ్రాండ్ ఛాలెంజ్‌లుఅంకుర సంస్థలుఇతర స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రోత్సహించే ఒక సమర్థమైన వేదికగా నిలవడం దీని ముఖ్యోద్దేశం.

యూఎన్‌డీపీ గురించి

పేదరిక నిర్మూలనతోపాటు అసమానతలనూ, సామాజిక వెలివేతనూ తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునిస్తూ.. 170కి పైగా దేశాలుప్రాంతాల్లో యూఎన్‌డీపీ సేవలందిస్తోందిభారత్‌లో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థానికీకరించడానికీఆ దిశగా ప్రయత్నాలను వేగవంతం చేయడానికి యూఎన్‌డీపీ కృషిచేస్తోందిసుస్థిరసమ్మిళిత అభివృద్ధినీవాతావరణ హిత కార్యాచరణనూపటిష్టమైన ఇంధన పర్యావరణ వ్యవస్థలనూ ఇది ప్రోత్సహిస్తుందిదేశంలోని అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో విపత్తులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించడంఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి కూడా యూఎన్‌డీపీ సహకారాన్ని అందిస్తోందిమరింత సమాచారం కోసం సందర్శించండి: https://www.undp.org/india

సిటి ఫౌండేషన్ గురించి

ప్రపంచవ్యాప్తంగా అల్ప ఆదాయ వర్గాల ఆర్థిక పురోగతిని పెంపొందించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం సిటీ ఫౌండేషన్ కృషి చేస్తోందిఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంపొందించేందుకుయువతకు ఉపాధి అవకాశాలను వేగవంతం చేసేందుకుఆర్థికంగా శక్తిమంతమైన సమాజాల నిర్మాణానికి అవసరమైన సరికొత్త విధానాలకు రూపకల్పన చేసే ప్రయత్నాలకు మద్దతిస్తూ పెట్టుబడులు పెడుతుంది. ‘దాతృత్వానికి మాత్రమే పరిమితం కాకుండా...’ అనే విధానాన్ని సిటి ఫౌండేషన్ అనుసరిస్తోందిలక్ష్య సాధనతోపాటు ఆలోచనాత్మక నాయకత్వాన్నీఆవిష్కరణలనూ ముందుకు నడిపించేలా.. సిటిదాని ఉద్యోగుల విస్తృత నైపుణ్యాలను ఉపయోగించుకుంటుందిమరింత సమాచారం కోసం సందర్శించండి: www.citifoundation.com.

టి-హబ్ గురించి

టి-హబ్ ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్ హబ్ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కొన్ని ఇంక్యుబేషన్ఆవిష్కరణ కార్యక్రమాలకు కీలక వేదికగా నిలుస్తూ వివిధ కార్యక్రమాలుభాగస్వామ్యాలుఅంతర్జాతీయ అవకాశాల ద్వారా.. ఆలోచన దశ నుంచి సంస్థ విస్తరణ వరకు వ్యవస్థాపకులకు పూర్తిస్థాయిలో మద్దతునిస్తోంది.

అంకుర సంస్థలు, కార్పొరేట్లువిద్యాసంస్థలుప్రభుత్వ సంస్థలుపెట్టుబడిదారులుఅంతర్జాతీయ మార్కెట్లను ఏకతాటిపైకి తెచ్చి.. ఆలోచన దశ నుంచి విస్తరణ వరకు వ్యవస్థాపకులకు అండగా ఉంటుందివివిధ రంగాల్లో బృంద ప్రాతిపదికన కార్యక్రమాల ద్వారా.. ప్రముఖ మార్గనిర్దేశకులతో అనుసంధానమవడానికివారి సంస్థల వృద్ధి దశకు తగినట్టుగా వ్యవస్థీకృత మద్దతును పొందడానికి వ్యవస్థాపకులకు టి-హబ్ తోడ్పడుతుందిమరిన్ని వివరాల కోసం సందర్శించండి: www.t-hub.co

***


(रिलीज़ आईडी: 2277679) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati