రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ మెమోరియల్ హాకీ టోర్నమెంట్ జూన్ 23, 2026న 7వ ప్రారంభోత్సవం

प्रविष्टि तिथि: 23 JUN 2026 2:44PM by PIB Hyderabad

మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ డీఎఫ్‌సీ 107వ జయంతిని పురస్కరించుకుని, 7వ మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ మెమోరియల్ హాకీ టోర్నమెంట్-2026ను ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు నిర్వహిస్తోందిఈ టోర్నమెంట్ జూన్ 23 నుంచి జూలై 03, 2026 వరకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జలహళ్లిలో జరుగుతుందిఈ టోర్నమెంట్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి.

జూన్ 23, 2026న ఎయిర్ ఫోర్స్ జలహళ్లిలోని హాకీ మైదానంలో ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగిందిఈ వేడుకను ఎయిర్ మార్షల్ ఎస్శివకుమార్వీఎస్‌ఎంఎయిర్ ఆఫీసర్ఇన్-ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్ (ఏఓఏముఖ్య అతిథిగా విచ్చేసిప్రారంభించారు.

ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ఇండియన్ ఆర్మీ దక్షిణ కమాండ్ బెంగళూరు జట్ల మధ్య జరిగిందిఈ మ్యాచ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జట్టు 2-0 తేడాతో విజయం సాధించిందిఅగ్నివీర్ వినాయక్ సంతోష్ హాండే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారుఆయనకు రూ. 25,000 నగదు బహుమతి చెక్కును ముఖ్య అతిథి అందజేశారుటోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ.. "దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ మెమోరియల్ హాకీ టోర్నమెంట్‌తో మేం మళ్లీ మీ ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందిఈ టోర్నమెంట్ దేశంలోని అత్యుత్తమ హాకీ జట్లకు అద్భుతమైన వేదికను అందిస్తుందిఈ టోర్నమెంట్ ఎలాంటి ఆటంకాలు లేకుండాసజావుగావిజయవంతంగా సాగేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శాయశక్తులా కృషి చేస్తోందిఅని తెలిపారు.

ఈ హాకీ టోర్నమెంట్‌ నిర్వహణ ఎయిర్ ఫోర్స్ దిగ్గజమైన అర్జన్ సింగ్‌కు అందించే నిజమైన నివాళిదేశానికి ఆయన అందించిన విశేష సేవలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇది అద్భుతమైన మార్గం.

 

***


(रिलीज़ आईडी: 2277068) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Tamil