ఔషధాల విభాగం
వైద్య పరికరాల జీటీఈ మినహాయింపు జాబితా ప్రతిపాదిత సవరణలపై భాగస్వాముల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్న ఔషధాల విభాగం
2026 జూలై 15 లోపు తమ అభిప్రాయాలను సమర్పించాలని సంబంధిత వర్గాలకు సూచన
प्रविष्टि तिथि:
23 JUN 2026 3:34PM by PIB Hyderabad
వైద్య పరికరాల అంతర్జాతీయ టెండర్ ప్రక్రియ (జీటీఈ) మినహాయింపు జాబితా సవరణల కోసం అందిన వివిధ ప్రతిపాదనలపై ఔషధాల విభాగం సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించింది. ప్రస్తుతమున్న జీటీఈ మినహాయింపు జాబితాపై అభిప్రాయాలను కోరుతూ 2026 ఫిబ్రవరి 11న జారీ చేసిన పబ్లిక్ నోటీసును అనుసరించి.. ఈ జాబితాలోని అంశాలను చేర్చడం, తొలగించడం లేదా మార్పులు చేయాలని కోరుతూ వివిధ భాగస్వామ్య వర్గాల నుంచి విభాగానికి వినతులు అందాయి.
స్వదేశీ తయారీదారులు, దిగుమతిదారులు, పరిశ్రమల సంఘాలు, కొనుగోలు సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలతో కూడిన సంబంధిత భాగస్వాములందరూ తమ అభిప్రాయాలను సమర్పించవచ్చు. అభిప్రాయాలను వాటికి మద్దతుగా అవసరమైన ఆధారాలతో సహా 2026 జూలై 15 లోగా ఈమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
ఈ మెయిల్ ఐడీ: తమ వివరాలను usmedicaldevices@pharma-dept.gov.in కు ఈమెయిల్ చేస్తూ, ఒక కాపీని so-medicaldevices@pharma-dept.gov.in కు కూడా పంపాలని కోరింది.
ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://pharma-dept.gov.in/ ని సందర్శించండి.
సవరణలకు సంబంధించిన పూర్తి ప్రతిపాదనల జాబితాను పొందేందుకు ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి:
https://acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:af2bd2ba-945f-474a-9762-795547f0a09f
***
(रिलीज़ आईडी: 2277063)
आगंतुक पटल : 15