ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పహాడ్‌పూర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుటుంబ సభ్యుల సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 20 JUN 2026 8:47PM by PIB Hyderabad

పహాడ్‌పూర్‌లోని పాఠశాల ప్రాంగణంలో ఉన్న దివంగత శ్రీ శ్యామ్ చరణ్ ముర్ముదివంగత శ్రీ లఖన్ ముర్ముదివంగత శ్రీ సిపున్ ముర్ము సమాధుల వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలి ఘటించారు.

వ్యక్తిగత విషాదాలు ఎదురైనప్పటికీ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదర్శించిన ధైర్యంపట్టుదల ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి అన్నారు.

ఆమె వ్యక్తిగత అనుభవాలు.. ప్రజా సేవ పట్లప్రజల జీవితాలను మెరుగుపరచటం పట్ల రాష్ట్రపతికున్న నిబద్ధతను మరింత పటిష్ఠం చేశాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"పహాడ్‌పూర్‌లోని పాఠశాల ప్రాంగణంలో ఉన్న దివంగత శ్రీ శ్యామ్ చరణ్ ముర్ముదివంగత శ్రీ లఖన్ ముర్ముదివంగత శ్రీ సిపున్ ముర్ము సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించాను.

వ్యక్తిగత విషాదాలు ఎదురైనప్పటికీ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదర్శించిన ధైర్యంపట్టుదల ఎంతో స్ఫూర్తిదాయకంవ్యక్తిగత అనుభవాలు.. ప్రజా సేవ పట్లప్రజల జీవితాలను మెరుగుపరచటం పట్ల ఆమెకున్న నిబద్ధతను మరింత దృఢంగా మార్చాయి"

 

****


(रिलीज़ आईडी: 2276418) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam