రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మరింత సమర్థమైన స్టేషన్ నిర్వహణ కోసం స్టేషన్ మాస్టర్లకు సాధికారత కల్పించే సమగ్ర చర్యలను సమీక్షించిన రైల్వే మంత్రి

प्रविष्टि तिथि: 19 JUN 2026 1:48PM by PIB Hyderabad

కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ నిన్న సీనియర్ రైల్వే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారతీయ రైల్వే నెట్‌వర్క్ అంతటా సురక్షితమైనమరింత సమర్థవంతమైన, ప్రయాణికుల-కేంద్రిత రైల్వే కార్యకలాపాలను నిర్ధారించడానికి స్టేషన్ మాస్టర్‌లకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం, వారు ఎదుర్కొంటున్న సమస్యలుసవాళ్ల గురించి ఈ సమావేశంలో చర్చించారు.

సురక్షితమైన రైల్వే కార్యకలాపాలను నిర్ధారించడంలోపలు విభాగాలతో సమన్వయం చేసుకోవడంలోప్రయాణికుల సౌకర్యాలను నిర్వహించడంలో, రైల్వే స్టేషన్లు సజావుగా పనిచేయడాన్ని కొనసాగించడంలో స్టేషన్ మాస్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. స్టేషన్ మాస్టర్లు తమ రోజువారీ పనిలో ఎదుర్కొంటున్న కార్యాచరణ, నిర్వహణపరమైన సవాళ్లను గుర్తించడంవారి సామర్థ్యాన్ని బలోపేతం చేసే పరిష్కారాలను రూపొందించడంపైనా ఈ సమీక్షలో చర్చించారు.

స్టేషన్ మాస్టర్ల పాత్రను బలోపేతం చేయడంపైనా ఈ సమావేశంలో చర్చించారు. మెరుగైన నిర్వహణ, కార్యాచరణ అధికారాలుమెరుగైన కెరీర్ పురోగతి మార్గాలు, ఉన్నత స్థాయికి ఎదగడం కోసం మరిన్ని అవకాశాలకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షించారు. వేగంగా నిర్ణయాలు తీసుకునేలాప్రయాణికుల సేవలను మెరుగుపరిచేలా, స్టేషన్ మౌలిక సదుపాయాలుసిబ్బంది కార్యాలయాలుకాలనీలు, ఇతర అనుబంధ సౌకర్యాలను సమర్థంగా పర్యవేక్షించేలా స్టేషన్ మాస్టర్లకు సాధికారత కల్పించడం ఈ చర్యల లక్ష్యం.

పెరుగుతున్న కార్యాచరణ అవసరాలను తీర్చడం... ట్రాఫిక్ స్థాయిలు, కార్యాచరణ సంక్లిష్టత గణనీయంగా పెరిగిన మల్టీ-ట్రాక్, అధిక రద్దీ గల విభాగాల్లో అదనపు స్టేషన్ మాస్టర్లను నియమించడంపైనా చర్చలు జరిగాయి. స్టేషన్ మాస్టర్ కేడర్‌లోని ఖాళీలను వేగంగా భర్తీ చేయాల్సిన అవసరాన్నీ సమీక్షించారు. ఈ ఖాళీల భర్తీని ప్రాధాన్యంగా తీసుకుని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని చర్చలో ప్రధానంగా ప్రస్తావించారు.

సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సాంకేతికత ప్రాముఖ్యతను గుర్తించిస్టేషన్ మాస్టర్ల కోసం మొబైల్ యాప్ ఆధారిత కాగితరహిత పని విధానాలను ప్రవేశపెట్టడంపైనా చర్చలు జరిగాయి. వివిధ రైల్వే విభాగాల మధ్య మెరుగైన సమన్వయాన్ని పెంపొందించిస్టేషన్లలో ప్రయాణికులకు సంబంధించిన సమస్యలను వేగంగా పరిష్కరించడానికి వీలు కల్పించే సమీకృత స్టేషన్ నిర్వహణ వ్యవస్థ అభివృద్ధినీ ఈ సమావేశంలో సమీక్షించారు.

ఆధునిక నైపుణ్యాభివృద్ధిసామర్థ్యాలను మెరుగుపరచాల్సిన ప్రాముఖ్యతను రైల్వే మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. రోజురోజుకూ సంక్లిష్టమవుతున్న రైల్వే కార్యకలాపాలుఅత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి స్టేషన్ మాస్టర్లను మరింత మెరుగ్గా సిద్ధం చేసేందుకు... వర్చువల్ రియాలిటీసిమ్యులేటర్లుఇతర ఆధునిక శిక్షణా సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం ద్వారా శిక్షణా పద్ధతులను ఉన్నతీకరించడంపైనా అధికారులు చర్చించారు.

స్థానిక సమస్యల సత్వర పరిష్కారానికిప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికిస్టేషన్ మాస్టర్ల ఆర్థిక అధికారాల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షించారు. స్టేషన్ స్థాయిలో అధిక సాధికారత కల్పించడం ద్వారా సకాలంలో నిర్వహణప్రయాణికుల అవసరాలకు వేగవంతమైన స్పందనమెరుగైన స్టేషన్ నిర్వహణ సాధ్యమవుతాయని ఆశిస్తున్నారు.

స్టేషన్ మాస్టర్ల కెరీర్ పురోగతి అవకాశాలను మెరుగుపరిచే చర్యలనూ ఈ సమావేశంలో పరిశీలించారు. దీని ద్వారా భారతీయ రైల్వేలో ఉన్నత స్థాయి నిర్వహణ, నాయకత్వ పదవులను పొందేందుకు వారికి మరింత అవకాశం లభిస్తుంది. ఈ కీలకమైన కార్యాచరణ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం మరింత ప్రేరణాత్మకమైన, అభివృద్ధి-ఆధారిత పని వాతావరణాన్ని సృష్టించడంపైనా చర్చలు జరిగాయి.

భద్రతకు సంబంధించిన సమస్యలనూ వివరంగా సమీక్షించారు. రైల్వే కార్యకలాపాల్లో మహిళా స్టేషన్ మాస్టర్లు, మహిళా పాయింట్స్‌మెన్‌ల భాగస్వామ్యం పెరుగుతున్న దృష్ట్యా... స్టేషన్లలో మెరుగైన భద్రతా పరికరాలు, సులభంగా ఉపయోగించగల సాధనాలను అందించడంపైనా చర్చించారు. రైల్వే ఫ్రంట్‌లైన్ సిబ్బందికి సురక్షితమైనమరింత అందుబాటులో ఉండే, మరింత సమర్థమైన పని పరిస్థితులను కల్పించడం దీని లక్ష్యం.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికుల కోసం మరింత మెరుగైన ప్రతిస్పందనను అందించడం... సమర్థమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న స్టేషన్ నిర్వహణ వ్యవస్థను నిర్మించడం లక్ష్యంగా... స్టేషన్ మాస్టర్‌లకు మెరుగైన మానవ వనరుల మద్దతుఆధునిక సాంకేతికతమెరుగైన శిక్షణ, అధిక నిర్ణయాధికారం కల్పించడం పట్ల భారతీయ రైల్వే నిబద్ధతను ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి.

 

***


(रिलीज़ आईडी: 2275386) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Odia , Tamil , Kannada