19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం: రెండో ఎడిషన్ 'వేవ్స్ డాక్ బజార్' ఆవార్డు వేడుకల విశేషాలు
ముంబైలో జరుగుతున్న 19వ ‘ఎంఐఎఫ్ఎఫ్ 2026’లో భాగంగా ఈ రోజు జరిగిన 'వేవ్స్ డాక్ బజార్' 2వ ఎడిషన్ అవార్డుల ప్రధానోత్సవం.. స్వతంత్ర చలనచిత్ర దర్శకులకు ఒక కీలక వేదికగా నిలిచింది. వాస్తవ కథనాలు, లఘ చిత్ర విభాగాలకు కీలకమైన ఊతాన్ని అందించే లక్ష్యంతో రూపొందించిన ఈ డాక్ బజార్.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రాలకు పోస్ట్-ప్రొడక్షన్ ప్రోత్సాహకాలు, థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ మద్దతు, నగదు బహుమతులను అందజేసింది.
ప్రసాద్ ల్యాబ్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ), రీబోర్న్ ఇండియా ఫిల్మ్స్, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ) వంటి ప్రముఖ పరిశ్రమ దిగ్గజాలు నెలకొల్పిన ఈ అవార్డులు.. భారత్ నలుమూలల నుంచి బలమైన, స్వతంత్ర కథాంశాలతో సినిమాలు రూపొందించడానికి బాటలు వేస్తున్నాయి.
2026 జూన్ 18 జేబీ హాల్‌లో జరిగిన ఈ ఏడాది డాక్ బజార్ అవార్డుల ప్రధానోత్సవంలో విజేతలుగా నిలిచిన ప్రముఖులకు సంబంధించిన చిత్రాలను ఇక్కడ చూడొచ్చు.
ప్రసాద్ ల్యాబ్స్ అవార్డులు
ఎంఐఎఫ్ఎఫ్ 2026లో భాగంగా 2026 జూన్ 18న జేబీ హాల్‌లో జరిగిన 'వేవ్స్ డాక్ బజార్' 2వ ఎడిషన్‌లో ప్రసాద్ ల్యాబ్స్ జనరల్ మేనేజర్ శ్రీ నితిన్ పింగ్లే, ప్రముఖ చలనచిత్ర దర్శకురాలు కరిష్మా రావు రూపొందించిన 'ఆన్ ఎ గుడ్ నోట్' అనే డాక్యుమెంటరీ చిత్రానికి 'ప్రసాద్ ల్యాబ్ పోస్ట్ ప్రొడక్షన్ అవార్డు'ను అందజేశారు. ఈ అవార్డు ద్వారా చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో 50 గంటల వరకు ఉచిత 4కే డీఐ సర్వీసులను పొందొచ్చు.
2026 జూన్ 18న జేబీ హాల్‌లో జరిగిన 'వేవ్స్ డాక్ బజార్' 2వ ఎడిషన్‌లో... ప్రసాద్ ల్యాబ్స్ జనరల్ మేనేజర్ శ్రీ నితిన్ పింగ్లే.. చలనచిత్ర దర్శకుడు ఇంద్రజీత్ మోరే రూపొందించిన 'ఇట్ టేక్స్ ఎ విలేజ్' అనే ఫీచర్ డాక్యుమెంటరీ చిత్రానికి 'ప్రసాద్ ల్యాబ్ పోస్ట్ ప్రొడక్షన్ అవార్డు'ను అందజేశారు. ఈ అవార్డు ద్వారా 50 గంటల వరకు డీఐ సర్వీసులపై 50 శాతం తగ్గింపు లభిస్తుంది.
ఐఐసీటీ పోస్ట్ ప్రొడక్షన్ అవార్డులు
ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఎంఐఎఫ్ఎఫ్ 2026) భాగంగా 2026 జూన్ 18న జేబీ హాల్‌లో జరిగిన 'వేవ్స్ డాక్ బజార్' 2వ ఎడిషన్‌లో... ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) డైరెక్టర్ (అకడమిక్స్) శ్రీ సతీష్ నారాయణన్.. చలనచిత్ర దర్శకులు నందన్ సక్సేనా, కవితా బాల్ రూపొందించిన 'అడియూ ఢిల్లీ' అనే డాక్యుమెంటరీ చిత్రానికి 'ఐఐసీటీ పోస్ట్-ప్రొడక్షన్ అవార్డు'ను అందజేశారు. ఈ అవార్డు ద్వారా 50 గంటల 4కే డీఐ సర్వీసులపై 50 శాతం తగ్గింపు లభిస్తుంది.
ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భాగంగా 2026 జూన్ 18న జేబీ హాల్‌లో జరిగిన 'వేవ్స్ డాక్ బజార్' 2వ ఎడిషన్‌లో... ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) డైరెక్టర్ (అకడమిక్స్) శ్రీ సతీష్ నారాయణన్.. చలనచిత్ర దర్శకురాలు సాన్యా ఆనంద్ రూపొందించిన 'దో చార్ దిన్' అనే డాక్యుమెంటరీ చిత్రానికి 'ఐఐసీటీ పోస్ట్-ప్రొడక్షన్ అవార్డు'ను అందజేశారు. ఈ అవార్డు ద్వారా 50 గంటల 4కే డీఐ సర్వీసులపై 50 శాతం తగ్గింపు లభిస్తుంది.
రీబోర్న్ ఇండియా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఆవార్డులు
ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఎంఐఎఫ్ఎఫ్ 2026) భాగంగా 2026 జూన్ 18న జేబీ హాల్‌లో జరిగిన 'వేవ్స్ డాక్ బజార్' 2వ ఎడిషన్‌లో రీబోర్న్ ఇండియా ఫిల్మ్స్ ప్రతినిధులు శ్రీ రాహుల్ అగర్వాల్, శ్రీ రోహిత్ అగర్వాల్.. చలనచిత్ర దర్శకురాలు కరిష్మా రావు రూపొందించిన 'ఆన్ ఎ గుడ్ నోట్' అనే డాక్యుమెంటరీ చిత్రానికి 'రీబోర్న్ ఇండియా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అవార్డు'ను అందజేశారు. ఈ అవార్డు ద్వారా రూ. 7 లక్షల విలువైన డిస్ట్రిబ్యూషన్ మద్దతుతో పాటు 10 సినిమా హళ్ల తెరలలో సినిమా విడుదలకు భరోసా లభిస్తుంది.
ఎన్‌ఎఫ్‌డీసీ నగదు(క్యాష్ గ్రాంట్) అవార్డులు
ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఎంఐఎఫ్ఎఫ్ 2026) భాగంగా 2026 జూన్ 18న ముంబయిలోని జేబీ హాల్‌లో నిర్వహించిన 'వేవ్స్ డాక్ బజార్' 2వ ఎడిషన్‌లో జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ) కార్యనిర్వాహక డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మాగ్దుమ్.. చలనచిత్ర దర్శకుడు అశోక్ మీనా రూపొందిస్తున్న 'కుంచోక్ అండ్ హిస్ మెనీ మూన్స్' చిత్రానికి రూ. 1 లక్ష రూపాయల 'ఎన్‌ఎఫ్‌డీసీ నగదు (క్యాష్ గ్రాంట్) అవార్డును' అందజేశారు.
ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఎంఐఎఫ్ఎఫ్ 2026) భాగంగా 2026 జూన్ 18న జేబీ హాల్‌లో నిర్వహించిన 'వేవ్స్ డాక్ బజార్' 2వ ఎడిషన్‌లో జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ) కార్యనిర్వాహక డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మాగ్దుమ్.. చలనచిత్ర దర్శకురాలు మధురిమ మైతీ రూపొందిస్తున్న 'ది గర్ల్ బినీత్ ది సన్' చిత్రానికి రూ. 1 లక్ష రూపాయల 'ఎన్‌ఎఫ్‌డీసీ నగదు (క్యాష్ గ్రాంట్) అవార్డును' అందజేశారు.
ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఎంఐఎఫ్ఎఫ్ 2026) భాగంగా 2026 జూన్ 18న జేబీ హాల్‌లో నిర్వహించిన 'వేవ్స్ డాక్ బజార్' 2వ ఎడిషన్‌లో జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ) కార్యనిర్వాహక డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మాగ్దుమ్.. చలనచిత్ర దర్శకురాలు మధురిమ మైతీ రూపొందిస్తోన్న 'తుక్రో తుక్రో పృథ్వి' చిత్రానికి రూ. 1 లక్ష రూపాయల 'ఎన్‌ఎఫ్‌డీసీ నగదు (క్యాష్ గ్రాంట్) అవార్డును' అందజేశారు.
2026 జూన్ 18న జేబీ హాల్‌లో జరిగిన 19వ ఎంఐఎఫ్ఎఫ్ 2026లోని 2వ వేవ్స్ డాక్ బజార్ ముగింపు సందర్భంగా అవార్డులు గెలుచుకున్న చలనచిత్ర దర్శకులతో ఎన్‌ఎఫ్‌డీసీ కార్యనిర్వాహక డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మాగ్దుమ్, ప్రసాద్ ల్యాబ్స్ జనరల్ మేనేజర్ శ్రీ నితిన్ పింగ్లే, ఐఐసీటీ ప్రతినిధి శ్రీ సతీష్ నారాయణన్.. రీబోర్న్ ఇండియా ఫిల్మ్స్ ప్రతినిధులు రాహుల్, రోహిత్ అగర్వాల్ వంటి ప్రముఖులు దిగిన ఫోటో.
ఎంఐఎఫ్ఎఫ్:
ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలు, యానిమేషన్ చిత్రాలలోని అత్యుత్తమ ప్రతిభను గుర్తించే ఒక ప్రతిష్ఠాత్మక వేదికే ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం. ప్రత్యేక మాస్టర్‌క్లాస్‌లు, వర్క్‌షాప్‌ల ద్వారా ఇది సినిమా రంగంపై చర్చలను, కొత్త విషయాల అభ్యాసాన్ని ప్రోత్సహిస్తోంది.
***
रिलीज़ आईडी:
2274990
| Visitor Counter:
17