ప్రధాన మంత్రి కార్యాలయం
భారత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించే, పెంపొందించే దిశగా చేస్తున్న ప్రయత్నాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
18 JUN 2026 2:33PM by PIB Hyderabad
భారత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకూ, పెంపొందించేందుకూ మొదలుపెట్టిన ప్రయత్నాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. సరికొత్త ఉత్సాహంతో భారత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షిస్తూ, పండుగ చేసుకుంటూ, ముందుకు తీసుకుపోతున్నట్లు ఆయన తెలిపారు.
‘విరాసత్ భీ, వికాస్ భీ’ (వారసత్వంతో పాటు అభివృద్ధి కూడా) దృష్టికోణం నుంచి స్ఫూర్తిని పొంది ప్రాచీన కళాకృతులనూ, అవశేషాలనూ మన దేశానికి తిరిగి తీసుకురావడం మొదలు ఆధ్యాత్మిక, తీర్థయాత్రా సంబంధిత మౌలిక సదుపాయాల కల్పనను పటిష్ఠపరచడం వరకూ చేస్తున్న అనేక ప్రయత్నాలు ప్రజలను భారత శాశ్వత సంప్రదాయాలతో తిరిగి అనుసంధానిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘సరికొత్త ఉత్సాహంతో భారత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షిస్తూ, పండుగ చేసుకుంటూ, ముందుకు తీసుకుపోతున్నాం.
‘విరాసత్ భీ, వికాస్ భీ’ (వారసత్వంతో పాటు అభివృద్ధి కూడా) దృష్టికోణం నుంచి స్ఫూర్తిని పొంది ప్రాచీన కళాకృతులనూ, అవశేషాలనూ మన దేశానికి తిరిగి తీసుకురావడం మొదలు ఆధ్యాత్మిక, తీర్థయాత్రా సంబంధించిన మౌలిక సదుపాయాలను పటిష్ఠపరచడం వరకూ చేస్తున్న అనేక ప్రయత్నాలు ప్రజలను భారత శాశ్వత సంప్రదాయాలతో తిరిగి అనుసంధానిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2274756)
సందర్శకుల సూచీ సంఖ్య : : 48
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam