MIFF banner

డాక్యుమెంటరీ ప్రయాణం మధురమైన ఘటనల సమాహారం: 19వ ఎంఐఎఫ్ఎఫ్ లో చలనచిత్ర మాధ్యమం ద్వారా జ్ఞాపకాలను భద్రపరిచే కళపై నిపుణుల చర్చ


భావితరాల కోసం చరిత్ర, సంస్కృతి, మానవ అనుభవాలను భద్రపరచడంలో డాక్యుమెంటరీల కీలక పాత్ర

19వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా, "మనుషులు, క్షణాలు,జ్ఞాపకాలను భద్రపరిచే మాధ్యమంగా డాక్యుమెంటరీ"  ఇతివృత్తంపై  ఇండియన్ డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐడీపీఏ) ఓపెన్ ఫోరమ్ ను నిర్వహించింది. చరిత్ర, సంస్కృతి,  సామూహిక జ్ఞాపకాలను భద్రపరచడంలో డాక్యుమెంటరీల పాత్ర గురించి చర్చించడానికి ఈ సమావేశం చలనచిత్ర దర్శకులు సురేష్ శర్మ, సంజిత్ నార్వేకర్, రూపా బారువా, అమ్రిష్ రాయ్ చౌదరిలతో పాటు ప్రముఖ రేడియో ప్రెజెంటర్ యూనుస్ ఖాన్‌లను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది.

డాక్యుమెంటరీలు కేవలం సంఘటనలను, వ్యక్తులను నమోదు చేసే రికార్డులుగా మాత్రమే కాకుండా సామాజిక, సాంస్కృతిక,చారిత్రక అనుభవాలను భద్రపరిచే ముఖ్యమైన సంగ్రహాలయాలుగా ఉపయోగపడతాయని ప్యానెలిస్ట్ సభ్యులు చెప్పారు.

డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణంలో పరిశోధన, వాస్తవ నిర్ధారణ, బలమైన కథన నిర్మాణం చాలా ముఖ్యమని సురేష్ శర్మ ప్రముఖంగా ప్రస్తావించారు. చిత్రంలోని అంశాల సంఘర్షణలు, భావోద్వేగాలు, సున్నితత్వాలను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించినప్పుడే డాక్యుమెంటరీలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు. పరిశోధన ప్రక్రియలో లభించే కొత్త విషయాలు, కొత్త ఆవిష్కరణలు తరచుగా ఒక చిత్ర కథన దిశను మార్చి, దానికి కొత్త రూపాన్ని ఇస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒక కథ కోసం అన్వేషిస్తున్నప్పుడు సరికొత్త ఆవిష్కరణలు వెలుగులోకి రావడం అనే ప్రక్రియను సంజిత్ నార్వేకర్ అభివర్ణిస్తూ, డాక్యుమెంటరీలను వరుస 'మధురమైన ఊహించని మలుపుల' సమాహారంగా పేర్కొన్నారు. సరికొత్త దృక్పథాలను కనుగొనవలసిన అవసరాన్ని ఆయన ప్రముఖంగా చెప్పారు.పరిశోధనలో తెలిసే కొత్త విషయాలకు అనుగుణంగా కథలను మలచుకోవాలని ఆయన సూచించారు.

మనుషులు, ప్రదేశాల కథలను చెప్పడానికి తీసే సినిమాలు, కాలక్రమేణా విలువైన చారిత్రక ఆధారాలుగా మారతాయని రూపా బారువా అన్నారు. తను రూపొందించిన 'రైడర్స్ ఆఫ్ ది మిస్ట్', 'డాటర్స్ ఆఫ్ ది పోలో గాడ్' చిత్రాలను ప్రస్తావిస్తూ, కథా గమనాన్ని ఎంతో జాగ్రత్తగా మలచుకుంటూ, ప్రేక్షకులు కథతో మమేకమయ్యేలా ఉంచడం, కథా విధానం ఎంత ముఖ్యమో ఆమె వివరించారు. 

రేడియో డాక్యుమెంటరీలు సాంస్కృతిక వారసత్వాన్ని భద్రపరచడంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయనే విషయంపై యూనుస్ ఖాన్ మాట్లాడారు. భారతదేశం నలుమూలల నుంచీ కళాకారుల జీవిత ప్రయాణాలను డాక్యుమెంట్ చేయడంలో, అలాగే జానపద సంగీతం, సాహిత్యం, ఇతర సాంస్కృతిక సంప్రదాయాలను సంరక్షించడంలో 'వివిధ భారతి' చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు.

డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణంలో చారిత్రక ఆధారాల పరిశోధన ప్రాముఖ్యతను అమ్రిష్ రాయ్ చౌదరి తెలిపారు. ఈ  సందర్భంగా 'నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా' వంటి సంస్థల ప్రాముఖ్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. చారిత్రక ఇతివృత్తాలను డాక్యుమెంట్ చేసేటప్పుడు వాస్తవాల కచ్చితత్వం, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ధృవీకరించుకోవడం ఎంతైనా అవసరమని ఆయన స్పష్టం చేశారు.

ఒక కథ కోసం ప్రారంభమైన అన్వేషణ క్రమంగా సంస్కృతి, జ్ఞాపకాలు, సామాజిక మార్పులను భద్రపరిచే విలువైన పత్రంగా  రూపాంతరం చెందుతుందని ప్యానెలిస్టులు పేర్కొన్నారు. జ్ఞాపకాలు, సంప్రదాయాలు, ప్రజల జీవన అనుభవాలను చిత్రీకరించడం ద్వారా డాక్యుమెంటరీ చిత్రాలు కేవలం లిఖితపూర్వక రికార్డులకే పరిమితం కాకుండా చరిత్రను భవిష్యత్ తరాలకు సజీవంగా భద్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. డాక్యుమెంటరీల పరిశోధన, భాండాగారాల నిర్వహణ విధానాలు, చిత్రాల ద్వారా జ్ఞాపకాలను సంరక్షించాల్సిన అవసరం వంటి అంశాలపై ప్రేక్షకులతో జరిగిన ఉత్సాహభరితమైన చర్చతో ఈ సమావేశం ముగిసింది.

 

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2274312   |   Visitor Counter: 5

इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , हिन्दी , Marathi , Tamil