ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీ7 సదస్సు నేపథ్యంలో యూకే ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 JUN 2026 12:36AM by PIB Hyderabad

ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీసదస్సు నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దైపాక్షిక సమావేశం నిర్వహించారు.

గతేడాది రెండు దేశాల్లోనూ ప్రధానమంత్రులు చేపట్టిన పరస్పర పర్యటనల అనంతరం భారత్-యూకే సంబంధాల్లో సాధించిన పురోగతిని సమీక్షించారుఅలాగే వాణిజ్యం-ఆర్థిక వృద్ధిరక్షణ-భద్రతవాతావరణ చర్యలు-హరిత ఇంధనంసాంకేతికతఆవిష్కరణలువిద్య-ప్రజా సంబంధాలతో సహా విజన్-2035లో ఉన్న ప్రధానాంశాల్లో సాధించిన పురోగతిని వారు స్వాగతించారుసమగ్ర ఆర్థికవాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరగా అమల్లోకి రావాలని ఆకాంక్షించారువిస్తృతమైన విద్యా భాగస్వామ్యం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారుబెంగళూరులో లివర్‌పూల్ విశ్వవిద్యాలయం క్యాంపస్ముంబయిలో యార్క్ విశ్వవిద్యాలయంబ్రిస్టల్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లను స్థాపించడంలో సాధించిన తాజా పురోగతిపై చర్చించారు.

ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూకే తరఫున బలమైన ప్రాతినిధ్యం వహించినందుకు ప్రధాని స్టార్మర్‌కు ప్రధానమంత్రి మోదీ ధన్యవాదాలు తెలిపారుఇటీవలే ప్రారంభించిన భారత్–యూకే కీలక ఖనిజాల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ అబ్జర్వేటరీతో సహా సాంకేతిక భద్రతా కార్యక్రమ పరిధిలో స్థిరంగా సాధిస్తున్న పురోగతిని ఆయన స్వాగతించారు.

పశ్చిమాసియాఉక్రెయిన్ సహా పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయఅంతర్జాతీయ అంశాలపై నాయకులు తమ ఆలోచనలను పంచుకున్నారుభారత్-యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో తమ ఉమ్మడి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2273888) సందర్శకుల సూచీ సంఖ్య : : 102