MIFF banner

కెనడా, ఫిలిప్పీన్స్, ఐస్‌ల్యాండ్ దేశాలకు చెందిన మూడు అంతర్జాతీయ చిత్రాలతో ప్రారంభమైన 19వ ఎంఐఎఫ్ఎఫ్-2026

కరుగుతున్న హిమనీ నదాలుచెదురుతున్న జ్ఞాపకాల దగ్గర నుంచి మనుషుల్లోని కోరికలుఏఐ అనిశ్చితుల వరకు.. వివిధ ఇతివృత్తాలతో రూపొందించిన మూడు చిత్రాలు ముంబయిలో ఈ రోజు ప్రారంభమైన 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్)-2026కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయిఆ చిత్రాలు.. ‘టైమ్ అండ్ వాటర్’, ‘అగాపిటో’, ’గుడ్ లక్ టు యూ ఆల్’ప్రారంభ వేడుకల అనంతరం రవీంద్ర నాట్య మందిర్‌లో ఈ మూడు చిత్రాలను ప్రదర్శించారుడాక్యుమెంటరీలుషార్ట్ ఫిక్షన్యానిమేషన్ చిత్రాల కోసం భారతదేశంలో నిర్వహించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎంఐఎఫ్ఎఫ్ చలనచిత్రోత్సవం 2026 జూన్ 15 నుంచి 21 వరకు ముంబయిలో జరుగుతుంది.

కాలంమంచుజ్ఞాపకాల అంతర్మథనంటైమ్ అండ్ వాటర్

సారా డోసా దర్శకత్వం వహించిన టైమ్ అండ్ వాటర్‌ ప్రదర్శనతో ఉత్సవం ప్రారంభమైందిఈ డాక్యుమెంటరీని నిన్మాహ్ ఫౌండేషన్ సహకారంతో నేషనల్ జాగ్రఫిక్ డాక్యుమెంటరీ ఫిలిమ్స్శాండ్ బాక్స్ ఫిలిమ్స్ సమర్పించాయిఇది ఐస్‌ల్యాండ్ రచయిత ఆండ్రీ స్నాయర్ మాగ్నాసన్ తన వ్యక్తిగతచారిత్రక జ్ఞాపకాలను ఒక టైమ్ కాప్స్యూల్‌గా ఎలా మార్చారో చూపిస్తుందికరిగిపోతున్న హిమానీనదాలుమారిపోతున్న ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో సాగే ఆయన ప్రయాణం.. పర్యావరణపరంగాకుటుంబపరంగా ఎదురైన నష్టాలను హృద్యంగా ప్రదర్శిస్తుందికరుగుతున్న మంచునుచెదురుతున్న జ్ఞాపకాలతో ముడిపెడుతుందిమానవ-ప్రకృతి సంబంధాలను అన్వేషించే చిత్రాలు తీయడంలో పేరుగాంచిన నాన్-ఫిక్షన్ ఫిలిం మేకర్ సారా డోసా ఆస్కార్‌కు నామినేట్ అయ్యారుఈ సినిమా కాలంమార్పుతరాల మధ్య ఉండాల్సిన బాధ్యతపై కవితాత్మక ఆలోచనను అందిస్తుంది.

మరిచిపోతున్న ప్రదేశంలో నిశ్శబ్ద నిరీక్షణఅగాపిటో

టాగలాగ్ భాషలో తెరకెక్కిన ‘అగాపిటో’ అనే ఫిలిప్పీన్స్ లఘు చిత్రానికి అర్విన్ బెలార్మినోకైలా రొమేరో సంయుక్తంగా దర్శకత్వం వహించారుకనుమరుగవుతున్న ఒక పాత బౌలింగ్ క్రీడా కేంద్రం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందినెల చివరి రోజునమేనేజర్ మీరా తన రోజువారీ పనులను పూర్తి చేసుకుంటూ.. ఒక ప్రత్యేక వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటుందిఆ వ్యక్తి రాక వెనుక ఓ నిశ్శబ్దమైన భావోద్వేగ భారం దాగి ఉంటుందిచాలా నిగ్రహంతో కూడిన కథనంతో సాగే ఈ సినిమా.. రోజువారీ దైనందిన జీవితానికీఅంచనాలకూ మధ్య ఉండే ఆందోళనలను అన్వేషిస్తుందిఅలాగే సాధారణ ప్రదేశాలుచిన్న చిన్న పనులు కూడా ఆకాంక్షలనుజ్ఞాపకాలనుమానవ సంబంధాలను ఎంత హృద్యంగా దాచి ఉంచగలవో ఈ చిత్రం చూపిస్తుంది.

భవిష్యత్తు నుంచి వచ్చిన వింత హెచ్చరికగుడ్ లక్ టూ యూ ఆల్

కెనడియన్ ఫిల్మ్ మేకర్ కోర్డెల్ బార్కర్ దర్శకత్వం వహించిన ‘గుడ్ లక్ టు యూ ఆల్’ అనే యానిమేటెడ్ లఘు చిత్రం.. సరదాగా సాగుతూనేకాస్త కలవరపెట్టే కథనాన్ని పరిచయం చేస్తుందితన బొమ్మలతో ఊహాలోకంలో మునిగిపోయిన ఒక పాప చుట్టూ ఈ కథ తిరుగుతుందిఅయితే అనిశ్చితమైన మానవ భవిష్యత్తుతో అనుసంధానమవుతాననే విషయం ఆమెకు తెలియదుశాస్త్రవేత్తలుమేధావుల విభిన్న ఆలోచనలను జోడిస్తూ.. బాల్యంలోని అమాయకత్వానికితత్వశాస్త్రపరమైన ఆందోళనకు మధ్య ఈ కథ తిరుగుతుందిహాస్యంవిస్మయంహెచ్చరికలను సమపాళ్లలో కలబోస్తూ.. కృత్రిమ మేధసాంకేతిక పరిణామంమానవ పురోగతికి సంబంధించిన అనూహ్యమైన మార్గాలపై ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుందియానిమేటర్ అయిన కోర్డెల్ బార్కర్‌కు నేషనల్ ఫిల్మ్ బోర్డ్ ఆఫ్ కెనడాతో అనుబంధం ఉందిఆయన రెండుసార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు.

పర్యావరణ సమస్యలనూ, మానవ భావోద్వేగాలనూసాంకేతిక పరమైన ప్రశ్నలనూ అద్భుతంగా మేళవిస్తూ.. ప్రారంభ కార్యక్రమంలో ఈ మూడు చిత్రాలను ప్రదర్శించారుఇవి ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఉన్న వైవిధ్యాన్నీప్రపంచ స్థాయి దృక్పథాన్నీ ప్రతిబింబించాయివారం రోజుల పాటు సాగే ఈ సినిమా పండుగకు స్ఫూర్తిదాయకమైనఆలోచనాత్మకమైన వాతావరణాన్ని ఈ మూడు చలనచిత్రాల ప్రదర్శన అందించింది.

నాన్-ఫీచర్ చిత్రాల కోసం దక్షిణాసియాలో అత్యంత దీర్ఘకాలంగా కొనసాగుతున్నఅతి పెద్ద చలన చిత్రోత్సవంగా ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్గుర్తింపు పొందిందిడాక్యుమెంటరీలుషార్ట్ ఫిక్షన్యానిమేషన్ చిత్ర నిర్మాణ రంగానికి ఒక శక్తిమంతమైన వేదికగా నిలిచింది. 1990లో ప్రారంభమైన ఎంఐఎఫ్ఎఫ్‌ను భారత ప్రభుత్వ సమాచారప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారుప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర నిర్మాతలుకళాకారులుసినిమా ప్రియులను ఆకర్షించే ఒక ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ వేదికగా ఈ చలనచిత్రోత్సవం ఎదిగింది.

19వ ఎంఐఎఫ్ఎఫ్ గురించి

ఎంపిక చేసిన అంతర్జాతీయ చిత్రాలతో పాటు, పరిశ్రమ కేంద్రక కార్యక్రమాలతో ఉత్సాహవంతమైనలీనమయ్యే సినిమా అనుభూతిని ఈ 19వ ఎంఐఎఫ్ఎఫ్ అందిస్తుంది.

ఈ ఏడాది చలన చిత్రోత్సవంలో పోటీ పడేందుకు భారత్‌తో సహా 47 దేశాల నుంచి రికార్డు స్థాయిలో 1,459 చిత్రాల ఎంట్రీలు వచ్చాయి.

ఈ ఉత్సవంలో 42కు పైగా భారతీయ భాషలు, 30కి పైగా విదేశీ భాషల్లో రూపొందిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారుఇది ఈ ఉత్సవానికున్న అంతర్జాతీయ స్థాయినిసాంస్కృతిక వైవిధ్యాన్ని తెలియజేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు రూపొందించిన కొన్ని అత్యుత్తమ డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలుయానిమేషన్లతో పాటు నూతన దర్శకులువిద్యార్థులు రూపొందించిన చిత్రాలను ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తారు.

సినిమాల ప్రదర్శనతో పాటు.. డాక్ బజార్ రెండో సంచికసినీ నైపుణ్యాలను పెంచే మాస్టర్‌క్లాస్‌లుఐడీపీఏ నిర్వహించే ఓపెన్ ఫోరమ్ లాంటి కార్యక్రమాలు సినిమాపరమైనసృజనాత్మకమైన ఆలోచనలను మరింత విస్తరింపచేస్తాయి.

డాక్యుమెంటరీ, యానిమేషన్షార్ట్ ఫిక్షన్ చిత్రాలను మరపురాని పండగలా నిర్వహించేందుకు శక్తిమంతమైన సినిమాసృజనాత్మక ఆలోచనలుస్ఫూర్తిదాయక గళాలు ఒక్కటయ్యే వైవిధ్యభరితమైన కథల ప్రపంచమైన ఎంఐఎఫ్ఎఫ్-2026 లోకి అడుగుపెట్టండి!

 

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2273471   |   Visitor Counter: 11