ప్రపంచ సినీ ప్రముఖులను ఏకం చేస్తూ ముంబైలో 19వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభం
భారతదేశంలో డాక్యుమెంటరీలు, లఘు కథా చిత్రాలు, యానిమేషన్, కృత్రిమ మేధ ఆధారిత చిత్రాలకు ప్రత్యేకించిన ప్రతిష్ఠాత్మక ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) 19వ ఎడిషన్ నేడు ముంబైలోని రవీంద్ర నాట్య మందిర్‌లో ఘనంగా ప్రారంభమైంది.
భారత ప్రభుత్వ సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ) నిర్వహిస్తున్న ఈ చలన చిత్రోత్సవం నాన్-ఫీచర్ చిత్రాల కోసం ప్రత్యేకించిన దక్షిణాసియాలోనే అత్యంత ప్రాచీన, అతిపెద్ద చలనచిత్రోత్సవం. సరిహద్దులకు అతీతంగా సాగే ఈ సినిమా పండుగ సృజనాత్మక దృశ్యకావ్యం, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిక్షన్, యానిమేషన్, ఏఐ ఆధారిత కథా కథనాలలో అత్యుత్తమ ప్రతిభను చాటడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర నిర్మాతలు, పరిశ్రమ నిపుణులు, సినిమా ప్రేమికులను ఒకచోటికి చేరుస్తుంది.
సినీ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ప్రారంభ వేడుక ఘనంగా జరిగింది. విశిష్ట అతిథులు, చలనచిత్ర నిర్మాతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభ వేడుకల సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్, ప్రముఖ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది రెడ్ కార్పెట్‌పైకి విచ్చేస్తున్న దృశ్యం.
మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలు,ఐటీ శాఖ మంత్రి శ్రీ ఆశిష్ షెలార్, మరాఠీ భాషా విభాగం కార్యదర్శి డాక్టర్ కిరణ్ కుల్కర్ణితో కలిసి ఉన్న చిత్రం.
ఎన్ఎఫ్‌డీసీ చైర్మన్ శ్రీ జి. కృష్ణకుమార్ ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దుమ్‌లతో కలిసి సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ రెడ్ కార్పెట్‌పైకి విచ్చేస్తున్న దృశ్యం.
ప్రముఖ చలనచిత్ర నిర్మాత వి. శాంతారామ్ కుమారుడు శ్రీ కిరణ్ శాంతారామ్ రెడ్ కార్పెట్‌ను అలంకరించిన దృశ్యం.
ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ అశుతోష్ గోవారికర్, ఇఫీ డైరెక్టర్ రెడ్ కార్పెట్‌పైకి విచ్చేస్తున్న దృశ్యం.
ప్రముఖ చలనచిత్ర నటుడు శ్రీ జైదీప్ అహ్లావత్, నటి షీనా చోహన్ రెడ్ కార్పెట్‌పైకి విచ్చేస్తున్న దృశ్యం.
పీఐబీ, ముంబై డైరెక్టర్ జనరల్ శ్రీమతి స్మితా వాట్స్ శర్మ రెడ్ కార్పెట్ వద్ద ప్రముఖులతో ముచ్చటిస్తున్న దృశ్యం.
ప్రారంభ వేడుకలలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రముఖ చలనచిత్ర నటుడు శ్రీ జైదీప్ అహ్లావత్
సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమాచార,ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్
***
रिलीज़ आईडी:
2273325
| Visitor Counter:
11